TE/Prabhupada 0345 - కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని ఉంటాడు
Lecture on SB 1.15.1 -- New York, November 29, 1973
మనలో ప్రతి ఒక్కరూ కృష్ణుడితో చాల సన్నిహితముగా కలసి ఉన్నాము కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని ఉంటాడు. కృష్ణుడు చాలా దయతో ఉంటాడు, అయిన కేవలం ఎదురు చూస్తున్నాడు, "ఈ దుష్టుడు తన ముఖాన్ని నా వైపుకి ఎప్పుడు తిప్పుతాడు." అయిన చాలా దయ కలిగి ఉన్నాడు. కానీ మనం జీవులము, మనము చాలా దుర్మార్గంగా ఉన్నాము, కృష్ణుడి వైపుకి తప్ప మరేదైనా దాని వైపుకి మన ముఖమును మనం తిప్పుతాము. ఇది మన పరిస్థితి. మనము చాలా ఆలోచనలతో, సంతోషంగా ఉండాలనుకుంటున్నాము. అందరూ తన సొంత ఆలోచన చేస్తున్నారు, "ఇప్పుడు ఇది ..." కానీ ముర్ఖులు, వారికి తెలియదు, ఆనందం పొందడానికి అసలు పద్ధతి ఏమిటి, అది కృష్ణుడు. వారికి తెలియదు. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇuṁ durāśayā ye bahir-artha-māninaḥ ( SB 7.5.31) మీరు, మీ దేశంలో చూడగలరు, వారు చాలా విషయాలు ప్రయత్నిస్తున్నారు, చాలా ఆకాశహర్మ్యం భవనాలు, చాలా మోటార్ కార్లు, చాలా పెద్ద, పెద్ద నగరాలు, కానీ ఆనందం లేదు. ఎందుకంటే వారికి తెలియదు ఏమి తప్పిపోయినదో . తప్పిపోయిన విషయమును మనం ఇస్తున్నాము. ఇక్కడ ఉంది, "మీరు కృష్ణుడిని తీసుకొoడి. మీరు ఆనందంగా ఉంటారు." ఇది మన కృష్ణ చైతన్యము. కృష్ణుడు మరియు జీవి, వారు చాలా సన్నిహిత సంభందమును కలిగి ఉన్నారు. ఉదాహరణకు తండ్రి కొడుకు వలె , లేదా స్నేహితుడు మరియు స్నేహితుడు వలె, లేదా గురువు మరియు సేవకుడి వలె . మనము చాలా సన్నిహితముగా కలిసి ఉన్నాము. కానీ కృష్ణుడితో మన సన్నిహిత సంబంధాన్ని మర్చిపోవడము వలన, ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాము, అందువలన మనము చాలా కష్టాలను, భాదలను ఎదురుకోవలసి ఉన్నాది ఇది పరిస్థితి. Kṛṣṇa bhuliya jīva bhoga vañcha kare.
మనము జీవులము, ఈ భౌతిక ప్రపంచం లోపల సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాము, మీరు భౌతిక ప్రపంచంలో ఎందుకు ఉన్నారు, ఎందుకు ఆధ్యాత్మిక ప్రపంచంలో కాదు? ఆధ్యాత్మిక ప్రపంచం, ఎవరు అనందించే వానిగా అవ్వలేరు, భోక్త. అది దేవాదిదేవుడు మాత్రమే, bhoktāraṁ yajña-tapasāṁ sarva... ( BG 5.29) ఏ తప్పు లేదు. జీవులు కూడా ఉన్నారు, కానీ వారికి వాస్తవముగా ఆనందించేవాడు, యజమాని, కృష్ణుడు అని వారికీ బాగా తెలుసు. అది ఆధ్యాత్మిక రాజ్యం. అదేవిధంగా, ఈ భౌతిక ప్రపంచంలో కూడా , మనము అనందిన్చేవారిమి కాదు అని మనకు చక్కని అవగాహనా ఉంటే కృష్ణుడు ఆనందించేవాడు. అప్పుడు అది ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అందరిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది, మనము, మనము ఆనందించే వారిమి కాదు, కృష్ణుడు ఆనందించేవాడు. ఉదాహరణకు ఈ మొత్తం శరీరం లాగే, ఆనందించేది కడుపు, చేతులు కాళ్లు కళ్ళు చెవులు మెదళ్ళు ప్రతిదీ, ఆనందించే విషయాలను కనుగొని కడుపులో ఉంచడానికి ఇవి వినియోగించబడాలి. ఇది సహజమైనది. అదేవిధంగా, మనము దేవుడిలో లేదా కృష్ణుడిలో భాగము, మనము ఆనందించే వారిమి కాదు.