TE/Prabhupada 0249 - యుద్ధం ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించబడింది



Lecture on BG 2.6 -- London, August 6, 1973


అందువల్ల అయిన పోరాడాలా వద్ద అని అర్జునుడు ఆలోచించ వలసిన పని లేదు. ఇది కృష్ణుడి చేత మంజూరు చేయబడిoది, అందువల్ల అక్కడ యుద్ధము ఉండాలి. మనము నడుచుచునప్పుడు, "యుద్ధం ఎందుకు జరుగుతుంది?" అని ప్రశ్నించబడింది. ఇది కష్టమైన విషయము కాదు ఎందుకంటే. ప్రతి ఒక్కరూ పోరాట స్పూర్తితో వున్నారు పిల్లలు కూడా యుద్ధము చేస్తారు, పిల్లులు కుక్కలు యుద్ధము చేస్తాయి, పక్షులు యుద్ధము చేస్తాయి, చీమలు పోరాటము చేస్తాయి. మనము దానిని చూశాము. ఎందుకు మానవులు చేయకూడదు? పోరాట స్పూర్తి ఉంది. అది జీవన స్థితి యొక్క లక్షణాలలో ఒకటి. యుద్ధము చేయుట. ఆ యుద్ధము ఎప్పుడు జరగాలి? ప్రస్తుత సమయంలో,ఉన్నత స్థితిని కోరుకునే రాజకీయ నాయకులు, వారు పోరాడుతున్నారు. కానీ యుద్ధములో, వేదముల నాగరికత ప్రకారం, పోరాటము అంటే ధర్మా-యుద్ధము. ధర్మ సూత్రాలపై. చపలత్వంతో రాజకీయ ఆలోచనల కోరకు కాదు. రెండు రాజకీయ సమూహాలు, కమ్యూనిస్ట్ పెట్టుబడిదారుల మధ్య ఇప్పుడు యుద్ధము జరుగుతోంది. వారు పోరాటాన్ని మాత్రమే నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ యుద్ధము జరుగుతూనేఉంది. అమెరికా కొన్ని రంగాలలో ఉన్న వెంటనే, వెంటనే రష్యా కూడా అక్కడ ఉంటుంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య చివరి యుద్ధములో, అధ్యక్షుడు నిక్సన్ వారి ఏడవ నౌకా దళమును పంపిన వెంటనే, భారతదేశ మహాసముద్రంలో, బే అప్ బెంగాల్లో, దాదాపు భారతదేశం ముందు ... ఇది చట్టవిరుద్ధం. కానీ చాలా గర్వముతో, అమెరికా. పాకిస్తానుకు సానుభూతి చూపడానికి, ఏడవ నౌకా దళమును పంపింది. కానీ వెంటనే మన రష్యన్ స్నేహితుడు కూడా అక్కడకు వచ్చాడు. అందువలన, అమెరికా తిరిగి వచ్చేసింది. లేకపోతే, నేను అనుకుంటున్నాను, అమెరికా పాకిస్తాన్ తరఫున దాడి చేసేది.

ఇది జరుగుతోంది. పోరాటము మీరు ఆపలేరు. చాలామంది ప్రజలు యుద్ధాన్ని ఎలా ఆపాలో అని వారు ఆలోచిస్తున్నారు. అది అసాధ్యం. ఇది అర్ధంలేనిది. ఇది సాద్యము కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పోరాట స్పూర్తి ఉంది. ఇది జీవి యొక్క ఒక లక్షణం. రాజకీయాలు తెలియని పిల్లలు, శత్రుత్వం లేనప్పటికీ, వారు ఐదు నిమిషాలు పోరాడుతారు. మళ్ళీ వారు స్నేహితులు అవ్వుతారు. పోరాట స్పూర్తి ఉంది. ఇప్పుడు, ఎలా ఉపయోగించాలి? మన కృష్ణ చైతన్య ఉద్యమం ఉంది. మనము చైతన్యము అని చెప్పుతాము. మనం చెప్పము, "యుద్ధము ఆపoడి" లేదా "దీన్ని చేయి, అలా చేయండి, అలా చేయండి", కాదు. కృష్ణ చైతన్యములో ప్రతిదీ చేయాలి.అది మన ప్రచారము. Nirbandha-kṛṣṇa-sambandhe. మీరు ఏమి చేసినా, అది కృష్ణుడికి సంతృప్తి కలిగే దానితో కొంత సంబంధం కలిగి ఉండాలి. కృష్ణుడు సంతృప్తి చెందితే, అప్పుడు మీరు వ్యవహరిస్తారు. ఇది కృష్ణ చైతన్యము. Kṛṣṇendriya tṛpti vāñchā tāra nāma prema ( CC Adi 4.165) ఇది ప్రేమ. మీరు ఎవరినైన ప్రేమిస్తే; మీ ప్రియమైన వ్యక్తి కోసం, మీరు ఏమైన చేయగలరు, మనము కొన్నిసార్లు చేస్తాము. అదేవిధంగా, అదే విధముగా కృష్ణుడి కోసము చేయాలి. అంతే. కృష్ణుడిని ఎలా ప్రేమిoచాలో కృష్ణుడితో ఎలా వ్యవహరించాలో నేర్చుకోండి. ఇది జీవితం యొక్క పరిపూర్ణము. Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) భక్తి అoటే సేవ bhaja-sevāyām. bhaj-dhātu, ఇది సేవను అందించడానికి ఉద్దేశించినది, భజా. భజా, సంస్కృత వ్యాకరణం ఉంది, kti-pratyaya, ఇది నామవాచకం చేయడానికి. ఇది క్రియ కావున bhaj-dhātu kti అంటే భక్తి భక్తి అoటే కృష్ణుడిని సంతృప్తి పరచుట. భక్తిని ఎవరికీ వుపయోగించకుడదు. ఎవరైనా చెప్తే "నేను కాళీ, దేవత కాళీ యొక్క గొప్ప భక్తుడిని" అది భక్తి కాదు, అది వ్యాపారము. ఎందుకంటే, మీరు పూజించే ఏ దేవతనైన అయినా, దాని వెనుక కొంత ప్రయోజనం ఉంది. సామాన్యంగా, ప్రజలు మాంసం తినడం కోసం కాళీ దేవత యొక్క భక్తులు అవుతారు . అది వారి ఉద్దేశం. వేద సంస్కృతిలో మాంసం తినేవారికి వారు సలహా ఇస్తారు కబేళా లేదా మార్కెట్ నుండి కొనుగోలు చేసిన మాంసాన్ని తినవద్దు. వాస్తవానికి, ఈ పద్ధతి ప్రపంచం నలుమూలల ఎక్కడా ఎప్పుడూ లేదు, ఆది కబేళాను నిర్వహించడము. ఇది తాజా ఆవిష్కరణ. మనము క్రైస్తవ పెద్దలతో కొన్నిసార్లు మాట్లాడుతాము, ఆ విషయాన్ని విచారిస్తున్నప్పుడు క్రీస్తు 'నీవు చంపకూడదు' అని అన్నాడు; మీరు ఎందుకు చంపుతారు? వారు "క్రీస్తు కొన్నిసార్లు మాంసం తిన్నడు" అని సాక్ష్యం ఇస్తారు. కొన్నిసార్లు క్రీస్తు మాంసం తిన్నాడు, అది సరియైనది, కాని క్రీస్తు "మీరు పెద్ద పెద్ద పెద్ద కబేళాన్ని నిర్వహిస్తూ, మాంసాన్ని తిoటు ఉండండి అని చెప్పాడా?" ఏ విధమైన అర్థమూ లేదు. క్రీస్తు తినవచ్చు. కొన్నిసార్లు అయిన ... ఏదీ లేనట్లయితే, తినడానికి ఏమీ అందుబాటులో లేక పోతే, మీరు ఏమి చేయగలరు? అది మరొక ప్రశ్న. కష్టమైనా పరిస్థితిలో, మాంసం మినహాయించి... ఏ ఇతర ఆహారమూ లేనప్పుడు ఆ సమయం వస్తోంది. ఈ యుగంలో, కలి యుగములో, క్రమంగా ఆహార ధాన్యాలు తగ్గుతాయి. ఇది శ్రీమద్-భగవతం, పన్నెండవ స్కందములో చెప్పబడింది. బియ్యం ఉండవు, గోధుమలు ఉండవు, పాలు ఉండవు, చక్కెర అందుబాటులో ఉండదు. ప్రతి ఒక్కరు మాంసం తినాలి. ఇ విధముగా పరిస్థితి ఉంటుంది ఇంకా మానవ మాంసాన్ని కూడా తినవచ్చు. ఈ పాపాత్మకమైన జీవితం అధోగతి చెందుతుంది, తద్వారా వారు మరింత పాపంగా మారతారు. Tān aham dviṣataḥ krūrān kṣīpāmy ajasram andhe-yoniṣu ( BG 16.19) రాక్షసులుగా ఉన్నవారు, పాపాత్ములైనవారు, ప్రకృతి యొక్క చట్టం అటువంటి పరిస్థితిలో అతన్ని ఉంచుతుంది అయిన మరింత రాక్షసుడు అవుతాడు, దేవుడిని ఎన్నటికీ అర్ధము చేసుకోలేడు . ఇది ప్రకృతి యొక్క చట్టం. నీవు దేవుణ్ణి మర్చిపోవాలనుకుంటే, దేవుడు అటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. నీవు ఎప్పటికీ దేవుడిని అర్ధము చేసుకోలేవు ఇది రాక్షస జీవితం. ఆ సమయం కూడా వస్తోంది. ప్రస్తుతానికి, కొద్దిమంది వ్యక్తులు ఆసక్తి కలిగి ఉన్నారు, దేవుడు అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి. Arto arthārtī jijñāsu jñānī ( CC Madhya 24.95) దేవుడు గురిoచి అర్థoచేసుకోకుoడా ఉoడే దానికి సమయoవచ్చిoది. అది కలి యుగము చివరి దశ, ఆ సమయంలో కల్కి అవతారము, కల్కి అవతారము వస్తుంది. ఆ సమయంలో దేవుడి చైతన్యం ప్రచారము ఉండదు, కేవలం చంపడం, కేవలం చంపడం. అయిన కత్తితో కల్కి అవతారాము కేవలం నరమేధం చేస్తాడు. అప్పుడు మళ్ళీ సత్య యుగము వస్తుంది. మళ్ళీ స్వర్ణయుగం వస్తుంది