TE/Prabhupada 0302 - ప్రజలు శరణాగతి పొందటానికి అనుకూలముగా లేరు



Lecture -- Seattle, October 2, 1968


ప్రభుపాద: మనము చైతన్య మహాప్రభు ఉపదేశములను చదువుతున్నాము. మనము మనచివరి సమావేశం నుండి ప్రారంభించాము, మరలా చదువుదాము. మీరు చదువుతారా? అవును.

తమాల కృష్ణ : ఇరవై తొమ్మిది పేజీ, కానీ చదివటము ఎక్కడ ముగించారు?

ప్రభుపాద: ఎక్కడైనా చదవండి, పర్వాలేదు. అవును.

తమలా కృష్ణ: సరే. "భగవద్గీతలో మనకు స్వరూప స్వభావం గురించి తెలియజేయబడిoది ఒక్క జీవి తాను ఆత్మ . అయిన పదార్ధము కాదు. అందువలన ఆత్మ అయినoదున దేవునిలో భాగము, సంపూర్ణ సత్యము, భగవంతుడు మనము ఆత్మ యొక్క కర్తవ్యము, శరణాగతి పొందుట అని నేర్చుకున్నాము, అప్పుడు మాత్రమే అయిన ఆనందంగా ఉంటాడు. భగవద్ గీత యొక్క చివరి సూచన, ఆత్మ పూర్తిగా శరణాగతి పొందాలి, దేవునికి, కృష్ణుడికి, ఆ విధంగా ఆనందమును పొందుతుంది. ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు సనాతన ప్రశ్నలకు సమాధానమిస్తూ, అదే సత్యాన్ని తిరిగి చేప్పుతున్నారు, కానీ అయినకి ఆత్మ గురించి సమాచారం ఇవ్వకుండా , అది గీతాలో ఇప్పటికే వివరించబడింది. "

ప్రభుపాద: అవును. విషయము ఏమిటంటే, ఆత్మ యొక్క స్వరూప పరిస్థితి ఏమిటి, శ్రీమద్ భగవద్గీతములో చాలా విస్తృతంగా చర్చించారు. ఇప్పుడు భగవద్గీతలో చివరి ఉపదేశము, కృష్ణుడు చేప్పుతున్నాడు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) అయిన అర్జునుడికి అన్ని రకముల యోగా విధానాలను ప్రచారము చేసాడు, అన్ని రకాల మతపరమైన పద్ధతులను, యజ్ఞములను తాత్విక కల్పనలను, ఈ శరీరం యొక్క స్వరూప పరిస్థితి, ఆత్మ యొక్క స్వరూప పరిస్థితి. అంతా అయిన భగవద్గీతలో వివరించాడు. చివరికి అయిన అర్జునుడుతో, "ప్రియమైన అర్జునా, నీవు నా సన్నిహితమైన, ప్రియమైన స్నేహితుడివి, అందువలన వేద జ్ఞానం యొక్క అత్యంత రహస్యమైన భాగాన్ని నేను చెపుతున్నాను. " అది ఏమిటి? "నీవు నాకు శరణాగతి పొందుము." అంతే. ప్రజలు శరణాగతి పొందాటానికి అనుకూలముగా లేరు; అందువలన అయిన చాలా విషయాలు తెలుసుకోవలసి ఉంది. చిన్నపిల్లవాడిలాగా, ఉదాహరణకు వాడికి తల్లిదండ్రులకు శరణాగతి పొందాలి అనే భావము ఉంది, వాడు సంతోషంగా ఉoటాడు. తత్వము నేర్చుకోవలసిన అవసరం లేదు, సంతోషంగా ఎలా జీవించాలి. పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణపై ఆధారపడి ఉంటారు. అప్పుడు వారు సంతోషంగా ఉoటారు. సరళమైన తత్వము. కానీ మనము నాగరికతలో, జ్ఞానంలో ఉన్నతి సాధించి నందు వలన, అందువల్ల మనము ఈ సరళమైన తత్వమును అర్థం చేసుకోవటానికి చాలా పదాల గారడి ఉంది. అంతే. మీరు పదాల గారడీ నేర్చుకోవాలనుకుంటే, ఈ కృష్ణ చైతన్య ఉద్యమము ఉపయోగపడుతుంది. మనకు తత్వము యొక్క పుస్తకాలు వాల్యూమ్లు ఉన్నాయి. కానీ మీరు ఈ సరళమైన పద్ధతిని అంగీకరించినట్లయితే, మనకు ఇది ... దేవుడు గొప్పవాడు మనము అయినలో భాగము; అందువల్ల దేవుడుకి సేవ చేయటం శరణాగతి పొందుట నా బాధ్యత. అంతే. చైతన్య మహాప్రభు, అన్ని స్వరూప స్థానాలు, తత్వము, జ్ఞానం గురించి మాట్లాడకుండా, చాలా ఇతర విషయాలు, యోగ పద్ధతిని కాకుండా, అయిన వెంటనే ప్రారంభించారు జీవి యొక్క స్వరూప పరిస్థితి దేవాదిదేవునికి సేవ చేయటము. అంటే ... ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశముల ఆరంభము. అంటే అంటే భగవద్గీత ఉపదేశము ముగిసిన చోట, చైతన్య మహాప్రభు ఆక్కడ నుంచి ప్రారంభించారు.

ప్రభుపాద: అవును. కొనసాగించoడి.

తమలా కృష్ణ: "అయిన కృష్ణుడు తన ఉపాదేశాన్ని ముగించిన దగ్గర నుండి మొదలుపెట్టాడు. చైతన్య మహాప్రభువే కృష్ణుడు ఆని గొప్ప భక్తులు అంగీకరించారు, అయిన గీతలో అయిన ఉపదేశమును ముగిoచిన దగ్గర నుండి, అయిన ఇప్పుడు సనాతనకు మళ్ళీ తన ఉపాదేశాన్ని ప్రారంభిoచారు భగవంతుడు సనాతానతో, 'మీ స్వరూప స్థానము మీరు పవిత్రమైన జీవం గల ఆత్మ'. ఈ భౌతిక శరీరం మీ వాస్తవమైన ఆత్మ యొక్క గుర్తింపు కాదు, మీ వాస్తవమైన గుర్తింపు మీ మనస్సు కాదు, లేదా మీ మేధస్సు కాదు, లేదా ఆత్మ యొక్క వాస్తవమైన గుర్తింపు అహంకారము కాదు. మీ గుర్తింపు మీరు దేవాదిదేవుడు కృష్ణుడి యొక్క శాశ్వతమైన సేవకులు. '"

ప్రభుపాద: ఇప్పుడు ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి, అది మన ఆత్మ సాక్షాత్కారము, పూర్తిగా బౌతిక స్థితిలో ఉన్నవారు, వారు ఈ శరీరాము "నేను ఈ శరీరాన్ని" అని అనుకుంటారు. నేను ఈ శరీరమును, శరీరము అంటే అర్థం ఇంద్రియాలు అని అర్థం. అందువల్ల నా సంతృప్తి అంటే ఇంద్రియాల సంతృప్తి - ఇంద్రియ తృప్తి. ఇది ఆత్మ-సాక్షాత్కారము యొక్క స్థూల రూపం. ఈ శరీరం కూడా ఆత్మ. శరీరం కూడ ఆత్మ, మనస్సు కూడ ఆత్మ, నేను అనేది కూడ ఆత్మ . నేనే అనేది, పర్యాయపదం. శరీరం మనస్సు ఆత్మ, రెండు ఉన్నాయి ... ఆ మూడిటిని ఆత్మ అంటారు. ఇప్పుడు మన జీవితపు స్థూల స్థాయిలో, ఈ శరీరమే ఆత్మ ఆని మనము భావిస్తున్నాము. సూక్ష్మ స్థాయిలో మనము మనస్సు, మేధస్సు ఆత్మ అని అనుకుంటున్నాము. కానీ వాస్తవానికి, ఆత్మ ఈ శరీరమునకు అతీతమైనది, ఈ మనస్సుకు అతీతమైనది, ఈ మేధస్సుకు అతీతమైనది. ఆది పరిస్థితి. ఆత్మ సాక్షాత్కారములో శారీరక భావనలో ఉన్నవారు, వారు భౌతిక వ్యక్తులు. మనస్సు మేధస్సు భావనలో ఉన్నవారు, వారు తత్వవేత్తలు కవులు. వారు దేనినైన తత్వము చేస్తూన్నారు లేదా కవిత్వంలో మనకు కొంత అవగాహనాను ఇస్తున్నారు, కానీ వారి భావన ఇప్పటికీ తప్పుగా ఉంది. మీరు ఆధ్యాత్మిక స్థితికి వచ్చినప్పుడు, అది భక్తియుక్త సేవ అని చెప్పుతాము. అది చైతన్య మహాప్రభువుచే వివరించబడింది.