TE/Prabhupada 0354 - గుడ్డి వాడు మరొక గుడ్డి వాడిని నడిపిస్తున్నాడు
Lecture on SB 2.3.2-3 -- Los Angeles, May 20, 1972
ప్రద్యుమ్న: "భాష్యము: మానవ సమాజంలో, ప్రపంచమంతా, లక్షలాది, బిలియన్ల పురుషులు మహిళలు ఉన్నారు, దాదాపు ఆత్మని గురించి చాలా తక్కువ జ్ఞానం కలిగి ఉన్నందున వారు అందరు తక్కువ మేధస్సు కలిగిన వారు. "
ప్రభుపాద: ఇది మన సవాలు. ప్రపంచమంతా లక్షలాది, ట్రిలియన్ల పురుషులు, స్త్రీలు ఉన్నారు. కానీ వారు అoత తెలివైన వారు కాదు. ఇది మన సవాలు. , కృష్ణ చైతన్య ఉద్యమమును ఇతరులు వెర్రిగా తీసుకో వచ్చును, లేదా మనము సవాలు చేస్తాం "మీరు అందరు వెర్రి వ్యక్తులు." మన దగ్గర చిన్న పుస్తకం ఉన్నది, "ఎవరు వెర్రి వారు?" ఎందుకంటే వారు ఆలోచిస్తూన్నారు "ఈ గుండు చేయించుకున్నా అబ్బాయిలు మరియు అమ్మాయిలు వెర్రి వారు," కానీ వాస్తవానికి వారు వెర్రి వారు. ఎందుకంటే వారికి ఎటువంటి బుద్ధి లేదు. ఎందుకు? వారికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఇది జంతు చైతన్యం. కుక్కలు, పిల్లులు, అవి శరీరంమును, అవి తాము శరీరం అని అనుకుంటాయి.
- yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke
- sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ
- yat tīrtha-buddhiḥ salile na karhicij
- janeṣv abhijñeṣu sa eva go-kharaḥ
- (SB 10.84.13)
Go-khara. గో అంటే ఆవు అని అర్ధం, khara అంటే గాడిద. శారీరక చైతన్యములో ఉన్న వ్యక్తి, "నేను ఈ శరీరాన్ని." ప్రపంచంలోని మొత్తం జనాభాలో 99.9%, వారు ఇలా ఉన్నారు, "నేను ఈ శరీరం," నేను అమెరికన్, "నేను భారతీయుడిని", "నేను ఆఫ్రికన్," "నేను ఇది ..."
వారు పిల్లులు కుక్కల వలె పోరాడుతున్నారు, వారు పోరాడుతున్నారు, "నేను పిల్లిని, నీవు కుక్కవి. నీవు కుక్కవి నేను పిల్లిని" అంతే. ఈ సవాలు, "మీరు అoదరు ముర్ఖులు," ఇది చాలా బలమైన పదం, కానీ నిజానికి ఇది వాస్తవం. అది వాస్తవము. ఇది ఒక విప్లవాత్మక ఉద్యమం. మనము అందరికీ సవాలు చేస్తున్నాము మీరు అoదరు గాడిదలు, ఆవులు, మరియు జంతువులు ఎందుకంటే ఈ శరీరానికి మించిన అవగాహన మీకు లేదు. " అందువలన చెప్పబడింది ... ఈ భాష్యములో, నేను ప్రత్యేకించి ప్రస్తావించాను. ఆత్మ గురించి వారు చాలా తక్కువ జ్ఞానం కలిగి ఉoడటామువలన , వాళ్ళందరూ తెలివైనవారు కాదు. నేను గొప్ప, గొప్ప ప్రొఫెసర్లతో మాట్లాడుతాను. మాస్కోలో, ఆ పెద్ద మనిషి, ప్రొఫెసర్ కోట్వోస్కి, అయిన చెప్పాడు, స్వామిజీ మరణం తరువాత ఏమీ లేదు. అంతా పూర్త అవ్వుతుంది. అయిన దేశంలో గొప్ప ఆచార్యులలో ఒకరు. ఇది ఆధునిక నాగరికత యొక్క లోపము, మొత్తం సమాజం వాస్తవానికి పిల్లులు కుక్కలచే నియంత్రించబడుతుంది. ఏ విధముగా శాంతి సంపద ఉంటుంది? ఇది సాధ్యం కాదు. Andhā yathāndhair upanīyamānāḥ.
గుడ్డి వాడు మరొక గుడ్డి వాడిని నడిపిస్తున్నాడు. ఒక వ్యక్తికి చూడడానికి కళ్ళు ఉంటే, అయిన వందలు వేలాది మంది వ్యక్తులకు మార్గ నిర్దేసకత్వము ఇవ్వగలడు, దయచేసి నాతో పాటు రండి. నేను రహదారిని దాటాస్తాను. అయితే నాయకత్వం వహిస్తున్నా వ్యక్తి అతనే గుడ్డి వాడు అయితే, అతడు ఇతరులను ఎలా నడిపించగలడు? Andhā yathāndhair upanīyamānāḥ. కావున భాగావతములో, పోలిక లేదు. అక్కడ ఉండకూడదు. ఇది ఆద్యాత్మిక శాస్త్రం. Andhā yathāndhair upanīyamānās te 'pīśa-tantryām uru-dāmni baddhāḥ ( SB 7.5.31) Īśa-tantryām, ఈ గుడ్డి నాయకులు, వారు భౌతిక ప్రకృతి చట్టాలకు లోబడి ఉన్నారు, వారు సలహా ఇస్తున్నారు. వారు ఇచ్చే సలహా ఏమిటి?