TE/Prabhupada 0234 - భక్తుడు అవ్వటము గొప్ప అర్హత
Lecture on BG 2.4-5 -- London, August 5, 1973
ప్రహ్లాద మహారాజు... నరసింహస్వామి ప్రహ్లాద మహారాజును, ఇప్పుడు మీరు ఏ విధమైన వరమునైన అడగవచ్చు. ప్రహ్లాద మహారాజు ఇలా సమాధానమిచ్చారు, "నా భగవంతుడా, మేము భౌతిక వ్యక్తులము. నేను పూర్తిగా భౌతిక వ్యక్తి అయిన తండ్రికి జన్మించాను. నేను భౌతిక వ్యక్తి అయిన తండ్రికి జన్మించినందున, నేను కూడా భౌతిక వ్యక్తిని. మీరు, భగవంతుడు దేవాదిదేవుడు, మీరు నాకు వరము ఇవ్వాలని అనుకుంటున్నారు. నేను మీ వద్ద నుండి ఏ వరమునైన పొంతదగలను. అది నాకు తెలుసు. కానీ దాని వలన ఉపయోగం ఏమిటి? ఏ వరమునైన నేను ఎందుకు అడుగుతాను? నేను నా తండ్రిని చూశాను. భౌతికముగా, అతడు చాలా శక్తివంతముగా ఉన్నాడు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు కూడా నా తండ్రి ఎర్రటి కళ్ళకు భయపడ్డారు. అయిన విశ్వం మీద నియంత్రణ పొందాడు. అయిన చాలా శక్తివంతమైనవాడు. ధనము, సంపద, అధికారం, కీర్తి, ప్రతిదీ పూర్తిగా వున్నది, కానీ మీరు ఒక నిమిషములో పూర్తి చేశారు. ఎందుకు మీరు నాకు అలాంటి వరము ఇవ్వాలనుకుంటున్నారు? వాటితో నేను ఏమి చేయాలి? నేను మీ దగ్గర నుండి ఆ వరము తీసుకుంటే, నాకు గర్వము వస్తుంది మీకు వ్యతిరేకంగా ప్రతిదీ తప్పు చేస్తాను, అప్పుడు మీరు ఒక నిమిషము లోపల పూర్తి చేస్తారు. అ0దువల్ల అలా0టి భౌతిక ఐశ్వర్యమును నాకుఇవ్వవద్దు. మీ దాసుని సేవలో నిమగ్నమయ్యే వరము నాకు మంచిది. నేను ఈ దీవెనను కోరుకుంటున్నాను. మీ దాసుని సేవలో నిమగ్నమయ్యేటట్లు వరము ఇవ్వండి, నేరుగా మీ సేవకునిగా కాకుండా
చాలా ప్రార్ధనల తరువాత, భగవంతుని శాంత పరిచిన తరువాత ... అయిన చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు అయిన కొద్దిగా శాంతించగా, అయిన అడిగాడు, "నా ప్రియమైన భగవంతుడా, నేను మరొక దీవెనను అడుగుతాను. నా తండ్రి మీకు చాలా, చాలా శక్తివంతమైన శత్రువు అది తన మరణానికి కారణం. ఇప్పుడు నేను అయినని క్షమించమని కోరుకుంటాను అయినకి విముక్తి ఇవ్వండి. "ఇది వైష్ణవ కుమారుడు అంటే. అయిన తనకు ఏమీ అడగలేదు. తన తండ్రి గొప్ప శత్రువు అని అతనికి తెలుసు, అయినప్పటికీ, అయిన దీవెనను అడుగుతున్నాడు, "ఈ పేదవాడిని విముక్తి చేయoడి." అందువల్లన భగవంతుడు నరసింహస్వామి హామీ ఇచ్చారు, "నా ప్రియమైన ప్రహ్లాద, మీ తండ్రి మాత్రమే కాదు, మీ తండ్రి తండ్రి, అయిన తండ్రి, పద్నాలుగు తరాల వారు, అందరు విముక్తిని పొందుతారు. మీరు ఈ కుటుంబంలో జన్మించినందున. " అందువల్ల ఎవరైనా భగవంతుడు యొక్క భక్తుడు అయితే, ఒక వైష్ణవుడు అయితే, అయిన కుటుంబమునకు గొప్ప సేవ ఇస్తాడు. అయినతో సంబంధం ఉన్నందున, అయిన తండ్రి, తల్లి, ఎవరైనా, వారు విముక్తి పొందుతారు. ఒక వ్యక్తి యుద్ధములో మృతి చెందివుంటే మనకు అనుభవం ఉన్నది, అయిన కుటుంబాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుంది. అదేవిధంగా, ఒక భక్తుడు కావాటము గొప్ప అర్హత. అయినకు ప్రతిదీ ఉంటుంది. Yatra yogeśvaro hariḥ yatra dhanur-dharaḥ pārthaḥ ( BG 18.78) కృష్ణుడ, భక్తుడు ఎక్కడ ఉంటారో, అక్కడ విజయము కీర్తి ఉoటాయి. ఆ హామీ ఇవ్వబడింది.