TE/Prabhupada 0243 - ఒక శిష్యుడు జ్ఞానోదయం కోసం గురువు దగ్గరకు వస్తాడు
Lecture on BG 2.9 -- London, August 15, 1973
ప్రద్యుమ్న: అనువాదం, "సంజయుడు చెప్పారు: ఈ విధంగా మాట్లాడిన తరువాత అర్జునుడు శత్రువుల శిక్షకుడు, కృష్ణుడికి ఇలా చెప్పాడు, గోవింద, నేను పోరాడను, అని నిశ్శబ్దంగా ఉన్నాడు. "
ప్రభుపాద: మునుపటి శ్లోకమునులో, అర్జునుడు అన్నాడు ఈ యుద్ధములో ఎలాంటి లాభం లేదు ఎందుకంటే మరొక వైపు, వారు నా బంధువులు వారిని చంపడం ద్వారా, నేను విజయము సాధించినప్పటికీ, విలువ ఏమిటి? " ఇలాంటి రకమైన త్యాగము కొన్నిసార్లు అజ్ఞానంలో జరుగుతుందని మనము వివరించాము. వాస్తవమునకు, అది చాలా తెలివిగా చేసినది కాదు. ఈ విధంగా, ఎవమ్ ఉక్తావ, "అని అంటూ, 'అందువల్ల యుద్ధంలో లాభం లేదు.' " ఎవమ్ ఉక్తావ, "ఈ విధంగా చెప్పడం," హృషికేశం, ఇంద్రియాల గురువుతో మాట్లాడుతున్నాడు. మునుపటి శ్లోకమునులో అయిన చెప్పాడు, śiṣyas te 'haṁ prapannam: ( BG 2.7) "నేను మీ ఆశ్రయము తీసుకున్న శిష్యుడిని" కృష్ణుడు గురువు అవుతాడు, అర్జునుడు శిష్యుడు అవుతాడు. గతంలో వారు స్నేహితులులాగా మాట్లాడుకున్నారు. కానీ స్నేహపూర్వకముగా మాట్లాడడం ఏ తీవ్రముగా ఉన్న సమస్యను పరిష్కరించదు. కొన్ని తీవ్రమైన విషయములు ఉన్నప్పుడు, అది ప్రామాణికుల మధ్య మాట్లాడాలి.
హృషికేశం, నేను అనేక సార్లు వివరించాను. హృషిక అంటే అర్థం ఇంద్రియాలు, īśa అంటే గురువు. Hṛṣīka-īśa, వాటిని కలిపితే హృషికేశ అదేవిధంగా, అర్జునుడు కూడా. Guḍāka īśa. Guḍāka అంటే చీకటి, īśa ... చీకటి అంటే అజ్ఞానం.
- ajñāna-timirāndhasya
- jñānāñjana-śalākayā
- cakṣur-unmīlitaṁ yena
- tasmai śrī-guruve namaḥ
గురువు యొక్క విధి ... ఒక శిష్యుడు, శిష్యుడు, జ్ఞానోదయం కోసం గురువు దగ్గరకు వస్తాడు. ప్రతి ఒక్కరు మూఢునిగా జన్మిస్తారు. ప్రతి ఒక్కరూ. మానవులు కూడా, ఎందుకంటే వారు పరిణామ పద్ధతి ద్వారా జంతు రాజ్యం నుండి వస్తున్నరు , అందువలన జన్మించడము అదే పద్ధతి, అజ్ఞానం. జంతువుల వలె అందువలన, మానవుడు అయినప్పటికీ అతనికి విద్య అవసరం. జంతువు విద్యను తీసుకోలేదు, కానీ ఒక మనిషి విద్యను పొందవచ్చు. అందువల్ల శాస్త్రములో చెప్తారు nāyaṁ deho deha-bhājāṁ nṛloke kaṣṭān kāmān arhate vid-bhujāṁ ye ( SB 5.5.1) నేను అనేక సార్లు ఈ శ్లోకమును పలికాను, ఇప్పుడు ఆ ... మానవ జన్మ కంటే తక్కువ స్థానములో, మనము చాలా కష్టపడి పనిచేయాలి, జీవితం యొక్క నాలుగు అవసరాలు కోసం: తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము రక్షించుకోవటము. ఇంద్రియ తృప్తి. ప్రధాన విషయము ఇంద్రియ తృప్తి. అందువల్ల ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేయాలి. కానీ మానవ రూపంలో, కృష్ణుడు మనకు చాలా సౌకర్యాలు, తెలివితేటలు ఇస్తాడు. మన జీవన ప్రమాణాలు చాలా సౌకర్యంగా చేసుకోగలము, కానీ కృష్ణ చైతన్యము లో పరిపూర్ణత సాధించే ఉద్దేశ్యంతో. మీరు సౌకర్యవంతంగా నివసిoచండి. పర్వాలేదు. కానీ జంతువుల వలె జీవించ వద్దు, కేవలం ఇంద్రియ తృప్తి పెంచుకోవడానికి. మానవ ప్రయత్నం సౌకర్యవంతంగా ఎలా జీవించాలనే దానిపై జరుగుతుంది, కానీ వారు ఇంద్రియ తృప్తి కోసం హాయిగా జీవించాలనుకుంటున్నారు. ఇది ఆధునిక నాగరికత యొక్క పొరపాటు. Yuktāhāra-vihāraś ca yogo bhavati siddhiḥ. భగవద్గీతలో yuktāhāra అని అంటారు. అవును, మీరు తప్పకుండా నిద్రించాలి, మీరు తప్పకుండా తినాలి, మీరు మీ ఇంద్రియాలను సంతృప్తి పరచాలి, మీరు రక్షణ కోసం ఏర్పాట్లు చేయాలి - సాధ్యమైనంత వరకు, దృష్టిని మళ్ళించడానికి కాదు. మనము తినాలి,yuktāhāra. అది నిజం. కానీ అత్యహరా కాదు. రూపగోస్వామి తన ఉపదేశామృత లో సలహా ఇచ్చారు
- atyāhāraḥ prayāsaś ca
- prajalpo niyamagrahaḥ
- laulyaṁ jana-saṅgaś ca
- ṣaḍbhir bhaktir vinaśyati
- ( NOI 2)
మీరు ఆధ్యాత్మిక చైతన్యములో ఉన్నత స్థానమునకు వెళ్ళాలని కోరుకుంటే - అది జీవితము యొక్క ఒకే ఒక్క లక్ష్యం మాత్రమే అయితే - అప్పుడు మీరు ఎక్కువ తినకూడదు, అత్యాహర, లేదా మరింత సేకరించకూడదు. Atyāhāraḥ prayāsaś ca prajalpo niyamagrahaḥ. అది మన తత్వము.