TE/Prabhupada 0213 - మరణాన్ని ఆపు - అప్పుడు నేను మీ అనుభూతి యోగాన్ని చూస్తాను



Morning Walk -- June 17, 1976, Toronto

భక్త జీన్: సరే, ఇది నా మనస్సులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది, మీ కరుణ వుంటే, క్రిస్టియానిటీ లో 100 A.D. నుండి ప్రస్తుతం వరకు అనుభూతి వాద యోగం యొక్క చరిత్ర ఉంది. ఇప్పుడు కొంతమంది ప్రముఖ భావయోగులు వున్నారు, తక్కువ మంది పేరుపడ్డ భావయోగులు వున్నారు, మరియూ ప్రముఖులు కాని వారు చాలా మంది వున్నారు. ఇప్పుడు మీరు వీరిని ఎలా వర్గీకరిస్తారు, ఈ క్రైస్తవ భావయోగులను, ప్రొటెస్టంట్ అలాగే కాథలిక్?

ప్రభుపాద: ఇది కొంత వరకు యోగి యొక్క అనుభూతి వాదం. అది ఆధ్యాత్మిక జీవితానికి సంభందించినది కాదు. వారు, సాధారణ జనులు కొన్నిఅద్భుతాలను చూడాలని కోరుకుంటారు కాబట్టి ఈ జ్ఞానాతీత శక్తి కొన్ని అద్భుతాలు చూపిస్తుంది మరియూ వారిని ఆశ్చర్య పరుస్తుంది. అంతే. అది ఆధ్యాత్మిక జీవితానికి సంభందించినది కాదు.

భక్త జీన్: బహుశా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వాస్తవమునకు నిజమైన భక్తి అనుభూతిని ప్రదర్శించే వారిని గురించి సూచిస్తున్నాను, సెయింట్ జాన్ ఆఫ్ ది క్రాస్, సెయింట్ ఫ్రాన్సిస్ అఫ్ అస్సిసి వంటి వారు.

ప్రభుపాద: భక్తి యుక్తి సేవ ఉంటే, అనుభూతి వాదం అవసరం ఎక్కడ ఉంది? అవసరం లేదు. భగవంతుడు నా యజమాని, నేను అతని సేవకుడను. ఈ అర్ధంలేని అనుభూతి వాదములు అవసరం ఎక్కడ ఉంది?

భక్త జీన్: నేను భావిస్తున్నాను, పదం అనుభూతి వాదం, చాలా మంది చాలా విధాలుగా అనువదిస్తున్నారు, ముఖ్యంగా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో

ప్రభుపాద: చాలామంది ప్రజలు, మనకు ఈ చాలామందితో పని ఏమీ లేదు. మీరు వాస్తవమునకు దేవుని సేవకులు అయినట్లయితే దేవుడు అక్కడ ఉన్నాడు, మీరు సేవకులు. కాబట్టి మీ లావాదేవీ ఉంది. దేవుని ఆదేశాలను నెరవేర్చడానికి. అంతే. ఎందుకు మీకు అనుభూతి వాదంకావాలి? ప్రజలకు కొన్ని గారడీ చూపించడానికా? మీరు దేవుణ్ణి సేవిస్తారు. అంతే. అది చాలా సులభం, దేవుని ఆదేశాలను. Man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) అనుభూతి వాదం యొక్క ప్రశ్న ఎక్కడ ఉంది? అనుభూతి వాదం గురించి ప్రశ్నే లేదు. దేవుడు ఇలా అన్నాడు: "నన్ను ఎల్లప్పుడూ తలచుకోండి. మీ ప్రణామములను సమర్పించండి మరియూ నన్ను ఆరాధించండి." అంతే. అనుభూతి వాదం అవసరం ఎక్కడ ఉంది? ఇది అంతా గారడి.

భారతీయుడు: నేను మీకు చెప్తాను, ఒక భావన ఉందని నేను అనుకుంటున్నాను ....

ప్రభుపాద: మీ మార్గంలో మీరు ఆలోచిస్తారు.

భారతీయుడు: అది కాదండి. ఒక తప్పు భావన ఉంది ...

ప్రభుపాద: మీరు మార్గములోకి రాకపోతే మీ ఆలోచనలో అర్థం లేదు.

భారతీయుడు: లేదండి. ఒక తప్పుఅభిప్రాయము ఉంది. ఆ అనుభూతి వాదం ఆధ్యాత్మిక పురోగతితో వస్తుంది అని వారు అంటారు. ఇది అతను చెప్పాలనుకున్నది అని నేను అనుకుంటున్నాను.

ప్రభుపాద: సమస్య మనము ఈ భౌతిక ప్రపంచములో ప్రతి జీవితములో బాధపడుతున్నాము, ఇదీ సమస్య. మన లక్ష్యం మళ్ళీ భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, దేవుని వద్దకు తిరిగి వెళ్ళటము. అని వారికి తెలియదు. వారు కొన్ని మహత్తులను చూపిస్తున్నారు. వారు ఏమి ... మరణాన్ని ఆపు. అప్పుడు నేను మీ భావానుభూతిని చూస్తాను. ఈ అర్ధంలేని అనుభూతి వాదాలు ఏమిటి? మీరు మరణాన్ని ఆపగలరా? ఇది సాధ్యమేనా? అప్పుడు ఈ అనుభూతి వాదం యొక్క అర్ధం ఏమిటి? అంతా బూటకము. నేను ఒక శరీరాన్ని అంగీకరిస్తున్నాను మరియూ భాదపడుతున్నాను, ఇది సమస్య. ఎందుకంటే నేను ఈ భౌతిక శరీరాన్ని పొందిన వెంటనే, నేను బాధ పడాలి. నేను మరొక శరీరాన్ని సృష్టిస్తున్నాను. నేను మరణిస్తాను. Tathā dehāntara-prāptiḥ ( BG 2.13) మరలా మరో అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ విధంగా, ఈ గడ్డి పరక జీవితం నుండి దేవతల వరకు, నేను కేవలం శరీరం మారుస్తున్నాను మరియూ మరణిస్తున్నాను మరియూ జన్మను తీసుకుంటున్నాను ఇది నా సమస్య. కాబట్టి అనుభూతి వాదం ఏమి చేస్తుంది? కానీ వారికి తెలియదు, సమస్య ఏమిటో ఇది భగవద్గీతలో స్పష్టంగా పేర్కొనబడింది. Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) ఇది మీ సమస్య. మీరు పదే పదే జన్మిస్తున్నారు మరల మరణిస్తున్నారు, మీరు నివసిస్తున్నప్పుడల్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. Jara-vyādhi. ముఖ్యంగా వృద్ధాప్యం మరియూ వ్యాధి. కాబట్టి ఇది సమస్య. అనుభూతి వాదం మీకు ఏమి సహాయం చేస్తుంది? ఈ అనుభూతి వాదం మీ జన్మ, మరణ, వృద్ధాప్య మరియూ వ్యాధిని ఆపుతుందా? అప్పుడు అది అనుభూతి వాదం. లేకపోతే, అటువంటి అర్ధంలేని విషయాల ఉపయోగం ఏమిటి. (విరామం) ... వాస్తవమైన మార్గం నుండి తప్పుదోవ పట్టించేది. జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలియదు, జీవిత సమస్య ఏమిటి. వారు కొన్నిఅనుభూతి వాదం సిద్ధాంతాలను సృష్టించారు, మరియూ ఎవరో నీచ ప్రజలు వారిని అనుసరిస్తున్నారు. అంతే. ఇక్కడ అనుభూతి వాదం.

భారతీయుడు: భక్తులతో సాంగత్యము ఎంత ముఖ్యమైనది?

ప్రభుపాద: అవును. Satāṁ prasaṅgān mama vīrya-saṁvido bhavanti hṛt-karna-rasāyanāḥ kathāḥ ( SB 3.25.25) కాబట్టి sādhu-saṅga కావలెను. భక్తుల సాంగత్యము. అది కావలసినది. అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది. అనుభూతి వాదం కాదు.