TE/Prabhupada 0305 - దేవుడు చనిపోయాడని చెప్తాము. మనం ఈ భ్రాంతి నుండి మన కళ్ళను బయటకు తీయాలి



Lecture -- Seattle, October 2, 1968


ప్రభుపాద: చదువుతు ఉండండి.

తామాల కృష్ణ: "జీవి ఒక సూర్యరశ్మి యొక్క పరమాణు భాగంలా ఉంటాడు, అయితే కృష్ణుడిని ప్రకాశవంతమైన సూర్యునితో పోల్చారు. చైతన్య మహాప్రభు జీవులను ప్రకాశవంతమైన అగ్ని కణములతో పోల్చారు దేవాదిదేవుడిని సూర్యుడి యొక్క మండుతున్న అగ్నితో. మహా ప్రభువు ఈ సంబoదములో విష్ణు పురాణాము నుండి ఒక శ్లోకమును ప్రస్తావిoచారు, ఈ విశ్వ ప్రపంచం లోపల ప్రతిదీ వ్యక్తీకరించబడినది , అది దేవాదిదేవుడు యొక్క ఒక శక్తి అని చెప్పబడింది. ఉదాహరణకు, ఒక ప్రదేశం నుండి వెలువడుతున్న అగ్ని దాని చుట్టూ ప్రకాశము మరియు వేడిని ప్రదర్శిస్తుంది, భగవంతుడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకే చోట ఉన్నప్పటికి, ప్రతిచోటా తన వేర్వేరు శక్తులను వ్యక్తము చేస్తారు. "

ప్రభుపాద: ఇప్పుడు, ఇది చాలా సులభం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించoడి. ఈ అగ్ని వలె, ఈ దీపం, ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంది కానీ ప్రకాశం ఈ గది అంతట నిండినది, అదేవిధంగా మీరు ఏమి చూస్తున్న, ఈ విశ్వము యొక్క ప్రదర్శన, అవి దేవాదిదేవుడు యొక్క శక్తుల ప్రదర్శన. దేవాదిదేవుడు ఒకే చోట ఉంటాడు. మన బ్రహ్మ సంహితలో govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi లో ఉదాహరించాము. అయిన ఒక వ్యక్తి. ఉదాహరణకు మీ అధ్యక్షుడు, మిస్టర్ జాన్సన్, అయిన వాషింగ్టన్ లో తన గదిలో కూర్చుని ఉన్నాడు, కానీ ఆతని అధికారము, ఆతని శక్తి, రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. భౌతికంగా సాధ్యం అయినట్లయితే, అదేవిధంగా కృష్ణుడు లేదా దేవుడు, దేవాది దేవుడు, అయిన అయిన దామములో ఉన్నాడు, నివాసం, వైకుoటాములో లేదా దేవుని రాజ్యంలో, కానీ అయిన శక్తి పని చేస్తుంది మరొక ఉదాహరణ, సూర్యుడు. సూర్యుడు, మీరు చూడగలుగుతారు సూర్యుడు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్నాడు, కానీ సూర్యరశ్మి విశ్వం మొత్తము వ్యాప్తి చెందినది. సూర్య కాంతి మీ గదిలో ఉంది. అదేవిధంగా, మీరు ఉపయోగిస్తున్నది ఏమైనా, మీరు, మీరు కూడ, మీరు దేవాదిదేవుడి శక్తి యొక్క ప్రదర్శన. మనము అయిన నుండి భిన్నంగా లేము. కానీ మాయ లేక భ్రమ నా కన్నును కప్పినపుడు, మనము సూర్యుడిని చూడలేము. అదేవిధంగా, జీవితం యొక్క భౌతిక భావన నన్ను కప్పినప్పుడు, మనము దేవుణ్ణి అర్థం చేసుకోలేము. దేవుడు చనిపోయాడని చెప్తాము. మనం ఈ భ్రాంతి నుండి మనకళ్ళను బయిటకు తీయాలి. అప్పుడు మీరు నేరుగా దేవుడిని చూస్తారు: "దేవుడు ఇక్కడ ఉన్నాడు." అవును. బ్రహ్మ-సంహితలో అది చెప్పబడినది,

premāñjana-cchurita-bhakti-vilocanena
santah sadaiva hrdayesu vilokayanti
yaṁ śyāmasundaram acintya-guna-svarūpaṁ
govindam ādi-purusaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.38

భగవంతుడు, దేవాది దేవుడు, అతను శ్యామసుందరుడు. శ్యామసుందర. శ్యామ అంటే అర్థం నల్లగా కానీ చాలా, చాలా అందమైన వాడు. ఆ అందమైన వ్యక్తి, దేవాది దేవుడు, కృష్ణుడు, ఎల్లప్పుడూ సాధువులచే గమనించబడుతున్నాడు చూడబడుతున్నాడు. Premāñjana-cchurita-bhakti-vilocanena. వారు ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే దేవుడి ప్రేమ అనే లేపనం వారి కళ్ళకు పుయాబడినది. మీ కళ్ళలో లోపము ఉoటే, మీరు కొన్ని మందులను, వైద్యుడి నుండి కొన్ని ఔషధాలను, వాడతారు మీ కంటిచూపు స్పష్టముగా ప్రకాశవంతము అవుతుంది, మీరు చాలా చక్కగా అన్ని విషయాలు చూడగలరు. అదేవిధంగా, ఎప్పుడైతే, ఈ బౌతిక కళ్ళకు దేవుడి ప్రేమ అనే లేపనమును రాస్తారో, అప్పుడు మీరు దేవుణ్ణి చూస్తారు, "ఇక్కడ దేవుడు ఉన్నాడు" దేవుడు చనిపోయాడని మీరు చెప్పరు. ఆ కప్పివేతను తీసివేయవల్సి ఉంటుంది, ఈ కప్పివేతను తీసివేయుటకు మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును తీసుకోవాలి. ధన్యవాదాలు.