TE/Prabhupada 0326 - దేవుడు సర్వోన్నతమైన తండ్రి,సర్వోన్నతమైన యజమాని, సర్వోన్నతమైన స్నేహితుడు,



Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972


ఇప్పుడు, ఆత్మ ఎలా వేరొక శరీరమునకు వెళ్ళుతుంది? ఈ జీవితము తరువాత, నేను మెరుగైన జీవితం పొందుతాను, అది బాగుంటుంది. నేను ఆధామమైన జీవితాన్ని పొందితే, అప్పుడు పరిస్థితి ఏమిటి? తదుపరి జీవితాములో నేను పిల్లి లేదా కుక్క లేదా ఆవు యొక్క జీవితాన్ని పొందితే. మీరు అమెరికాలో మళ్ళీ పుట్టారు అనుకుందాం. మీరు మీ శరీరాన్ని మార్చుకుంటే, మొత్తం పరిస్థితులు మారిపోతాయి. మానవుడిగా, మీకు ప్రభుత్వము అన్ని రకాల రక్షణను ఇస్తుంది, కానీ మీరు మరొక శరీరంతో, చెట్టుగా లేదా జంతువులుగా గాని పుడితే, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. జంతువు కబేళాకి వెళుతుంది; చెట్లను కత్తిరిస్తున్నారు. అవి నిరసన వ్యక్తము చేయలేవు. ఇది భౌతిక జీవన పరిస్థితి. కొన్నిసార్లు మనం మంచి జీవన పరిస్థితిని పొందుతున్నాం, కొన్నిసార్లు మన ఆధమ జీవితపు పరిస్థితిని పొందుతున్నాం. హామీ లేదు. ఇది నా పని మీద ఆధారపడి ఉంటుంది. అది ఆచరణాత్మకమైనది. ఈ జీవితంలో కుడా మీరు విద్యాభ్యాసం చేస్తే, మీ భవిష్యత్తు చాలా బాగుంటుoది. మీరు విద్యావంతులు కాకపోతే, మీ భవిష్యత్తు అంత ప్రకాశవంతమైనదిగా ఉండదు. అదేవిధంగా, ఈ మానవ రూపములో, మనము ఈ పునరావృతమవ్వుతున్న జన్మ మరణములను పరిష్కారం చేసుకోవచ్చు. మానవ జీవితం యొక్క ఏకైక కర్తవ్యము ఇది, జన్మ, మరణం, వృద్ధాప్యము వ్యాధి: జీవితంలోని ఈ భౌతిక పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి మనము పరిష్కారం చేయవచ్చు. ఆ పరిష్కారం కృష్ణ చైతన్యము. మనము కృష్ణ చైతన్యమును పొందిన వెంటనే ... కృష్ణ చైతన్యము అర్థం కృష్ణుడు, దేవాదిదేవుడు, అయిన భగవంతుడు, దేవుడు. మనము కృష్ణుడి లో భాగము. ఇది కృష్ణ చైతన్యము. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ తండ్రి , మీ సోదరులను , మీమల్ని మీరు అర్థం చేసుకున్నట్లుగా. మీరు తండ్రి యొక్క కుమారులు. అర్థం చేసుకోవడం కష్టం కాదు. తండ్రి మొత్తం కుటుంబాన్ని నిర్వహిoచడము వలె, అదేవిధంగా, కృష్ణుడు, దేవాదిదేవుడు, దేవుడు, అయినకు అనేక అపరిమితమైన కుమారులను, జీవులను కలిగి ఉన్నాడు, అయిన మొత్తం ప్రపంచాన్ని, మొత్తం కుటుంబాన్ని నిర్వహిస్తున్నాడు. ఇబ్బంది ఏమిటి? తరువాత కర్తవ్యము అభివృద్ధి చెందిన చైతన్యముగా పెంపొందించుకుoటము. ఒక మంచి కుమారుడు లాగా, "నా తండ్రి నా కోసం ఎంతో చేసారు. అని భావించి నప్పుడు నేను తిరిగి చెల్లించవలసి ఉన్నది, లేదా నా తండ్రి నా కోసం చేసిన పనులను కనీసం నేను రుణాపడి ఉండాలి " ఈ భావనను కృష్ణ చైతన్యము అని పిలుస్తారు. కృష్ణ చైతన్యము పొందాలంటే, మనము మూడు విషయాలను మాత్రమే అర్ధం చేసుకోవాలి:

bhoktāraṁ yajña-tapasāṁ
sarva-loka-maheśvaram
suhṛdaṁ sarva-bhūtānāṁ
jñātvā māṁ śāntim ṛcchati
(BG 5.29)

మనలో ప్రతి ఒక్కరము సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము. ఇది జీవితము కోసము పోరాటము. ఈ మూడు సూత్రాలను మనము అర్థం చేసుకుంటే, దేవుడు సర్వోన్నతమైన తండ్రి, దేవుడు సర్వోన్నతమైన యజమాని, దేవుడు సర్వోన్నతమైన స్నేహితుడు, ఈ మూడు విషయాలను, మీరు అర్థం చేసుకుంటే, వెంటనే మీరు శాంతిని పొందుతారు. తక్షణమే. మీరు సహాయం కోరకు స్నేహితులను కోరుతున్నారు, చాలా మందిని. కానీ మనము దేవుణ్ణి అంగీకరించినట్లయితే, కృష్ణుడు, నా స్నేహితుడు, దేవాదిదేవుడు, సరోన్నతమైన స్నేహితుడు, మీ స్నేహం సమస్య పరిష్కారమవుతుంది. అదేవిధంగా, మనము సర్వోనతమైన యజమానిగా దేవుణ్ణి అంగీకరిస్తే,మన ఇతర సమస్య పరిష్కరించబడుతుంది. ఎందుకనగా మనము దేవుడి ఆస్తికి యాజమాన్యమును తప్పుగా కోరుకుంటున్నాము. ఈ భూమి, అమెరికా యొక్క ఈ భూమిని అమెరికన్లకు చెందుతుంది అని తప్పుగా ప్రకటించుకోనుట వలన ఆఫ్రికా భూభాగం ఆఫ్రికన్లకు చెందుతుంది. కాదు ప్రతి దేశం దేవుడుకి చెందుతుంది. మనము వేర్వేరు దుస్తులలో దేవుడి కుమారులము. ఇతరుల హక్కును ఉల్లంఘించకుండా, తండ్రి, దేవుడు ఆస్తిని ఆస్వాదించడానికి మనకు హక్కు ఉన్నది. కుటుoబములోలాగానే, మనo నివసిస్తున్నాము, చాలామoది సహోదరులు ఉంటారు, తల్లితండ్రులు ఏమైతే, మనకు తినడానికి ఇస్తారో మనము తింటాము. మనము ఇతరుల కంచము నుండి అన్యాయంగా తీసుకోము. అలా చేస్తే ఆది నాగరిక కుటుంబం కాదు. అదేవిధంగా, మనము దేవుడి చైతన్యమును కలిగి ఉంటే, కృష్ణ చైతన్యమును, ప్రపంచంలోని మొత్తం సమస్యలు - సామాజిక, మతము, ఆర్థికాభివృద్ధి, రాజకీయాలు - ప్రతిదీ పరిష్కారం అవ్వుతాయి.అది వాస్తవము.

అందువలనే మనము ఈ కృష్ణ చైతన్య ఉద్యమంను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాము, మొత్తం మానవ సమాజం యొక్క ప్రయోజనము కోసం. మేద్దస్సు కలిగిన వ్యక్తులకు, ముఖ్యంగా విద్యార్ధులు, ఈ ఉద్యమములో చేరడానికి, శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఈ ఉద్యమము ఏమిటి అని. మన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, కనీసం రెండు డజన్ల పుస్తకాలు, పెద్ద, పెద్ద, సంపుటములు. మీరు వాటిని చదవవచ్చు, మీరు ఈ ఉద్యమమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, మాతో కలువ వచ్చు.

ధన్యవాదాలు. హరే కృష్ణ.