TE/Prabhupada 0261 - భగవంతుడు భక్తుడు, వారు ఒకే స్థాయిలో ఉన్నారు



Lecture -- Seattle, September 27, 1968



ప్రభుపాద: ఇప్పుడు మీ దేశంలో ఈ బాలురు ఈ కృష్ణ చైతన్యఉద్యమాన్ని ప్రచారము చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నా వినయపూర్వకమైన అభ్యర్ధన ,మీ అందరికి ఏమిటంటే జీవితంలో ఈ ఉత్కృష్టమైన దీవెనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించoడి. కేవలం హరే కృష్ణ మంత్రమును కీర్తన,జపము చేసేటప్పుడు, మీరు క్రమంగా కృష్ణుడి పట్ల ఒక పరస్పర ప్రేమపూర్వక వైఖరిని అభివృద్ధి చేసుకుంటారు. మీరు కృష్ణుడిని ప్రేమించేటప్పుడు, మీ అన్ని కష్టాలు ... మీరు పూర్తి సంతృప్తి అనుభూతి చెందుతారు. ఇబ్బంది లేదా బాధ మనసు వలన ఉంది. ఒక వ్యక్తికి $ 6000 నెలకు సంపాదిస్తున్నాడు; ఒక వ్యక్తి ఒక నెలకు $ 200 సంపాదిస్తున్నాడు. కానీ నేను కలకత్తాలో ఒక పెద్దమనిషిని చూశాను, అయిన 6,000 సంపాదిస్తున్నాడు; అయిన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య. ఎందుకు చేసుకున్నాడు? ఆ డబ్బు అయినకి సంతృప్తి ఇవ్వలేదు. అయిన ఏదో వేరే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ భౌతిక వాతావరణం, డబ్బు ఎక్కువ మొత్తం సంపాదించడం ద్వారా, ఎన్నడూ మీకు సంతృప్తి ఇవ్వదు, ఎందుకనగా మనలో ప్రతీ ఒక్కరూ ఇంద్రియాలకు సేవకులుగా ఉన్నాము ఇంద్రియాల యొక్క ఈ సేవ స్థితిని కృష్ణుడి సేవకు బదిలీ చేయాలి, అప్పుడు మీరు అన్ని సమస్యలకు పరిష్కారము కనుగొంటారు. చాలా ధన్యవాదాలు.(భక్తులు ప్రణామములు చేస్తున్నారు) ఏమైనా సందెహలు ఉన్నాయా? భక్తుడు: ప్రభుపాద కృష్ణుని యొక్క చిత్రం, పరిపూర్ణము, సరేనా? ఆది కృష్ణుడు. ఆదే విధంగా స్వచ్చమైన భక్తుడి చిత్రం కూడ సంపూర్ణమా?

ప్రభుపాద: భక్తుడు చిత్రం?

భక్తుడు: పవిత్రమైన భక్తుడు.

ప్రభుపాద: అవును.

భక్తుడు: అదే విధంగా పరిపూర్ణము ...

ప్రభుపాద: అవును.

భక్తుడు:ఉదాహరణకు ప్రహ్లాద మహారాజు నరసింహ స్వామి యొక్క చిత్రం కూడా ... ప్రహ్లాదుడు నరసింహ స్వామి వున్నట్లు వుంటాడు

ప్రభుపాద: అవును. భగవంతుడు భక్తుడు, వారు ఒక్కే స్థితిలో ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరు. భగవంతుడు, అయిన పేరు, అయిన రూపం, అయిన లక్షణము, అయిన సహచరులు, అయిన సామగ్రి. అంతా, వారు సంపూర్ణంగా ఉన్నారు. నామా గన రూపా లిలా పారీ ... లీలలు. మనము కృష్ణుడిని గురించి విన్నట్లుగానే, ఇది కృష్ణుడికి భిన్నం కాదు. హరే కృష్ణ మంత్రము కీర్తన చేస్తున్నప్పుడు ఈ హరే కృష్ణ, ఈ కీర్తన, కృష్ణుడి నుండి వేరుగా ఉండదు.అంతా సంపూర్ణము. కృష్ణుడి పవిత్రమైన భక్తుడు కృష్ణుడినుండి భిన్నంగా ఉండడు. ఇది ఏకకాలంలో ఒకటిగా విభిన్నంగా ఉంటుంది.Acintya-bhedābheda-tattva.. ఈ తత్వము అర్థం చేసుకోవాలి, కృష్ణుడు మహోన్నతమైన వ్యక్తి శక్తివంతమైనవాడు, ప్రతిదీ, మనము చూసేది, మనం అనుభవించేది, అవి కృష్ణుడి యొక్క వివిధ శక్తులు. శక్తి శక్తివంతుడుని వేరు చేయలేము. అందువలన వారు సంపూర్ణ స్థితిలో ఉన్నారు. ఇది మాయ లేదా అజ్ఞానంతో కప్పబడినప్పుడు, ఇది భిన్నముగా ఉంటుంది. అంతే.