TE/Prabhupada 0237 - కృష్ణుని నామాన్ని, హరే కృష్ణ కీర్తన చేస్తూ ఉంటే మనకు కృష్ణుడితో సంబంధము ఏర్పడుతుంది



Lecture on BG 2.3 -- London, August 4, 1973


ప్రద్యుమ్న: అనువాదం - " ఓ పృథా కుమారుడా, ఈ పతనకారకమైన నపుంసకత్వమునకు లొంగవద్దు, అది నీకు సరి కాదు. శత్రువును శిక్షించేవాడా, హృదయ ధౌర్బల్యమును వదిలివేసి, లెమ్ము."

ప్రభుపాద: భగవంతుడు , కృష్ణుడు, ప్రోత్సహిస్తున్నాడు kśūdraṁ hṛdaya-daurbalyam. ఒక క్షత్రియుడు అలా మాట్లాడటము , 'కాదు లేదు, నేను నా బంధువులను చంపలేను, నా ఆయుధాలను విడిచి పెడుతున్నాను,' ఇది బలహీనత, పిరికితనం. ఎందుకు మీరు ఈ అర్థంలేనివి చేస్తున్నారు? " kśūdraṁ hṛdaya-daurbalyam."ఈ రకమైన కరుణ, క్షత్రియునిగా మీ బాధ్యతను వదలివేయడము , ఇది ఒక హృదయము యొక్క బలహీనత. దీనికి అర్థం లేదు. " " Klaibyaṁ ma sma gamaḥ pārtha naitat tvayy upapadyate. "ముఖ్యంగా నీవు. నీవు నా స్నేహితుడివి. ప్రజలు ఏమంటారు హృదయ ధౌర్బల్యమును వదలివేసి uttiṣṭha , నిలబడు, ధైర్యముగా ఉండు." కృష్ణుడు అర్జునుడిని పోరాడటానికి ఎలా ప్రేరేపిస్తున్నాడో చూడండి. ప్రజలు చాలా అజ్ఞానం కలిగి ఉన్నారు వారు కొన్నిసార్లు విమర్శిస్తారు "కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. అతను చాలా మర్యాదస్తుడు, అహింసావాది, కృష్ణుడు అతనికి పోరాడటానికి ఉత్తేజాన్నిస్తున్నాడు. " ఇది జడ దర్శన అంటారు. jada-darśana. జడ దర్శన అంటే అర్థం భౌతిక దృష్టి. అందువల్ల శాస్త్రములో చెప్పబడినది, ataḥ śrī-kṛṣṇā-nāmādi na bhaved grāhyam indriyaiḥ ( CC Madhya 17.136) శ్రీకృష్ణ నామాది. మనము కృష్ణుడి పేరు, హరే కృష్ణ కీర్తన, జపము చేస్తూ ఉంటే కృష్ణుడితో సంబంధము ఏర్పడుతుంది. ఇది కృష్ణుడితో మన సంబంధమునకు ప్రారంభము, నామాది. అందువల్ల శాస్త్రము చెప్పుతుంది, శ్రీకృష్ణ నామాది. ఆది అంటే ప్రారంభము.

కావున మనకు కృష్ణుడితో ఎలాంటి సంబంధం లేదు. కానీ మనము హరే కృష్ణ మహా మంత్రమును జపము చేస్తే, వెంటనే కృష్ణుడిని సంప్రదించే మన మొదటి అవకాశం ప్రారంభమవుతుంది. ఇది సాధన చేయాలి. అంతే కానీ వెంటనే నేను కృష్ణుడిని గ్రహించలేను. అది కాదు ... ఒకవేళ మనము పవిత్రము అయితే, అది వెంటనే సాధ్యము అవుతుంది. śrī-kṛṣṇā-nāmādi. నామము అంటే పేరు. కృష్ణుడు నామము మాత్రమే కాదు. కానీ, ఆది ప్రారంభం, కాని రూపము, లీలలు. కేవలం śravanaṁ kirtanam ( SB 7.5.23) లాగా. కృష్ణుడి మహిమ గురించి కిర్తించటము లేదా వివరించటము, శ్రవణం కీర్తన... అందువలన ఆయనకు రూపం ఉన్నది. నామ అంటే పేరు, రూప అంటే రూపం. నామ , రూప ... లీల అంటే లీలలు; గుణ అంటే లక్షణము; సహచరులు, ఆయన సహచరులు; ఇవన్నీ... Ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved ( CC Madhya 17.136) Na bhaved grāhyam indriyaiḥ. సాధారణ ఇంద్రియాలతో మనకు అర్థం కాదు ... శ్రీ కృష్ణుడి నామాన్ని గాని... మనము శ్రవణం చేయటము ద్వార, కృష్ణుడి పేరు వింటున్నాము కానీ మనము పవిత్రము కాకుండా శ్రవణము చేస్తే... అయితే, శ్రవణము ద్వారా, మనము పవిత్రము అవ్వుతాము. మనము సహాయం చేయాలి. సహాయము అంటే అపరాధాలు నివారించడాము, పది రకాల అపరాధాలు ఈ విధంగా మనం పవిత్రము అయ్యే పద్ధతికి సహాయం చేస్తాము. నేను అగ్నిని మండించాలనుకుంటే, చెక్కను ఎండబెట్టడం ద్వారా రగిలించే పద్ధతికి నేను సహాయం చేయాలి. అప్పుడు వెంటనే అగ్ని వస్తుంది. అదేవిధంగా, కేవలం జపించటం, అది మనకు సహాయం చేస్తుంది ఇది సమయం తీసుకుంటుంది. కానీ మనము అపరాధాలను చేయకుంటే , అప్పుడు మనము చాలా వేగంగా పవిత్ర మవ్వుతాము. అక్కడ ప్రభావము ఉంటుంది