TE/Prabhupada 0251 - గోపికలు కృష్ణుని యొక్క శాశ్వత సహచరులు



Lecture on BG 2.6 -- London, August 6, 1973


అందువల్ల మొత్తము భగవద్గీత యొక్క ఆదేశం ఏమిటంటే: మీరు మీ కోసం పని చేయకూడదు; మీరు కేవలం కృష్ణుడి కోసం పని చేయాలి. కృష్ణుడి కోసము పోరాడుతున్నా, లేదా కృష్ణుడి కోసము అసహ్యకరమైనది చేస్తున్న కేవలం గోపీకల వలె. గోపీకలు కృష్ణుడి చేత ఆకర్షించబడ్డారు. కృష్ణుడు ఒక యువ బాలుడు, చాలా అందమైనవాడు, గోపీకలు చిన్న అమ్మాయిలు. అది బాహ్యముగా ... వాస్తవానికి, గోపీకలు కృష్ణుడి యొక్క శాశ్వత సహచరులు. Ānanda-cinmaya-rasa-pratibhāvitābhiḥ (Bs. 5.37). వారు కృష్ణుడి, కృష్ణుడి యొక్క ఆనంద శక్తి విస్తారములు. వారు కృష్ణుడి ఆనందం కోసం ఉద్దేశించబడ్డారు. వారు సాధారణ మహిళలు కాదు. కానీ బాహ్యముగా, కృష్ణుడిని ఎలా ప్రేమించాలనేది మనకు నేర్పించటానికి ఎంతటి అపాయముతోనైన ... అందువలన గోపీకలు, అర్ధరాత్రి కృష్ణుడిచే ఆకర్షింపబడినప్పుడు ... కృష్ణుడు వేణువును ఉదుతున్నప్పుడు, వారు ఆకర్షించబడ్డారు వారు ఇంటిని వదలి వెళ్లారు. వారిలో కొoత మంది ఆగి పోయారు. వారు తమ జీవితాన్ని కూడా విడిచిపెట్టారు. వారు చాలా ఆకర్షించబడ్డారు. ఇప్పుడు ఈ రకమైన ప్రవర్తన, యువతులలో ఉంటే ... వేద నాగరికత ప్రకారం, వారు తండ్రి, భర్త లేదా సోదరుడి రక్షణ నుండి బయటకు వెళ్ళకూడదు. లేదు, వారు వెళ్లలేరు. ముఖ్యంగా అర్ధరాత్రి. ఇది వేదముల సూత్రానికి వ్యతిరేకం. ఒక రకమైన బహిరంగా వ్యభిచారము. కానీ ఇది కృష్ణుడికి చేయబడినది కనుక, చైతన్య మహాప్రభుకు సిఫారస్సు చేసిన కారణంగా, ramyā kācid upāsanā vraja-vadhubhiḥ kalpitā: వ్రజా గోపికలు ఊహించిన దాని కంటే ఉన్నతమైన ఆరాధన లేదు. Vraja-vadhu. చాలా అసహ్యకరమైనది. ఒక చిన్న అమ్మాయి భర్త, తండ్రి సంరక్షణ నుండి, మరొక యువకుని దగ్గరకు వెళ్ళటము, వేద సంస్కృతి ప్రకారం, ఇది చాలా అసహ్యకరమైనది. ఇప్పటికీ, ఎందుకంటే, ఇది కృష్ణుడి కోసము చేయబడినది కనుక, ఇది అత్యoత ఉన్నతమైన ఆరాధనగా అంగీకరించబడింది. ఇది కృష్ణ చైతన్యము. కృష్ణుడిని కోసము ఎలా పని చేయాలో నేర్చుకోవాలి, కృష్ణుడిని మాత్రమే ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి. అప్పుడుమనజీవితం విజయవంతమవ్వుతుంది. మానవ జీవితం ... ఎందుకంటే మనం వైకుంఠాము నుండి కొన్ని వేల సంవత్సరాల క్రితం వేల కోట్ల సంవత్సరాల క్రితం వచ్చాము. Anādi karama-phale. Anādi అంటే సృష్టికి ముందు అని అర్ధం. మనము జీవులము, మనము శాశ్వతము. సృష్టి కుడా లక్షలాది సoవత్సరాలు, ట్రిలియన్ల సoవత్సరాల తర్వాత నాశనo చేయబడుతోoది, కాని జీవులు నాశనo చేయబడరు. Na hanyate hanyamāne śarīre ( BG 2.20) వారు ఉంటారు. ఈ మొత్తం విశ్వo నాశనం చేయబడినప్పుడు,జీవులు విష్ణువు యొక్క శరీరంలోనే ఉంటారు. మరల మరో సృష్టి జరుగినప్పుడు, వారు వారి కోరికలను నెరవేర్చుకోవడానికి వారు తిరిగి వస్తారు.వాస్తవమైన కోరిక దేవుడి దగ్గరకు తిరిగి వెళ్ళడము, తిరిగి భగవద్ ధామమునకు ఎలా వెళ్ళటము.

ఈ అవకాశం ఇవ్వబడిoది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే, ఈ జీవితం, మానవ జీవితం , ఆది చాలా చాలా ప్రమాదకరమైంది. మళ్ళీ మనం జన్మ మరణ చక్రమును అంగీకరించ వలసి ఉంటుంది. అది మాత్రమే కాదు, మనము జీవితం యొక్క లక్ష్యము పూర్తి చేయలేకపోతే, అప్పుడు తిరిగి మొత్తం సృష్టి యొక్క వినాశనం ఉంటుంది మనము మిలియన్ల ట్రిలియన్ల సంవత్సరాలు విష్ణువు యొక్క శరీరం లోపల ఉండ వలసి ఉంటుంది. మరలా మనము రావాలి. అందుచే దీనిని anādi karama-phale అని పిలుస్తారు. anādi అంటే "సృష్టికి ముందే". ఇది జరుగుతోంది. మూర్ఖపు జీవులకు ప్రచారము చేయడానికి, కృష్ణుడు వ్యక్తిగతంగా వస్తాడు. కృష్ణుడు మనల్ని తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడానికి, భగవంతుడు దగ్గరకు తిరిగి తీసుకు వెళ్ళటానికి చాలా ఆత్రుతగా ఉన్నాడు. ఎందుకంటే మనము కృష్ణుడిలో భాగము కనుక. ఉదాహరణకు మీ పిల్లవాడు వీధులలో తిరుగుతు వుంటే, మీరు ఆత్రుత చెందరా? , అక్కడ ఏదైనా ప్రమాదం ఉండవచ్చు, చిన్న పిల్లవాడు చంపబడుతాడు. మీరు వెళ్ళి, కనుగొనేందుకు ప్రయత్నించండి. కృష్ణుడి పరిస్థితి కుడా అదేవిధంగా ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచములో మనము జన్మ జన్మలుగా బాధ పడుతున్నాము. Duḥkhālayam aśāśvatam ( BG 8.15) ఈ ప్రదేశము దౌర్భాగ్యమైనది. కానీ మాయ యొక్క భ్రాంతి, మనము ఈ దౌర్భాగ్యమైన జీవితాన్ని ఆనందంగా తీసుకుంటున్నాము. దీన్ని మాయ అని పిలుస్తారు. కానీ అది ... ఈ భౌతిక ప్రపంచంలో ఏ ఆనందం లేదు. అంతా బాధాకరమైనది. ఈ భౌతిక ప్రపంచములో ప్రతిదీ బాధాకరమైనదిగా ఉంటుoది అని మనము తెలుసుకున్నప్పుడు ఎంత త్వరగా మనము ఈ బౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి, భగవత్ ధామమునకు తిరిగి వెళ్ళుతామో, తిరిగి వెళ్తాము ... అది మన విచక్షణ. లేకపోతే, మనము ఏమి చేస్తున్నా, మనము ఓడిపోతాము. మనము లక్ష్యం తప్పిపోయినందున. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) Durāśayā. మనము ఎంతో ఆశతో - ఇది ఎప్పటికీ నెరవేరదు - మనము దేవుడు చైతన్యము లేకుండా సంతోషంగా మారడానికి ఇక్కడ విషయాలు సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది ఎప్పటికీ జరుగదు ... Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇuṁ durāśayā. Durāśayā అంటే "ఎన్నటికీ నెరవేరని ఆశ."