TE/Prabhupada 0336 - వారు దేవుడు కోసము పిచ్చివాడిలా ఎలా అయ్యారు
Lecture on SB 1.2.5 -- Aligarh, October 9, 1976
ఇప్పుడు మీరు ఈ దేశంలో ఉన్నారు, భారతదేశంలో అనుకుందాం, తరువాతి జీవితంలో, ఎందుకంటే మీరు మీ శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది, తదుపరి జీవితంలో మీరు భారతదేశంలో జన్మిస్తారని కాదు. మీరు ఉన్నత లోకములో లేదా జంతు సమాజoలో జన్మిoచి వుoడవచ్చు. ఎటువంటి హామీ లేనందున. కృష్ణుడు tathā dehāntara-prāptir అని చెప్తాడు. మరణం అంటే శరీరం యొక్క మార్పు. కానీ మీరు ఏ విధమైన శరీరాన్ని అంగీకరిస్తున్నారు, అది దేవుని అమరికపై ఆధారపడి ఉంటుంది. కానీ మీరు కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు.ఉదాహరణకు మీరు మెడికల్ పరీక్షలో ఉత్తీర్ణమైతే, మీరు మెడికల్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంది, ప్రభుత్వ వైద్య సేవ బోర్డులో సేవలను అందించడానికి, కానీ ఆయినప్పటికీ, మిమల్ని తప్పనిసరిగా వైద్య బోర్డు ఎంపిక చేయాలి ఇంకా చాల చాల ఉంటాయి. చాలా నియమములు ఉంటాయి అదేవిధంగా తదుపరి శరీరమును పొందడం, మీ ఎంపిక కాదు. ఆ ఎంపిక ఉన్నత ప్రామాణికుల మీద ఆధారపడి ఉంటుంది. Karmaṇā daiva netreṇa jantur dehopapattaye ( SB 3.31.1) మనకు తెలియదు, మన తదుపరి జీవితం. తరువాతి జీవితమేమిటి అని మనము ప్రయత్నిoచము. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము తరువాతి జీవితాన్ని అంగీకరించాలి.
అందువలన మనము దాని కోసము మనం సిద్ధపడాలి. తయారు కావటము అంటే భగవద్గీతలో చెప్పబడింది. yānti deva-vratā devān ( BG 9.25) మీరు ఉన్నత గ్రహాలకు వెళ్లడానికి మీరు సిద్ధ పడితే , చంద్ర లోకమునకు, సుర్య లోకమునకు, ఇంద్రలోకామునకు, స్వర్గలోకామునకు, బ్రహ్మ లోకమునకు, జనలోకామునకు, మహర్లోకామునకు, తపో లోకమునకు - చాలా ఉన్నాయి, వందల. మీరు అక్కడకి వెళ్లాలనుకుంటే, ఆ విధంగా మీరు సిద్ధం అవ్వాలి Yānti deva-vratā devān pitṟn yānti pitṛ-vratāḥ. మీరు పిత్రు లోకామునకు వెళ్లాలనుకుంటే, మీరు అక్కడకి వెళ్లవచ్చు. మీరు ఉన్నత లోకములకు వెళ్లాలని కోరుకుంటే, దేవలోకమునకు , మీరు అక్కడకు వెళ్ళవచ్చు. మీరు ఇక్కడ ఉండాలని అనుకుంటే, మీరు ఇక్కడ ఉండవచ్చు. మీరు వెళ్ళాలనుకుంటే, లోకా, గోలకా, వ్రిందావనా, mad-yājino 'pi yānti mām ( BG 9.25) మీరు అక్కడకు వెళ్ళవచ్చు. తిరిగి ఇంటికి, తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్ళటము. అది సాధ్యమే. కృష్ణుడు చెప్తాడు tyaktvā dehaṁ punar janma naiti mām eti ( BG 4.9) అని . మీరు కావాలనుకుంటే భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళవచ్చు, తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్ళవచ్చు. అది సాధ్యమే. తెలివైన వ్యక్తులు, వారు తెలుసుకోవాలి నేను దేవలోకామునకు వెళితే, అక్కడకి వెళ్ళటము వలన ఫలితమేమిటి? నేను పితృ లోకమునకుకు వెళితే, ఫలితమేమిటి? నేను ఇక్కడ ఉంటే, ఫలితమేమిటి? నేను భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళితే దేవుడుదగ్గరకు తిరిగి వెళ్ళితే, ఫలితమేమిటి? " అంతిమ ఫలితం ఏమిటంటే, మీరు భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళినట్లయితే, భగవంతుడి దగ్గరకు తిరిగి వెళ్ళినట్లయితే, అప్పుడు కృష్ణుడు చెప్పుతాడు ఫలితమేమిటి అని? దీని ఫలితం tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) మీరు ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మించరు. ఇది అత్యధిక లాభం. Punar janma naiti mām eti.
- mām upetya tu kaunteya
- duḥkhālayam aśāśvatam
- nāpnuvanti mahātmānaḥ
- saṁsiddhiṁ paramāṁ gatāḥ
- (BG 8.15)
ఇది అత్యధిక పరిపూర్ణము. అందువలన ఇక్కడ చెప్పబడింది, sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) మీరు తిరిగి ఇంటికి వెళ్లాలని అనుకుంటే, తిరిగి దేవుడికి దగ్గరకు, అప్పుడు yato bhaktir adhokṣaje. మీరు ఈ మార్గామును అనుసరించాలి, భక్తి. Bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ( BG 18.55) కృష్ణుడు, లేదా దేవాదిదేవుడు, కర్మ, జ్ఞానము, యోగా వలన అర్థం చేసుకోలేము. కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి ఎటువంటి పద్ధతి సరిపోదు. మీరు కృష్ణుడిచే సిఫార్సు చేయబడిన ఈ పద్ధతిని తీసుకోవాలి, bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ( BG 18.55) కృష్ణుడి లిలాలో మేము పాల్గొనము దానిని భక్తులు నిర్వహిస్తే తప్ప. ప్రొఫెషనల్ వ్యక్తులు కాదు. అది నిషేధించబడింది. చైతన్య మహాప్రభు ఎన్నడూ పాల్గోనలేదు. ఎందుకంటే కృష్ణుడి గురించి భక్తి మార్గము ద్వారా మాత్రమే అర్థం చేసుకోవచ్చు. Yato bhaktir adhokṣaje ( SB 1.2.6) భక్తి లేకుండా, అది సాధ్యం కాదు. భక్తి మార్గమును వ్యక్తి తీసుకోవాలి వారు తిరిగి ఇంటికి , తిరిగి భగవంతునికి దగ్గరకు తిరిగి వెళ్ళాలని కోరుకుంటే. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం.
మన ఉద్యమం, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, భక్తియుక్త సేవలో ఎలా ఉన్నత స్థానమునకు వెళ్ళాలో ప్రజలకు బోధిస్తుంది భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, దేవుడు దగ్గరకు తిరిగి ఎలా వెళ్ళటమును. ఇది చాలా కష్టమైన పని కాదు. ఇది చాలా సులభం. ఇది సులభం కాకపోతే ఐరోపావాసులు, అమెరికన్లు ఎలా తీవ్రముగా తీసుకుంటారు ఎందుకంటే వారు, ఈ ఉద్యమం ప్రారంభించటానికి ముందు కనీసం పది సంవత్సరాల ముందు నేను అనుకుంటున్నాను, చాలామందికి, వారికి కృష్ణుడి గురించి ఏమాత్రం తెలియదు. ఇప్పుడు వారు అందరు కృష్ణుడి భక్తులు. క్రైస్తవ పూజారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. బోస్టన్లో, ఒక క్రిస్టియన్ పూజారి, అయిన ఇలా అన్నాడు, "ఈ బాలురు, వారు మన అబ్బాయిలే, క్రైస్తవ కుటుంబము నుండి లేదా యూదు కుటుంబము నుండి వచ్చినవారు. ఈ ఉద్యమమునకు ముందు వారు మనల్ని చూడటానికి కూడా వారు పట్టించుకోలేదు, లేదా దేవుడు గురిoచిన ఏ ప్రశ్న అయిన అడగ లేదు లేదా చర్చికి రాలేదు. వారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు, వారు దేవుడు కోసము పిచ్చివాడిలా ఎలా అయ్యారు? " వారు ఆశ్చర్యపోతున్నారు. "ఎందుకు? ఎందుకు వారు అలా మారారు ...?" ఎందుకంటే వారు ఈ మార్గమును తీసుకున్నారు. పద్ధతి చాలా ముఖ్యం. కేవలము కల్పన ... భక్తి సిద్ధాంతము కాదు. ఇది ఆచరణాత్మకమైనది. Yato bhaktir adhokṣaje. మీరు భక్తి పద్ధతిలో వెళ్లాలనుకుంటే, ఇది కల్పన కాదు. మీరు తప్పనిసరిగా ఈ పద్ధతిలో పాల్గొనాలి. Yato bhaktir adhokṣaje. పద్ధతి ఏమిటంటే
- śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
- smaraṇaṁ pāda-sevanam
- arcanaṁ vandanaṁ dāsyaṁ
- sakhyam ātma-nivedanam
- (SB 7.5.23)