TE/Prabhupada 0338 - ఈ ప్రజాస్వామ్యము యొక్క విలువ ఏమిటి అందరు మూర్ఖులు దుష్టులు



Lecture on BG 1.31 -- London, July 24, 1973


Catur-vidhā bhajante māṁ sukṛtina. Sukṛtina అంటే పుణ్యాత్ములు. కృతి అoటే ప్రాపంచిక కార్యక్రమాలను నిర్వహించుటలో చాలా నిపుణులని. పవిత్ర కార్యక్రమాలలో నిమగ్నమైన వారిని సుఖృతి అంటారు. రెండు రకాల కార్యక్రమాలు ఉన్నాయి: అపవిత్రమైన కార్యక్రమాలు, పాపములు, పవిత్ర కార్యక్రమాలు. చర్చిలో లేదా ఆలయంలో ప్రార్ధన చేసేవాడు, ఓ ప్రభు,మాకు రోజు వారీ రొట్టె ఇవ్వండి, లేదా "దేవుడా, నాకు కొంత డబ్బు ఇవ్వండి" లేదా "దేవుడా, ఈ బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి," వారు కూడా భక్తిలో ఉన్నారు. వారు అపవిత్రులు కారు. భక్తిలేని ప్రజలు, వారు దేవుడికి కృష్ణుడికి ఎప్పటికి శరణాగతి పొందారు. Na māṁ duṣkṛtino mūḍhāḥ, prapadyante narādhamāḥ ( BG 7.15) ఈ తరగతి మానవులు, పాపములు చేసే వ్యక్తులు, దుష్టులు, మానవజాతి యొక్క అత్యాల్పులు, ఎవరి జ్ఞానం మాయ ద్వారా తీసివేయబడుతుందో, రాక్షసులు - ఈ వర్గ వ్యక్తులు దేవుడుకి శరణాగతి పొందరు. అందువల్ల వారు దుష్టులు, దుష్టులు. అందువల్ల అర్జునుడు పవిత్రమైనవాడు , కానీ అయిన కుటుంబ ప్రయోజనమును కోరుకోనుచున్నాడు. ఇది అయిన లోపం. అర్జున. కుటుంబ శ్రేయస్సు. అయిన సమాజం, స్నేహం ప్రేమతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందువల్ల అయిన na kāṅkṣe vijayam అని చెప్తాడు. దీనిని వైరాగ్యము అని పిలుస్తారు. Śmaśāna-vairāgya. దీన్ని śmaśāna-vairāgya అని పిలుస్తారు. Śmaśāna-vairāgya అంటే భారతదేశంలో, హిందువులు, వారు మృతదేహాన్ని కాల్చుతారు. అందువల్ల బంధువులు చనిపోయిన శరీరాన్ని దహనం చేసేందుకు, స్మశానానికి తీసుకు వెళ్లుతారు శరీరం కాలుతున్నప్పుడు, అక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ అక్కడ, వారు కొద్దిగా వైరాగ్యము పొందుతారు , ఇది శరీరం. మనము ఈ శరీరం కోసం పని చేస్తున్నాము. ఇప్పుడు అది మరణించినది. ఇది బూడిదగా కాల్చాబడినది. కావున ప్రయోజనము ఏమిటి? " ఈ రకమైన వైరైగ్యము, అక్కడ ఉంది. కానీ అయిన స్మశానము నుండి వచ్చిన వెంటనే అయిన తన కార్యక్రమాలను ప్రారంభిస్తాడు. స్మశానములో, అయిన వైరాగ్యము పొందుతాడు. ఇంటికి వచ్చిన వెంటనే, మళ్ళీ అయిన తీవ్రముగా, తీవ్రముగా, ఎలా సంపాదించాలో, ఎలా డబ్బు సంపాదించాలో, ఎలా డబ్బు సంపాదించాలో, ఎలా డబ్బు సంపాదించాలో. అందువల్ల ఈ రకమైన వైరైగ్యాన్ని śmaśāna-vairāgya అని పిలుస్తారు తాత్కాలికంగా . అయిన వైరాగి అవ్వలేడు. అయిన చెప్పాడు, na kāṅkṣe vijayam: ( BG 1.31) నాకు విజయము వద్దు. నాకు ఇది ఆవసరము లేదు. ఇది తాత్కాలిక సెంటిమెంట్. తాత్కాలిక భావన. ఈ ప్రజలు, వారు కుటుంబ జీవితముపై ఆసక్తి కలిగి ఉన్నారు. వారు ఇలా చెప్పవచ్చు, "నేను ఈ ఆనందాన్ని కోరుకోవటము లేదు, ఈ మంచి పరిస్థితిని, విజయమును కోరుకోవటము లేదు. నాకు అవసరము లేదు. " కానీ అయిన ప్రతిదీ కోరుకుంటున్నాడు. అయిన ప్రతిదీ కోరుకుంటున్నాడు. ఎందుకనగా śreyas అంటే ఏమిటో అతడికి తెలియదు. Śreyas అంటే కృష్ణుడు. వాస్తవానికి, కృష్ణుడిని లేదా కృష్ణ చైతన్యమును పొందినప్పుడు, అప్పుడు అయిన చెప్ప వచ్చు "నాకు ఈ అవసరం లేదు." వారు చెప్పరు. ఎందుకు వారు చెప్తారు? "ఇది అవసరము లేదని" ఇక్కడ మనకు ఏమి ఉన్నాది? ఉదాహరణకు నేను ఒక రాజ్యాన్ని పొందానని అనుకుందాం. కావునా అది నా రాజ్యం ? కాదు. అది కృష్ణుడి రాజ్యం. ఎందుకనగా కృష్ణుడు చెబుతారు bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram ( BG 5.29) అయిన యజమాని. నేను అయిన ప్రతినిధిగా ఉండవచ్చు. ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యమును కలిగి ఉండాలని కృష్ణుడు కోరుకుంటాడు.

రాజు యొక్క కర్తవ్యము, కృష్ణుడి ప్రతినిధిగా, ప్రతి పౌరుడు కృష్ణ చైతన్యమును కలిగిఉండేటట్లు చేయటము. అప్పుడు అయిన మంచిగా బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. చక్రవర్తులు అలా చేయని కారణంగా, ఇప్పుడు రాచరికం ప్రతిచోటా రద్దు చేయబడింది. మరలా రాజులు, ఎక్కడైన రాచరికం ఉంటే అక్కడ, కనీసం, రాజరికం ఉన్నా అవకాశము ఉంటే, ఇక్కడ ఇంగ్లండ్లో లాగానే ఇక్కడ ఉన్నాది, చక్రవర్తి కృష్ణ చైతన్య వంతుడు అయినట్లయితే, వాస్తావానికి కృష్ణుడి ప్రతినిధిగా ఉంటే, అప్పుడు రాజ్యం వ్యవహారాలు మొత్తం మారుతాయి. అది అవసరం. మన కృష్ణ చైతన్య ఉద్యమం ఆ ప్రయోజనము కోసం ఉన్నాది. ఈ ప్రజాస్వామ్యం అని పిలవబడేది మనకు ఇష్టం లేదు. ఈ ప్రజాస్వామ్యము యొక్క విలువ ఏమిటి? అందరు ముర్ఖులు దుష్టులు. వారు మరొక దుష్టుడికి ముర్ఖునికి ఓటు వేస్తారు, అయిన ప్రధానమంత్రి అవుతాడు, లేదా ఇది లేదా అది. చాలా సందర్భాలలో ... చాలా సందర్భాలలో. ఇది ప్రజలకు మంచిది కాదు. శిక్షణ లేనందున ఈ ప్రజాస్వామ్యం అని పిలవబడు చున్నా దానిని మనము ఆంగీకరించము. రాజు శిక్షణ పొందినట్లయితే ... అది రాచరికం యొక్క పద్ధతి. ఉదాహరణకు యుధిష్టిర మహారాజు లేదా అర్జునుడు లేదా ఎవరైనా . రాజులు అందరు. Rājarṣi. వారిని రాజర్షి అని పిలిచారు.

imaṁ vivasvate yogaṁ
proktavān aham avyayam
vivasvān manave prāha
manur ikṣvākave 'bravīt
(BG 4.1)

Evaṁ paramparā-prāptam imaṁ rājarṣayo viduḥ ( BG 4.2) Rājarṣayaḥ. రాజా, అంటే రాజు మాత్రమే కాదు. అయిన ఒక గొప్ప ఋషి, సాధువు లక్షణములు కలిగిన వ్యక్తి, ఉదాహరణకు మహారాజు యుధిష్టిరా లేదా అర్జునుడి వలె . వారు సాధువు లక్షణములు కలిగిన వ్యక్తులు. వారు సాదారణమైన వారు కాదు, ఈ తాగుబోతు రాజు , "నాకు దగ్గర చాలా డబ్బు ఉన్నాది. నన్ను త్రాగనివ్వండి, వేశ్య యొక్క నృత్యం ఉండనివ్వండి. " అలా కాదు. వారు ఋషులు. వారు రాజు అయినప్పటికీ, వారు ఋషులు. ఆ రకమైన రాజు కావాలి, రాజర్షి. అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు. బెంగాలీలో ఒక సామెత ఉంది, rājara pāpe rāja naṣṭa gṛhiṇī doṣe gṛhastha bhraṣṭa. గృహస్థ జీవితం లో, గృహ జీవితం లో, భార్య మంచిది కాకపోతే, ఆ ఇంటిలో గృహస్థజీవితములో, గృహ జీవితములో ఎవరూ సంతోషంగా ఉండరు. అదేవిధంగా, ఒక రాజ్యంలో, రాజు చెడ్డవాడుగా ఉంటే, అప్పుడు ప్రతిదీ, ప్రతి ఒక్కరూ భాధపడతారు. ఇది సమస్య.