TE/Prabhupada 0316 - అనుకరించటానికి ప్రయత్నించవద్దు. ఇది చాలా ప్రమాదకరమైనది



Lecture on SB 7.9.5 -- Mayapur, February 25, 1977


ప్రభుపాద: వెంటనే మనము మొదటి తరగతి భక్తులము కాలేము. మనము హరిదాస్ ఠాకురాను అనుకరించలేము. అది సాధ్యం కాదు. కానీ కనీసo. Saṅkhyā-pūrvaka-nāma-gāna-natibhiḥ (Ṣaḍ-gosvāmy-aṣṭaka).మనము సాధన చేయాలి. నిర్దిష్ట సంఖ్యా బలం మనము కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్నాము. అందువలన ... మనలో కొంత మంది భక్తులు , నేను పదహారు మాలలకు మాత్రమే పరిమితము చేసానని వారు నన్ను విమర్శిస్తున్నారు. కాదు, ఎందుకు పదహారు మాలల? మీరు మూడు వందల మాలల చేయవచ్చు, కానీ కనీసo, కనీసo పదహారు మాలలు, ఎoదుకoటే మనo ఎoతో సమయాన్ని కేటాయిoచడానికి అలవాటు పడలేదు. మనము ఎల్లప్పుడూ బిజీగా ఉండాలి. కానీ ఒకే ప్రదేశములో కూర్చోని హారే కృష్ణ మంత్రమును నిరంతరం జపము చేయుట, ఏ బద్ధజివునికి అది సాధ్యం కాదు - అయిన విముక్తి పొందకపోతే. అనుకరించటానికి ప్రయత్నము చేయ వద్దు. నా గురువు మహరాజ కచ్చితంగా నిషేధించారు, "హరిదాసా ఠాకురా, రూప గోస్వామి వలె పెద్ద వ్యక్తులను అనుకరించేందుకు ప్రయత్నించవద్దు." అయిన రూపా గోస్వామికి చెప్పేవారు ke mogha vāñchā. రూపా గోస్వామి, ఎందుకంటే అయిన ఒక చిన్నా నడుము వస్త్రం మీద ఉండేవారు ... Tyaktvā tūrṇam aśeṣa-maṇḍala-pati-śreṇīṁ sadā tucchavat bhūtvā dīna-gaṇeśakau karuṇayā kaupīna-kanthā... అందువల్ల రుప గోస్వామి వలె దుస్తులను అనుకరించటానికి ఉపయోగము లేదు, ఆపై, అవకాశం ఉన్నావెంటనే, బీడీ పొగ. (నవ్వు) ఈ చెత్త పనులు చేయవద్దు. అనుకరణ వలన ఉపయోగం లేదు Anusaranṇa, not anukāraṇa. Anukāraṇa ప్రమాదకరం. Anusaraṇa. Sādhu-mārgānugamanam. ఇది భక్తి. పెద్ద, పెద్ద భక్తుల, సాధువుల అడుగుజాడలను అనుసరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మనము కాదు ... మనము అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాము. అనుకరించటానికి ప్రయత్నించవద్దు. ఇది చాలా ప్రమాదకరమైనది.

మా భక్తులలో కొందరు, వారు వదిలి వెళ్లారు, "ఇక్కడ భజన లేదు అని," (నవ్వు) మరొక గురువుని కనుగొనటానికి నా ఆశీర్వాదాన్ని అడిగినారు. అయిన ఒక గురువును కనుగొనేందుకు నా దీవెనలు కోరుకుంటున్నారు. ఈ దుష్టత్వము మంచిది కాదు. అత్యుత్తమమైన విషయము ఏమిటంటే mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) ఇక్కడ మహాజన ఉన్నారు. ప్రహ్లాద మహారాజు వారిలో ఒక్కరు. పన్నెండు మంది మహాజనులలో, ప్రహ్లాద మహారాజు ఒక్కరు. Svayambhūr nāradaḥ śambhuḥ kapilo manuḥ prahlādaḥ ( SB 6.3.20) ప్రహ్లాద మహారాజు నామము ఉంది. Janako bhīṣmo balir vaiyāsakir vayam ( SB 6.3.19) ప్రహ్లాద మహారాజు మహజన. అనుసరించండి, ప్రహ్లాద మహారాజును అనుసరించడానికి ప్రయత్నించండి. Anusaraṇa. Sādhu-mārgānugamanam. ప్రహ్లాద మహారాజు ఏమి చేశారు? తన తoడ్రి వలన అతను ఎన్నో కష్టాలను చూసాడు, అతను ఏమి చేశాడు? అయిన కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఏమి చెయ్యగలను? నా తండ్రి వ్యతిరేకిస్తున్నాడు ఇది man-manā bhava mad-bhaktaḥ. చివరకు, తండ్రి చంపబడినప్పుడు, అయిన ప్రణామములు చేస్తున్నాడు. ఈ నాలుగు విషయాలూ, స్వచ్ఛమైన భక్తునిగా, అడుగుజాడలను మనఃస్పూర్తిగా అనుసరించండి. Sarvopādhi-vinirmuktam ( CC Madhya 19.170) ప్రహ్లాద మహరాజ ఎన్నడూ అనుకోలేదు "నేను హిరణ్యాకశిపుని కుమారుడిని అని." ఎప్పుడూ అనుకోలేదు. అయిన ఎప్పుడూ ఆలోచించేవాడు, "నేను నారదుని సేవకుడిగా ఉన్నాను." అయిన అది చెప్పాడు. అయిన తనకు దీవెన ఇవ్వాలని కోరుకోమన్నప్పుడు , అయిన నరసింహ స్వామిని అడిగాడు, దయచేసి నీ సేవకుడైన నారదుని సేవలో నన్ను ఉంచండి. అయిన ద్వార నాకు ఈ ఉపదేశము వచ్చినది. అయిన ఎప్పుడూ చెప్పలేదు. నా తండ్రికి సేవ చేయనివ్వoడి . చెప్పలేదు ఎందుకంటే అయినకు ఉపదేశము వచ్చినది , అయిన ఎల్లప్పుడూ ... Cakṣudana dilo janme janme pitā sei. అయిన తండ్రి. మరి ఏ తండ్రి లేడు. Cakṣudana dilo yei, janme janme pitā sei. తదుపరి లైన్ ఏమిటి?

భక్తులు: Divya jñāna hṛde prakāśito.

ప్రభుపాద:divya jñāna hṛde prakāśito. కావున అయిన తండ్రి. మనము ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలి. తొందరపడి చపలత్వముతో ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును వదిలి వేయకండి. ధన్యవాదాలు.