TE/Prabhupada 0219 - మనము యజమానిగా మారాలని ఈ అర్థంలేని ఆలోచనను వదలి వేయండి
Lecture on SB 7.9.24 -- Mayapur, March 2, 1976
మీ దేశంలో ఎనభై శాతం, తొంభై శాతం మంది మలేరియాతో బాధపడుతున్నారు, వారు సిఫలిస్ తో ఉన్నారు. తేడా ఏమిటి? ఎందుకు మీరు...? వైద్య నిపుణుడుగా, 'ఈ వ్యాధి ఆ వ్యాధి కంటే మెరుగైనది' అని మీరు ఎందుకు వ్యత్యాసము చూపుతారు? వ్యాధి వ్యాధే. వాస్తవమునకు ఇది వాస్తవం. మీరు చెప్తారు "మలేరియా నుండి బాధపడుతున్నాము, దీని కంటే సిఫిలిస్ వలన బాధ పడటము మెరుగైనది. "కాదు. వ్యాధి వ్యాధే. అదేవిధముగా, బ్రహ్మ గాని లేదా చీమ కానీ గాని, ఈ వ్యాధి ఏమిటంటే ఎలా యజమానిగా మారాలి. ఇది వ్యాధి. అందువలన, ఈ వ్యాధిని నయం చేసేందుకు, కృష్ణుడు ఈ వ్యాధిని నయం చేయడానికి వస్తారు, స్పష్టంగా చెప్పడానికి, మూర్ఖుడా, నీవు యజమాని కాదు; మీరు సేవకుడు. నాకు శరణాగతి పొందు. ఇది ఈ వ్యాధి యొక్క నివారణ. ఎవరైనా అంగీకరిస్తే "ఇక చేయను" అని āra nāre bapa, "యజమాని కావడానికి ఇక ప్రయత్నించను. ఇక చేయను," ఇది వ్యాధి యొక్క నివారణ.
అందువల్ల చైతన్య మహా ప్రభు చెప్తారు ప్రహ్లాద మహా రాజు చెప్పినారు, nija bhṛtya-pārśvam: ( SB 7.9.24) నీ సేవకునికి సేవకునిగా నన్ను నిమగ్నము చేయుము. అదే భౌతిక విషయమును చైతన్య మహా ప్రభు చెప్తారు, gopī-bhartur pada-kamalayor dāsa-dāsa-anudāsaḥ ( CC Madhya 13.80) కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అర్థం అంటే మనము యజమానిగా మారాలని ఈ అర్థంలేని ఆలోచనను వదలి వేయడము. ఇది కృష్ణ చైతన్యము. మనము సేవకునిగా ఎలా మారాలి అని నేర్చుకోవాలి. సేవకుడు మాత్రమే కాదు, సేవకునికి, సేవకుని సేవకునికిగా... ఇది నివారణ. అందువలన ప్రహ్లాద మహారాజు ఇలా అన్నారు, "అందువల్ల నేను ఈ అర్థము లేని యజమాని అవ్వటాన్ని అర్థం చేసుకున్నాను. నా తండ్రి కూడా యజమానిగా మారడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఈ జ్ఞానం, ఇప్పుడు నేను పరిపూర్ణంగా ఉన్నాను. యజమాని కావడము వలన ఉపయోగం లేదు. మెరుగ్గా, మీరు దయతో నాకు దీవెన ఇవ్వాలంటే, దయచేసి నన్ను నీ దాసునికి సేవకుడిగా చేయుము" ఇది దీవెన అంటే. కాబట్టి కృష్ణుడి యొక్క సేవకుని సేవకునిగా మారడాన్ని నేర్చుకున్న వ్యక్తి, ఆయన పరిపూర్ణుడు. అందువల్ల చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, tṛṇād api sunīcena taror api sahiṣṇunā. ఒక సేవకుడు సహించాలి. సహించాలి సేవకుడు, కొన్నిసార్లు యజమాని చాలా విషయాలను ఆదేశిస్తాడు, కాబట్టి ఆయన కలత చెందుతాడు. కానీ ఐనప్పటికీ, ఆయన అమలు చేయాలి మరియు సహించాలి. అది పరిపూర్ణము. ఇక్కడ భారతదేశంలో ఇప్పటికీ, ఒక వ్యక్తి పెళ్లి చేసుకోబోతుండగా, కాబట్టి ఆయన... ఇది ఒక ఆచారం. ఆయన తల్లి పెళ్ళికొడుకుని అడుగుతుంది, "నా ప్రియ కుమారుడా, నీవు ఎక్కడకి వెళ్తున్నావు?" ఆయన సమాధానము ఇస్తాడు, "అమ్మా , నేను నీ కొరకు ఒక పనిమనిషిని తీసుకొస్తాను." ఇది పద్ధతి. అమ్మా , నేను మీ కోసం ఒక పనిమనిషిని తీసుకొస్తాను. అంటే "నా భార్య, నీ కోడలు, నీ సేవకురాలిగా సేవచేస్తుంది." ఇది వేదముల నాగరికత.
కృష్ణుడు పదహారు వేలమంది భార్యలతో హస్తినాపురమునకు వెళ్ళినప్పుడు, ద్రౌపది... ఇది స్త్రీకి, స్త్రీకి మధ్య సహజమైనది, వారు వారి భర్త గురించి మాట్లాడతారు. అది సహజమైనది. కాబట్టి కృష్ణుడి యొక్క ప్రతి భార్య నుండి ద్రౌపది అడుగుతుంది. అందరి నుండి కాదు. ఇది అసాధ్యం, పదహారు వేల మంది,. కనీసము ప్రధాన రాణుల నుండి ప్రారంభించినది... (అస్పష్టంగా) ఏమిటి? రుక్మిణి, అవును. వారిలో ప్రతి ఒక్కరూ వారి వివాహ వేడుకను వివరిస్తున్నారు, అది "నా..." రుక్మిణి వివరించినది "నా తండ్రి నన్ను కృష్ణుడితో వివాహము చేయాలని కోరుకున్నారు, కానీ నా అన్నయ్య ఆయన అంగీకరించలేదు. ఆయన శిశుపాలునితో వివాహం చేయాలని కోరుకున్నాడు. నేను అ ఆలోచనను ఇష్టపడలేదు. నేను కృష్ణుడికి రహస్యముగా ఒక లేఖ రాశాను, 'నేను మీకు నా జీవితాన్ని అంకితం చేశాను, అయితే ఇది పరిస్థితి. దయచేసి వచ్చి నన్ను అపహరించండి. ' కాబట్టి ఈ విధముగా కృష్ణుడు నన్ను అపహరించారు. మరియు నన్ను తన సేవకురాలిగా చేసుకున్నారు. " రాణి కుమార్తె, రాజు కుమార్తె... వారిలో ప్రతి ఒక్కరూ రాజు కుమార్తె. వారు సాధారణ వ్యక్తి కుమార్తె కాదు. కానీ వారు కృష్ణుడి యొక్క సేవకులుగా మారాలని అనుకున్నారు. ఇది ఆలోచన, సేవకునిగా పనిమనిషిగా మారడానికి. ఇది మానవ నాగరికత యొక్క ఆదర్శం. ప్రతి స్త్రీ తన భర్తకు పరిచారిక కావాలని ప్రయత్నించాలి, ప్రతి పురుషుడు కృష్ణుడికి వంద రెట్లు సేవకునిగా మారడానికి ప్రయత్నించాలి. ఇది భారతీయ నాగరికత, "భర్త మరియు భార్య, సమాన హక్కులు కలిగి ఉన్నారు అని కాదు." యూరప్లో, అమెరికాలో ఉద్యమం జరుగుతోంది, "సమాన హక్కులు." అది వేదముల నాగరికత కాదు. వేదముల నాగరికత భర్త కృష్ణుడి యొక్క నిజాయితీగల సేవకునిగా ఉండాలి, భార్య భర్తకు యథార్థమైన దాసిగా ఉండాలి.