TE/Prabhupada 0308 - ఆత్మ యొక్క పని, కృష్ణ చైతన్యము
Lecture -- Seattle, October 2, 1968
యువకుడు: మనస్సుకు ఏలా శిక్షణ ఇవ్వాలి?
ప్రభుపాద: ఇది శిక్షణ. మీరు కృష్ణ చైతన్యము యొక్క పనులలో మీ మనస్సును వినియోగించినప్పుడు అది. ఇది ఆచరణాత్మకమైనది. ఉదాహరణకు కీర్తన, జపము చేయడము వలె , పది సంవత్సరాల బాలుడు, వాడు కూడా నిమగ్నమవ్వుతాడు. వాడి మనస్సు హరే కృష్ణ మంత్రము మీద కేంద్రీకృతమవ్వుతుంది. వాడి ఇతర ఇంద్రియాలు, కాళ్ళు లేదా చేతులు, అవి పని చేస్తున్నాయి, నృత్యం చేస్తున్నాయి. ఈ విధంగా మనం మన మనస్సును, మన ఇంద్రియాలను ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములో నిమగ్నము చేయాలి. అది మిమల్ని పరిపూర్ణము చేస్తుంది. అది అందరికి సాధ్యమే. కృత్రిమముగా ఏదో ధ్యానం చేయడానికి మీరు ఒక ప్రదేశములో కూర్చోవ వలసిన అవసరం లేదు. వెంటనే మీరు హరే కృష్ణ మంత్రమును జపము చేసిన వెంటనే, వెంటనే మీ మనసు మళ్లించబడుతుంది, వెంటనే మీరు కృష్ణుడిని గుర్తుతెచ్చుకుoటారు, కృష్ణుడి ఉపదేశమును, కృష్ణుడిని యొక్క పనిని, ప్రతిదీ. దీనికి ఆచరణ అవసరం.
యువకుడు: మీరు సూర్యుడి కిరణం కనుక, మాట్లాడటానికి ...
ప్రభుపాద: అవును.
యువకుడు : మీ గురించి ఆలోచించుకుoటారా?
ప్రభుపాద: ఎందుకు కాదు? నేను వ్యక్తిని.
యువకుడు : మీరు ఆలోచిస్తున్నప్పుడు, మీరు కృష్ణుడిని గురించి ఆలోచిస్తున్నారా?
ప్రభుపాద: నేను చిన్నవాడిని అయిన , నేను వ్యక్తిని. నాకు ఆలోచిoచే శక్తి, అనుభూతి, కోరిక ఉన్నాయి. మనము ఆది చేస్తున్నాము. మనము వ్యక్తులము. మీరు మీ వ్యక్తిగత సంకల్పంతో ఇక్కడకు వచ్చారు. ఎవరూ మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీరు కావాలంటే, మీరు వెళ్ళవచ్చు. కొంతమంది ఇక్కడ వస్తారు, కొంతమంది ఎప్పటికి రారు, కొంతమంది రోజు వస్తారు. ఎందుకు? మీరు చిన్నవారు అయినప్పటికీ, మీకు వ్యక్తిత్వం ఉన్నది. ఈ బద్ధ స్థితిలో కూడ, మీరు చాలా స్వేచ్ఛగా, చాలా స్వేచ్ఛగా ఉన్నారు. మీరు బద్ధ స్థితిలో లేన్నప్పుడు, పవిత్రమైన ఆత్మగా, మీకు ఎంత స్వేచ్ఛ లభిస్తుందో అది మీకు తెలియదు. మీరు చిన్నవాడిగా ఉంటారు, కానీ మీరు ఒక ఆధ్యాత్మిక కణము. మీరు చూడడము లేదా ఒక చిన్న ఆధ్యాత్మిక కణమును, వైద్యుడు, వైద్య శాస్త్రం ఇంకా కనుగొన లేని , ఆత్మ ఎక్కడ ఉంది, కానీ ఆత్మ ఉంది. అది సత్యము. ఆత్మ ఈ శరీరం నుండి వెళ్ళిపోయిన వెంటనే, అది పనికిరానిది అవుతుంది. ఆ ముఖ్యమైన కణాన్ని తెలుసుకోండి. అది సాద్యము కాదు. అది అంత చిన్నది, మీ, ఈ బౌతిక కళ్ళు లేదా సూక్ష్మదర్శిని లేదా ఏ పరికరముతో అయిన మీరు కనుగొనలేరు. అందువల్ల ఏ ఆత్మ లేదు అని వారు చెప్తారు. కానీ వారు వెళ్లి పోయినది ఏమిటి అన్నా దాని గురించి వారు వివరించలేరు. ఆధ్యాత్మిక ఆత్మ అయిన ఆ చిన్న కణము కూడా చాలా శక్తివంతమైనది, అది ఈ శరీరంలో ఉన్నంత కాలం, ఇ శరీరమును తాజాగా, మంచిగా, అందమైనదిగా ఉంచుతుంది. అది వెళ్ళిపోయిన వెంటనే , వెంటనే అది కుళ్ళి పోతుంది. చూడండి. ఉదాహరణకు ఒక మందు, ఇంజెక్షన్ వలె . ఒక చిన్న, ఒక ధాన్యం, అది సరిగ్గా ఉంచుతుంది. అది అలాంటిదే, ఆది చాలా శక్తివంతమైనది. ఆ ఆత్మ యొక్క శక్తి ఏమిటో మీకు తెలియదు. అది మీరు నేర్చుకోవాలి. అప్పుడు అది ఆత్మ-సాక్షాత్కారము. ఈ ధ్యాన పద్ధతి, నిశ్శబ్దముగా ఉన్నా ప్రదేశములో కూర్చొని, శరీర భావనలో అత్యంత స్థూల దశలో సిఫార్సు చేయబడింది. ఒకరు ఆలోచించి, ధ్యానము చేసి, "నేను ఈ దేహమేనా?" అప్పుడు విశ్లేషణ చేయండి. మీరు చూస్తారు, "కాదు నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ శరీరానికి భిన్నంగా ఉన్నాను." అప్పుడు మరింత ధ్యానం: "నేను ఈ శరీరాన్ని కాకపోతే, అప్పుడు శారీరిక కర్మలు, ఎలా జరుగుతాయి?" అది ఆ చిన్న కణము ఉండటము వలన, నేను. ఎలా శరీరం పెరుగుతోంది? ఎందుకంటే ఆత్మ ఉన్నది కనుక ఈ అబ్బాయి లాగే, ఈ బాలుడు చిన్న శరీరమును కలిగి ఉన్నాడు. ఇప్పుడు, ఈ బాలుడు ఇరవై నాలుగు సంవత్సరాల వయుస్సు వచ్చినప్పుడు తను చాలా బలమైన శరీరాన్ని పొందుతాడు. ఇప్పుడు, ఈ శరీరం పోతుoది, మరొక శరీరం వస్తుంది. ఎలా సాధ్యమవుతుంది? ఆత్మ, చిన్న కణము ఉండటము వలన కానీ ఆ ఆత్మ యొక్క కణము తీసివేయబడినట్లయితే లేదా వెళ్ళి పోయినట్లయితే, ఈ శరీరము ఇక పెరగదు లేదా మార్పు చెందదు. ఇవి ధ్యానం యొక్క విషయములు. కానీ మీరు "నేను ఈ శరీరము కాదు, నేను ఆత్మని" అని అర్ధం చేసుకోగలిగినప్పుడు తరువాత దశ "ఆత్మ యొక్క పని ఏమిటి?" ఆ ఆత్మ యొక్క పని, కృష్ణ చైతన్యంలో పని చేయటము ప్రస్తుత యుగంలో ఆత్మ యొక్క పనిని నేరుగా తీసుకోవాలి; అప్పుడు ఇతర విషయాలు సహజముగా వస్తాయి. ప్రస్తుత సమయములో ఇది సాధ్యం కాదు, మీరు ఏకాంత ప్రదేశంలోకి వెళ్లి శాంతిగా కూర్చుని, ధ్యానం చేయాటానికి ... ఈ యుగములో ఇది సాధ్యం కాదు. అది అసాధ్యం. మీరు కృత్రిమంగా ప్రయత్నించినట్లయితే, అది వైఫల్యం చేందుతుంది. అందువలన మీరు ఈ పద్ధతి తీసుకోవాలి,
- harer nāma harer nāma harer nāma eva kevalam
- kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
- (CC Adi 17.21)
ఈ కలి యుగంలో, హరే కృష్ణ మంత్రాన్ని జపము,కీర్తన చేయుట తప్ప ఆత్మ సాక్షత్కారమునకు ఏ ఇతర ప్రత్యామ్నాయం లేదు. ఆచరణాత్మకము, వాస్తవిక వాస్తవం.