TE/Prabhupada 0349 - నా గురు మహారాజు మాట్లాడినదాన్ని నేను సందేహించకుండా నమ్మాను



Arrival Address -- New York, July 9, 1976


తెలివైన వ్యక్తికి వేరే పరిస్థితి, వేరే జీవితం గురించి తెలియదు. వారికి తెలియదు. మొన్నటి రోజు మన డాక్టర్. స్వరుపా దామోదర చెప్పుతున్నారు, వారు చేసిన ఏదైనా శాస్త్రీయ అభివృద్ధి లేదా విద్యా మెరుగుదలలో, రెండు విషయాలు అవసరము. ఆకాశంలో ఈ భిన్నమైన లోకములు ఏమిటో వారికి తెలియదు. వారికి తెలియదు. వారు కేవలం ఊహించుకుంటారు. వారు చంద్ర లోకమునకు, మార్స్ లోకమునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యం కాదు. మీరు వెళ్లినప్పటికీ, ఒకటి లేదా రెండు లోకములు, లక్షలాది లోకములు ఉన్నాయి; వాటి గురించి నీకు ఏమి తెలుసు? జ్ఞానం లేదు. మరొక జ్ఞానం: వారికి జీవితం యొక్క సమస్యలు ఏమిటో తెలియదు. వారు రెండు విషయములు లేకుండ వున్నారు. మనము ఈ రెండు విషయాలను కలిగి ఉన్నాము. జీవితం యొక్క సమస్య ఏమిటంటే మనము కలిగి లేము , మనము కృష్ణ చైతన్యము నుండి దూరంగా ఉన్నాము; అందువలన మనము బాధపడుతున్నాము. మీరు కృష్ణ చైతన్యముని తీసుకుంటే, మొత్తం సమస్య పరిష్కరించబడుతుంది. ఇప్పటివరకు గ్రహల వ్యవస్థను పరిగణిస్తే, కృష్ణుడు మీకు అవకాశం కల్పిస్తున్నాడు, మీరు ఇష్టపడిన లోకమునకు మీరు వెళ్ళవచ్చు. కానీ బుద్ధి ఉన్నా వ్యక్తి ఎన్నుకుంటాడు,mad-yājino 'pi yānti mām ( BG 9.25) కృష్ణ చైతన్యము ఉన్న వారు, నా దగ్గరకు వస్తారు. ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? నేను చంద్ర లోకమునకు లేదా మార్స్ లోకమునకు లేదా బ్రహ్మ లోకమునకు వెళ్ళినా కృష్ణుడు చెప్తాడు, ā-brahma-bhuvanāl lokāḥ punar āvartino 'rjuna ( BG 8.16) మీరు బ్రహ్మలోకామునకు వెళ్ళవచ్చు, కానీ kṣīṇe puṇye puṇyo martya-lokaṁ viśanti: "మీరు తిరిగి రావలసి ఉంటుంది." కృష్ణుడు కూడా చెప్తాడు yad gatvā na nivartante tad dhāma paramaṁ mama ( BG 15.6) Mad-yājino 'pi yānti mām.

మీరు ఈ అవకాశాన్ని పొందారు, కృష్ణ చైతన్యమును . అంతా భగవద్గీతలో వివరించారు, ఇది అంతా ఏమిటి అని. ఈ అవకాశాన్ని కోల్పోకండి. శాస్త్రవేత్తలు లేదా తత్వవేత్తలు లేదా రాజకీయ నాయకుల ద్వారా మోసపోకండి. పిచ్చివారిగా ఉండకండి . కృష్ణ చైతన్యమును తీసుకోoడి. అది ఎప్పుడు సాద్యమవ్వుతుంది అంటే guru-kṛṣṇa-kṛpāya ( CC Madhya 19.151) గురువు కృపతో, కృష్ణుడి యొక్క దయతో మీరు అన్ని విజయాలను సాధించగలరు. ఇది రహస్యము.

yasya deve parā bhaktir
yathā deve tathā gurau
tasyaite kathitā hy arthāḥ
prakāśante mahātmanaḥ
(ŚU 6.23)

మనము చేస్తున్న ఈ గురు పూజా, ఇది సొంత పొగడ్త కాదు; ఇది వాస్తావ ఉపదేశము. మీరు రోజు పాడతారు, అది ఏమిటి? Guru-mukha-padma-vākya... āra nā kariyā aikya. ఇది అనువాదం. నేను స్పష్టముగా మీకు చెప్తాను, ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో సాధించిన కొద్దిపాటి విజయము ఏమైనా ఉంటే , నా గురువు మహారాజు మాట్లాడినదాన్ని నేను సందేహించకుండా నమ్మాను. మీరు కూడా అదే విధముగా చేయoడి. అప్పుడు ప్రతి విజయము వస్తుంది. ధన్యవాదాలు.