TE/Prabhupada 0296 - జీసస్ క్రైస్ట్ కు శిలువ వేయబడినప్పటికీ, ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు



Lecture -- Seattle, October 4, 1968


వేదాల్లో దేవుడు ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి. ప్రతి గ్రంథాములో, ప్రతి గొప్ప వ్యక్తి, భక్తుడు, దేవుడి ప్రతినిధి ... భగవంతుడు జీసస్ క్రైస్ట్ లాగే, అయిన దేవుడి సమాచారం ఇచ్చాడు. అయినకు శిలువ వేయబడినప్పటికీ, అయిన తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. మనకు సాక్ష్యాలు ఉన్నాయి, సాహిత్యాల నుండి, వేదాల నుండి, గొప్ప వ్యక్తుల నుండి, అయినప్పటికి, "దేవుడు చనిపోయాడు, దేవుడు లేడు" అని నేను చెప్పినప్పుడు, అప్పుడు నేను ఏ విధమైన వ్యక్తిని నేను. దీనిని రాక్షసుడు అంటారు. వారు నమ్మరు ఎప్పటికీ. వారు నమ్మరు ఎప్పటికీ ... రాక్షసుడికి వ్యతిరేకము budhā. బుద్ధ అంటే చాలా తెలివైనవాడు, తెలివైన వ్యక్తి. చైతన్య-చరితామ్రుతలో కృష్ణడు చెప్పాడు. అందువలన kṛṣṇa ye bhaje se baḍa catura ఎవరైతే కృష్ణుడికి ఆకర్షితుడుయ్యాడో మరియు అతనిని ప్రేమిస్తారో ... పూజించటము అంటే ప్రేమించాటము ప్రారంభంలో ఇది పూజలు చేయటము, కానీ చివరికి ఇది ప్రేమ.పూజల చేయటము.

కావునా iti matvā bhajante māṁ budhā. జ్ఞానవంతుడు, తెలివైనవాడు కృష్ణుడు అన్ని కారణములకు కారణం అయినవాడు ...

īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
sac-cid-ānanda-vigrahaḥ
anādir ādir govindaḥ
sarva-kāraṇa-kāraṇam
(Bs. 5.1)

సర్వా-కారనా: ప్రతి దానికి కారణం, కారణం పర్యవసానము ఉంటుoది. ఈ కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటే, దీనికి కారణం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, అప్పుడు మీరు కృష్ణుడిని కనుగొంటారు. సర్వ-కరణ-kāraṇam. వేదాంతము చెప్పుతుంది. janmādy asya yataḥ ( SB 1.1.1) మీరు ఏదైన సహజముగా జరిగినది ఆని చెప్పలేరు. అది మూర్ఖత్వం. ప్రతిది జరగటానికి కారణము ఉంటుంది. ప్రతిదీ. ఇది మేధస్సు. చెప్పలేను ... ఆధునిక శాస్త్రం చెప్పుతుంది , "అక్కడ ఒక ముక్క ఉంది సృష్టి జరిగింది - బహుశా." అది కూడా "బహుశా," మీరు చూస్తారు. ఈ రకమైన జ్ఞానం నిష్ప్రయజ్ఞముమైనది. మీరు తప్పక తెలుసుకోవాలి. నేను ఒక్క శాస్త్రవేత్తను అడిగితే, "ఈ భాగం యొక్క కారణం ఏమిటి?" వారు సమాధానం ఇవ్వలేరు. కారణం కనుగొనేందుకు ప్రయత్నించండి, మీరు కనుగొంటారు ... నేను కనుగొనలేకపోతే, అప్పుడు మనం అనుసరించాల్సి ఉంటుంది ... Mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) మనము ప్రామాణిక ఆచార్యులను అనుసరించాలి. మీరు క్రైస్తవుడైతే, యేసు క్రీస్తును అనుసరిస్తారు. అయిన చెప్పాడు, "దేవుడు ఉన్నాడు." అప్పుడు మీరు దేవుడు ఉన్నాడు అని అంగీకరిoచండి. అయిన "దేవుడు దీనిని సృష్టించాడు" అని చెప్పాడు. అయిన 'సృష్టి ఉండు గాక' అని చెప్పాడు సృష్టి జరిగింది. మనము దీనిని అంగీకరిoచాము, "అవును, దేవుడు సృష్టించాడు." ఇక్కడ భగవద్గీతలో దేవుడు ఇలా చెబుతున్నాడు, కృష్ణుడు ahaṁ sarvasya prabhavo ( BG 10.8) "నేను ఆరంభం." దేవుడు సృష్టికి మూలం. Sarva-kāraṇa-kāraṇam: (Bs. 5.1) అయిన అన్ని కారణాలకు కారణము.

మనము గొప్ప వ్యక్తుల ఉదాహరణలు తీసుకోవాలి, మనము ప్రామాణిక పుస్తకాలను వేదాలను అధ్యయనం చేయాలి వారి ఉదాహరణను అనుసరించాలి; అప్పుడు కృష్ణ చైతన్యము లేదా దేవుడి పరిపూర్ణత్వము లేదా దేవుడి చైతన్యము కష్టం కాదు. ఇది చాలా సులభం. మీరు దేవుడు అంటే ఏమిటి అని అవగాహన చేసుకొనుటలో ఎటువంటి ఆటంకం లేదు. అంతా ఉంది. భగవద్గీత అక్కడ ఉంది, శ్రీమద్-భాగావతము అక్కడ ఉంది. మీరు అంగీకరిoచినా, మీ బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, అన్నిచోట్లా ఉంటుంది. దేవుడు లేకుండా, అక్కడ ఏ పుస్తకం లేదా గ్రంధము ఉండదు. ఈ రోజుల్లో, వారు చాలా విషయాలు తయారు చేస్తున్నారు. కానీ ఎ మానవ సమాజంలో అయిన దేవుడు అనే భావము ఉంది - సమయం ప్రకారం, ప్రజల ప్రకారం, కానీ ఆలోచన ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, jijñāsā. అందువలన వేదాంత-సూత్రాము చెప్పుతుంది. మీరు విచారణ, విచారణ ద్వారా దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిoచండి ఈ విచారణ చాలా ముఖ్యం.