TE/Prabhupada 0332 - మొత్తం ప్రపంచము చాలా ప్రశాంతమైన పరిస్థితిలో ఉండవచ్చు



Room Conversation -- April 27, 1976, Auckland, New Zealand


మొత్తం ప్రపంచము చాలా ప్రశాంతమైన పరిస్థితిలో ఉండవచ్చు. కేవలము మూర్ఖపు నాయకులచే తప్పుగా నిర్వహించబడుతున్నది. లేకపోతే, ప్రజలు చాలా శాంతిగా జీవిస్తారు, చక్కని ఆహారము తిని సమయమును వృధా చేయకుండా ఉండవచ్చును, జీవితం యొక్క కనీస అవసరాములను ఆపవలసిన అవసరం లేదు. తినడం, నిద్ర పోవడానికి, లైంగిక జీవితం కోసము కుడా అమరిక ఉంది. కానీ ముర్ఖులు దుష్టుల వలె కాదు. తేలివి ఉన్నా మనిషి వలె. కానీ ఈ ఆధునిక నాగరికత, ఇది పిచ్చిది, వెర్రి నాగరికత. లైంగిక జీవితంలో కొంచెం ఆనందం ఉంది- కేవలము లైంగిక జీవితం, లైంగిక జీవితం పెంచుకోవడం, ప్రతిదీ పాడుచేయడము. అది వెర్రి తనము. తినడం - ఏదైనా తినoడి, ఏ చెత్తదైన , ఒక పంది అవ్వండి. నిద్ర పోవడము - , ఎటువంటి పరిమితి లేదు, ఇది సాధ్యమైతే ఇరవై నాలుగు గంటల నిద్రపోoడి. కొనసాగండి, ఇది జరుగుతోంది. తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము. రక్షణ - అణు ఆయుధములను కనుగొనడము, ఈ ఆయుధం, ఆ ఆయుధం, అమాయక వ్యక్తులను చంపడము, అనవసరంగా, రక్షణ శాఖ. ఇది జరుగుతోంది. కానీ ప్రతిదీ శాంతియుత స్థితిలో సరిగా ఉపయోగించుకోవచ్చు, మీరు శాంతిగా ఉంటే కలతలు ఉండవు, అప్పుడు మీరు ఎంతో సంతోషంగా హరే కృష్ణ మంత్రమును జపము చేస్తారు మీ జీవితం విజయవంతమవుతుంది. ఇది మన కార్యక్రమం. మనము దేనిని ఆపడానికి కోరుకోవటము లేదు ఇది ఎలా నిలిపివేయబడుతుంది? కనీస అవసరములు ఏదైనా ... నేను సన్యాసమును తీసుకున్నాను. అది ఏమిటి? , మాకు సెక్స్ లైఫ్ మాత్రమే లేదు. కాకపోతే, మేము కూడా తిoటాము, మేము కూడా నిద్రిస్తాము. మంచి వృద్ధాప్యంలో అది కుడా ఆపివేయబడింది. వృద్ధాప్యంలో, నా లాంటి వ్యక్తి ఎనభై సంవత్సరాల వయసులో , నేను లైంగిక జీవితం కోసం ప్రాకులాడితే అది చాలా బాగుంటుoదా? యువకులు, వారికి అనుమతించబడింది. పర్వాలేదు. కానీ వృద్ధుడు క్లబ్కు వెళ్తాడు లైంగిక జీవితం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాడు. అందువలన యువ తరం, వారికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి గృహస్థ జీవితాన్ని యాభై సంవత్సరాల వరకు అనుమతించారు. అంతే. ఆ తరువాత, సెక్స్ జీవితం ఆపాలి. వాస్తవమునకు, వారు జనాభాను పెరగకుండా ఉండాలనుకుంటున్నారు. అప్పుడు ఎందుకు సెక్స్, అప్పుడు? లేదు, వారు లైంగిక జీవితం కలిగి ఉంటారు, కాని వారికీ జనాభా వద్దు, పిల్లలను చంపేస్తారు. అది ఏమిటి? కేవలము పాపాత్మకమైన జీవితం. వారు బాధపడతారు, బాధపడటము కొనసాగుతుంది. మనము ఆ బాధలను ఆపాలని కోరుకుంటున్నాము. ఈ మూర్ఖులకు, వారు అర్థం చేసుకోలేరు. వారు అనుకుంటున్నారు, "హరే కృష్ణ ఉద్యమం కలత పెడుతోంది." అని మూర్ఖుల నాగరికత. మనం మన ప్రయత్నం చేద్దాము. ఏమి చేయవచ్చు? మీరు కూడా ఈ ఉద్యమమునకు సహాయం చేస్తున్నారు. కొత్త ఆలోచనలను తయారు చేయడము ద్వారా ఉద్యమమును పాడుచేయవద్దు. అలా చేయవద్దు. ప్రామాణిక మార్గంలో వెళ్లండి, మీరే స్వచ్ఛముగా ఉండండి; అప్పుడు ఉద్యమం తప్పకుండా విజయవంతం అవుతు౦ది. కానీ మీరు చపలమైన ఆలోచనలతో దానిని పాడు చేయాలనుకుంటే, అప్పుడు ఏమి చేయగలము? అది చెడిపోతుంది. మీరు చపలమైన ఆలోచనలతో, అసమ్మతితో మీలో మీరు యుద్ధం చేసుకుంటూ ఉంటే, అప్పుడు ఇది మీగతా ఉద్యమాల వలె మరొక ఉద్యమము అవుతుంది. అది ఆధ్యాత్మిక శక్తిని కోల్పోతుంది. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు చేయకూడదు.... వాస్తవానికి, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు: "ఈ హరే కృష్ణమంత్రం ఇంతా శక్తిని ఎలా కలిగి ఉన్నాది. అది ఎలా ఇంతా త్వరగా మారుస్తుంది?" మరొక వైపు ఒప్పుకోవలసి ఉంది, దీనికి శక్తీ లేకపోతే, అది ఎలా మారుస్తుంది. మనము ఆ శక్తిని కలిగి ఉండాలి. దీనిని ఒక సాదారణమైన సంగీతముగా చేయవద్దు. ఇది వేరే విషయము, ఆధ్యాత్మికము. ఇది సంగీతముగా కనిపిస్తోంది, అయితే ఇది పూర్తిగా ఆధ్యాత్మికము. Mantrauśadhi-vaśa. మంత్రం ద్వారా, పాములు కూడా ఆకర్షించ బడుతాయి. మంత్రం సాదారణమైన ధ్వని కాదు. మనము మంత్రమును శక్తివంతంగా ఉంచవలెను. శక్తివంతంగా, అపరాధములు లేకుండా కీర్తన చేయుట ద్వారా, పవిత్రముగా ఉండుట ద్వారా మీరు మంత్రాన్ని కలుషితము చేస్తే, అది దాని ప్రభావాన్ని కోల్పోతుంది.