TE/Prabhupada 0273 - ఆర్య-సమానా అంటే కృష్ణ చైతన్య వ్యక్తి
Lecture on BG 2.7 -- London, August 7, 1973
అది బ్రాహ్మణుడు, ఉదారాముగా ఉంటాడు. ... Etad viditvā prayāti sa brāhmaṇaḥ, ఎవరైతే తెలుసుకుంటారో ... అందు వలన ప్రహ్లాద మహరాజ చెప్పుతున్నాడు: durlabhaṁ manuṣyaṁ janma adhruvam arthadam ( SB 7.6.1) అయిన తన తరగతి స్నేహితులకు ప్రచారము చేస్తున్నాడు. అయిన ఒక రాక్షసుల కుటుంబంలో జన్మించాడు, హిరణ్యకశిపు. తన తరగతి స్నేహితులు, కూడా, అదే వర్గం. ప్రహ్లాద మహారాజు వారికి సలహా ఇచ్చాడు: "నా ప్రియమైన సోదరుల్లారా, మనము కృష్ణ చైతన్యమున్ని నేర్చుకుందాము." మరి ఇతర అబ్బాయిలకు, కృష్ణ చైతన్యము గురించి వారికి ఏమి తెలుసు? ప్రహ్లాద మహారాజు జన్మించినప్పటి నుండి విముక్తి పొందాడు. వారు ఇలా అన్నారు: "ఈ కృష్ణ చైతన్యము ఏమిటి?" వారికి అర్థం కాలేదు. అందువలన అయిన వారిని ఒప్పించుచున్నాడు: durlabhaṁ manuṣyaṁ janma tad apy adhruvam arthadam.. ఈ మానవ శరీరం durlabha గా ఉంది. Labdhvā sudurlabhaṁ idam bahu sambhavānte ( SB 11.9.29) ఈ మానవ శరీరం భౌతిక ప్రకృతిచే ఇవ్వబడిన గొప్ప రాయితీ. ప్రజలు లోభముగా వెర్రిగా ఉన్నారు. ఈ మానవ జన్మ విలువ ఏమిటో వారు అర్థం చేసుకోలేదు. వారు పిల్లులు కుక్కలు వలె ఇంద్రియ తృప్తి కోసం ఈ శరీరం ఉపయోగిస్తున్నారు. శాస్త్రము ఇలా చెబుతోoది: "లేదు, ఈ మానవ జన్మను పందులు, కుక్కలు లాగా పాడుచేసుకోవడానికి కాదు." Nāyaṁ deho deha-bhājāṁ nṛ-loke.. ప్రతి ఒక్కరికీ శరీరం, భౌతిక శరీరం ఉంది. కానీ nṛ-loke మానవ సమాజంలో, ఈ శరీరాన్ని నాశనం చేసుకోకూడదు. Nāyaṁ deho deha-bhājāṁ nṛ-loke kaṣṭān kāmān arhati viḍ-bhujāṁ ye ( SB 5.5.1) మానవ జన్మ, ఉదాహరణకు , పగలు రాత్రి పనికిరాని వాటికోసము కష్టపడి పని చేస్తున్నాము , ఇంద్రియ తృప్తి కోసం. ఇది పంది కుక్క యొక్క సేవ. అవి ఆదే పని చేస్తున్నాయి, మొత్తం పగలు రాత్రి చేస్తున్నాయి,కేవలము ఇంద్రియ తృప్తి కోసం కృషి చేస్తున్నాయి. మానవ సమాజంలో విభజన పద్ధతి ఉండాలి. దీనిని వర్ణా ఆశ్రమ ధర్మ అని పిలుస్తారు. ఇది వేదముల నాగరికత. దానిని వాస్తవమునకు ఆర్య-సమాజ అని పిలుస్తారు. ఆర్య-సమాజ అంటే దుష్టుడు అవివేకినిగా మారి, దేవుడు లేడని తిరస్కరించాడము కాదు. కాదు అది Anārya. కృష్ణుడు అర్జునుడుని మందలించినట్లు: anārya-juṣṭa నీవు anārya లాగా మాట్లాడుతున్నావు. కృష్ణ చైతన్యము లేని వ్యక్తి, అయిన anārya. Anārya. ఆర్యా అంటే కృష్ణ చైతన్యములో ఎవరు ఉన్నత స్థానములో ఉన్నారు? వాస్తవమునకు ఆర్య-సమానా అంటే కృష్ణ చైతన్య వ్యక్తి. లేకపోతే, బోగస్, బోగస్ ఆర్య-సమానా. ఎందుకంటే ఇక్కడ భగవద్-గీతాలో చెప్పిన ప్రకారం, కృష్ణుడు అర్జునుడిని, మందలిస్తున్నాడు, ఎందుకంటే అయిన పోరాడటానికి నిరాకరించాడు ఎందుకంటే, అయినకు తన కర్తవ్యము ఏమిటో తేలియదు, మళ్ళీ అర్జునుడు ఇక్కడ ఒప్పుకుంటాడు kārpaṇya-doṣopahata-svabhāvaḥ ( BG 2.7) . అవును, నేను అనార్య. నేను అనార్య అయ్యాను. ఎందుకంటే నేను నా కర్తవ్యముని మరచిపోయాను.
వాస్తవానికి ఆర్యన్ సమాజము అంటే కృష్ణ చైతన్య సమాజం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం ... అది ఆర్య. బోగస్ కాదు. ఇక్కడ, అర్జునుడు వివరిస్తూన్నాడు, తన గురించే చేప్పుతున్నాడు: "అవును, kārpaṇya-doṣo. నా కర్తవ్యముని నేను మర్చిపోతున్నాను, అందువలన upahata-svabhāvaḥ సహజమైన ప్రవృత్తులలో నేను బ్రాంతి చెందను ఒక క్షత్రియుడు ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి. ఒక యుద్ధం ఉన్నప్పుడల్లా, యుద్ధము చేయాలి, వారు అప్పుడు చాలా ఉత్సాహంగా ఉండాలి. ఒక క్షత్రియుడు, మరొక క్షత్రియుడితో చెప్పినప్పుడు: "నేను మీతో పోరాడాలనుకుంటున్నాను" అయిన, , అయిన తిరస్కరించ కూడదు. "అవును, రండి యుద్ధము చేద్దాము అని కత్తిని తీసుకుంటాడు. వెంటనే: "రండి రండి". అది క్షత్రియుడు. ఇప్పుడు అయిన పోరాడడానికి నిరాకరిస్తున్నాడు. అందువల్ల అయిన అర్ధం చేసుకోగలడు ... అయిన తన బాధ్యతను మరచిపోయాడు, క్షత్రియ కర్తవ్యము. అందువలన, అయిన ఒప్పుకుంటాడు: అవును, kārpaṇya-doṣa. Kārpaṇya-doṣopahata-svabhāvaḥ ( BG 2.7) "నా సహజ కర్తవ్యముని నేను మర్చిపోతున్నాను , అందువల్ల నేను లోభిని అవుతున్నాను , అందువలన నా ..." మీరు లోభిగా మారినప్పుడు, ఇది ఒక వ్యాధి పరిస్థితి. మీ బాధ్యత ఏమిటి? అప్పుడు మీరు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి ఎవరైతే ... మీ స్నేహితుడు వ్యాధికి గురైనప్పుడు, మీరు వైద్యుడు దగ్గరకు వెళ్లి, "ఏం చేయాలి, సర్? అని అడుగుతారు నేను ఇప్పుడు ఈ వ్యాధితో బాధపడుతున్నాను. "ఇది మీ బాధ్యత. అదేవిధంగా, మన విధులలో మనము కలవరపడుతున్నప్పుడు లేదా మన విధులను మరచిపోతాము, ఉన్నత వ్యక్తి దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో అతన్ని అడుగుతాము. కృష్ణుడి కంటే ఉన్నత వ్యక్తి ఎవరు? అందువల్ల అర్జునుడు ఇలా అంటున్నాడు: pṛcchāmi tvām. "నేను నిన్ను అడుగుతున్నాను. ఇది నా బాధ్యత. నేను ఇప్పుడు నా కర్తవ్యములో పతనమవుతున్నాను చేయలేకున్నాను. ఇది మంచిది కాదు. నేను ఎవరైనా నా కంటే ఉన్నతామైన వారిని అడుగుతాను. " ఇది నా కర్తవ్యము. Tad vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12). ఇది వేదముల కర్తవ్యము. అందరూ కలవరపడతారు. ప్రతి ఒక్కరూ ఈ భౌతిక ప్రపంచం లో బాధపడుతున్నారు, కలవరపడుతున్నారు. కానీ అయిన ఒక ప్రామాణికమైన గురువు కోసము శోధించడు . లేదు అది kārpaṇya-doṣa. అది kārpaṇya-doṣa. ఇక్కడ, అర్జునుడు kārpaṇya-doṣa నుండి బయిటకు వస్తున్నాడు. ఎలా? ఇప్పుడు అతను కృష్ణుడిని అడుగుతున్నాడు. Pṛcchāmi tvām. నా ప్రియమైన కృష్ణ, నీవు అత్యంత ఉన్నతమైన వ్యక్తి. నాకు తెలుసు. మీరు కృష్ణుడు. నేను కలవరపడుతున్నాను. వాస్తవమునకు, నేను నా కర్తవ్యముని మర్చిపోతున్నాను. అందువలన, నేను నిన్ను అడుగుతున్నాను. "