TE/Prabhupada 0215 - మీరు చదవాలి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు
Interview with Newsweek -- July 14, 1976, New York
విలేకరి: మీరు మీ చిన్నప్పుడు ఏమి చేసినారో నాకు దయచేసి కొంచెము చెప్పండి
ప్రభుపాద: నేను నీకు ఎందుకు చెప్పాలి?
విలేకరి: నన్ను క్షమించండి?
ప్రభుపాద: నేను నీకు ఎందుకు చెప్పాలి? విలేకరి: మీకు ఇష్టమైతే.
ప్రభుపాద: నేను ఎందుకు చెప్పాలి?
విలేకరి: సరే, విలేఖరులు ఈ ప్రశ్నలను అడగాలి. లేకపోతే నేను ఉద్యోగములో నుండి తీసివేయబడతాను.
హరి-సౌరి: ప్రభుపాద మీరు ఈ సంస్థకు సంబంధించిన దాని గురించి అడుగుతారని ఆశిస్తున్నారు...
రామేశ్వర: మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజలకు ఉంది, శ్రీలప్రభుపాద వారు మీ మీద ఆసక్తి కలిగి ఉంటే, వారు సహజముగా మీ పుస్తకాలలో మీద కూడా ఆసక్తి కలిగి ఉంటారు. మనము అమ్ముతున్న ఈ పుస్తకాల రచయిత గురించి చాలా తెలుసుకోవాలని వారు ఆసక్తి కలిగి ఉంటారు.
ప్రభుపాద: కానీ ఈ పుస్తకాలు, పుస్తకాలు... మనము పుస్తకాల గురించి మాట్లాడతాము. ఇది రచయిత గతంలో ఏమి చేసినాడు అనే దాని పైన ఆధారపడి ఉంటుందా?
విలేకరి : మీరు అనేక పుస్తకాలకు అనువాదకులు అని నేను అర్ధము చేసుకుంటున్నాను.
ప్రభుపాద: అవును. ఆ అనువాదం, పుస్తకం, నేను ఎలా అనువదించాను అనే దాని గురించి మాట్లాడుతుంది.
విలేకరి: నేను ఆశ్చర్యపోతున్నాను...
ప్రభుపాద: మీరు పుస్తకాలను చదవండి, అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. నన్ను అడిగే బదులు, మీరు పుస్తకాలను చదివితే మంచిది. అది నిజమైన అవగాహన.
విలేకరి: ఆయన వ్యక్తిగతంగా ఈ చైతన్యము మీద ఏలా ఆసక్తి పెంచుకున్నారు అనే దాని మీద ఆసక్తి కలిగి ఉన్నాను. ఆయన వచ్చిన మార్గము ఏమిటి
రామేశ్వర: నేను అర్ధము చేసుకున్నాను. మీ గురు మహారాజుతో మీ సంబంధం గురించి ఆమె అడుగుతోంది, మీరు కృష్ణ చైతన్యము ఉద్యమమును ప్రారంభించటానికి ఏలా స్ఫూర్తిని పొందారు. చాలా పుస్తకాలను రాయడానికి.
ప్రభుపాద: ఈ విషయాలకు మీరు సమాధానం చెప్పవచ్చు. ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన విషయాము కాదు.
రామేశ్వర: ఉద్యమానికి వెనుక ఉన్న వ్యక్తి గురించి ప్రజలు ఎల్లప్పుడూ తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారు.
మహిళ అతిధి: అవును, ఇది సహాయ పడుతుంది. ప్రజలు ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రజలు మీ వలె ఏదిగిన వ్యక్తి మీద ఆసక్తి కలిగి ఉంటారు ఎందుకంటే వారు దాని పోల్చుకోగలరు ఆ విధముగా వారు మీరు వ్రాసేదాన్ని చదవాలని నిర్ణయించుకుంటారు.
ప్రభుపాద: మొదట విషయము ఏమిటంటే మీరు మా పుస్తకాల మీద ఆసక్తి కలిగి ఉంటే, మీరు మా పుస్తకాలను చదవండి. మీరు అర్థం చేసుకుంటారు.
విలేకరి : మిమ్మల్ని అర్ధము చేసుకుంటామా?
ప్రభుపాద: అవును.
విలేకరి: ఇదేనా మీరు మాట్లాడుతున్నది?
ప్రభుపాద: అవును.
విలేకరి: ఇదేనా ఆయన చెప్తున్నది?
ప్రభుపాద: ఒక మనిషిని గురించి తెలుసుకోవచ్చు ఆయన మాట్లాడినప్పుడు . ఆయన మాట్లాడేటప్పుడు. Tāvac ca śobhate mūrkho yāvat kiñcin na bhāṣate: ఒక అవివేకిని ఆయన మాట్లాడనంత సేపు ఆయన చాలా అందమైన వాడు ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేదంతా ఈ పుస్తకాలలో ఉన్నది, మీరు తెలివి అయిన వారు అయితే, మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు అడగవలసిన అవసరము లేదు. మాట్లాడటము...ఉదాహరణకు న్యాయస్థానములో వలె. ఒక్క గొప్ప న్యాయవాది గురించి తెలుస్తుంది ఆయన మాట్లాడేటప్పుడు. లేకపోతే అందరూ మంచి న్యాయవాదులే. కానీ ఆయన న్యాయస్థానములో మాట్లాడినపుడు, ఆయన మంచి న్యాయవాదో కాదో తెలుస్తుంది. కాబట్టి మీరు వినవలసి ఉంటుంది. మీరు చదవాలి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వాస్తవ అవగాహన దానిలో ఉంది.