TE/Prabhupada 0253 - వాస్తవమైన ఆనందం భగవద్గీతలో వర్ణించబడిoది



Lecture on BG 2.8 -- London, August 8, 1973


ప్రద్యుమ్న:

na hi prapaśyāmi mamāpanudyād
yac chokam ucchoṣaṇam indriyāṇām
avāpya bhūmāv asapatnam ṛddhaṁ
rājyaṁ surāṇām api cādhipatyam
(BG 2.8)

అనువాదం, " ఇంద్రియాలను శోషింప జేయునటువంటి ఈ శోకమును తొలగించుకొనే మార్గమును నేను గాంచలేకున్నాను దేవతల స్వర్గాదిపత్యము వలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును దరిత్రిపై సాధించినను ఈ శోకము నేను తొలగించుకొనజాలను

ప్రభుపాద: Na hi prapaśyāmi mamāpanudyād. ఇది భౌతిక జీవితము యొక్క పరిస్థితి. మనము కొన్నిసార్లు ఇబ్బందుల్లో ఉoటాము. కొన్నిసార్లు కాదు. ఎల్లప్పుడూ, మనము ఇబ్బందుల్లో ఉoటాము, కానీ మనము దానిని కొన్నిసార్లు అని పిలుస్తాము, ఎందుకంటే కష్టాలను అధిగమించడానికి, మనము కొంత ప్రయత్నం చేస్తాము, ఆ ప్రయత్నమును ఆనందముగా తీసుకుంటాము. వాస్తవమునకు ఆనందం లేదు. కానీ కొన్నిసార్లు, ఆశతో: "ఈ ప్రయత్నం ద్వారా, నేను భవిష్యత్తులో సంతోషంగా వుంటాను," ... శాస్త్రవేత్తలు అని పిలవబడే వారు కలలు కoటున్నారు: "భవిష్యత్తులో మనం మరణం లేకుండానే ఉంటాము." చాలామంది, వారు కలలు కoటున్నారు. కానీ తెలివైన వ్యక్తులు, వారుచెప్పుతారు: "భవిష్యత్తును నమ్మకండి , ఎంత ఆహ్లాదకరమైనది అయిన ."

అది వాస్తవమైన పరిస్థితి. Na hi prapaśyāmi mamāpanudyād. అందువలన అయిన కృష్ణుడి వద్దకు వచ్చాడు: śiṣyas te 'ham ( BG 2.7) నేను ఇప్పుడు మీ శిష్యుడిని అవ్వుతాను నీవు ఎందుకు నా దగ్గరకు వచ్చావు? నాకు తెలుసు ఎందుకంటే ఎవ్వరూ ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుండి నన్ను రక్షించలేరు. ఇది వాస్తవము. Yac chokam ucchoṣaṇam indriyāṇām ( BG 2.8) Ucchoṣaṇam. మనము గొప్ప ఇబ్బందులలో పెట్టబడినప్పుడు, ఆది ఇంద్రియాల ఉనికిని తగ్గిస్తుంది. ఏ విధమైన ఇంద్రియ తృప్తి మనకు సంతోషాన్ని కలిగించదు. Ucchoṣaṇam indriyānām. ఆనందం అంటే ఇంద్రియ తృప్తి. వాస్తవమునకు ఇది ఆనందం కాదు. వాస్తవమైన ఆనందం భగవద్గీతలో వర్ణించబడిoది: atīndriyam, sukham atyantīkaṁ yat tat atīndriyam ( BG 6.21) వాస్తవమైన ఆనందం, atyantikam,, మహోన్నతమైన ఆనందం, ఇంద్రియాలు ఆనందించలేవు. Atīndriya, ఇంద్రియాలను అధిగమించడం. అది వాస్తవమైన ఆనందం. కానీ మనము సoతోషాన్ని ఇంద్రియ ఆనందముగా తీసుకున్నాము. ఇంద్రియ తృప్తి ద్వార ఎవ్వరూ సoతోషoగా లేరు. ఎందుకంటే మనము భౌతిక జీవితములో ఉన్నాము. మన ఇంద్రియాలు అసంపూర్ణ ఇంద్రియాలు. వాస్తవ ఇంద్రియాలు - ఆధ్యాత్మిక ఇంద్రియాలు. మనము ఆధ్యాత్మిక చైతన్యమును మేల్కొల్పాలి. అప్పుడు ఆధ్యాత్మిక ఇంద్రియాల ద్వార మనము ఆనందించవచ్చు. Sukham atyantikaṁ yat atīndriya ( BG 6.21) ఈ ఇంద్రియాలను అధిగమించడం ద్వార. ఈ ఇంద్రియాలను అధిగమించడం అంటే ... ఈ ఇంద్రియాలు, అంటే కప్పబడివున్నాయి. ఉదాహరణకు నేను ఈ శరీరము . వాస్తవమునకు నేను ఈ శరీరం కాదు. నేను ఆత్మను. కానీ ఇది నా వాస్తవమైన శరీరం, ఆధ్యాత్మిక శరీరం యొక్క కప్పు అదేవిధంగా, ఆధ్యాత్మిక శరీరము ఆధ్యాత్మిక ఇంద్రియాలను కలిగి ఉంది. నిరాకారా కాదు. ఎందుకు నిరాకారా? ఇది ఒక సాధారణ-జ్ఞానపు వ్యవహారం. ఉదాహరణకు మీకు, ఒకటి లేదా రెండు చేతులు, మీకు రెండు చేతులున్నాయి. చేతిని వస్త్రంతో కప్పి ఉంచినప్పుడు, వస్త్రం కూడా చేతిని కలిగి ఉంటుంది. నాకు చేయి ఉన్నందువలన నా దుస్తులు కుడా ఒక చేతిని కలిగి ఉన్నాయి నాకు నా కాళ్ళు ఉండటము వలన , అందుచే నా దుస్తులు పాంటె, కాళ్ళను, కలిగి ఉన్నది. ఇది ఒక సాధారణ-జ్ఞానము. ఈ శరీరం ఎక్కడ నుండి వచ్చింది? ఈ శరీరమును వర్ణించారు: vāsāṁsi, వస్త్రాలు. వస్త్రం అంటే శరీరానికి తగ్గట్టుగా కత్తిరించ బడుతుంది. అది వాస్తవము. నా శరీరం వస్త్రం ప్రకారం తయారు చేయబడదు. ఇది ఒక సాధారణ జ్ఞానము. నేను నా చొక్కా చేతులు కలిగి ఉన్నప్పుడు, ఇది నా సూక్ష్మ శరీరం లేదా స్థూల శరీరం, వాస్తవానికి, ఆధ్యాత్మికంగా, నాకు నా చేతులు కాళ్ళు వున్నాయి. లేకపోతే, అవి ఎలా వస్తాయి? మీరు ఎలా అభివృద్ధి చెందుతారు?