TE/Prabhupada 0361 - వారు నా గురువులు. నేను వారి గురువు కాదు
Lecture on BG 7.3 -- Bombay, March 29, 1971
మనము ఈ భక్తియుక్త సేవను తీసుకుంటే, అప్పుడు ఈ కీర్తన, కృష్ణుడి పవిత్ర నామము యొక్క ఈ కంపనములు, చాలా సులభమైన పద్ధతి, మనము దీనిని అంగీకరిస్తే ... ఈ అబ్బాయిలకు ఈ జపమును మనము ఇచ్చాము, వారు చాలా వినయంతో అంగీకరించారు. వారు వారి రోజువారీ సేవలను చేస్తూ ఉంటే, క్రమంగా వారు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు. మీరు పారవశ్యం లో నృత్యం చేస్తున్న ఉన్నతమైన విద్యార్ధులను చూస్తే, వారు కృష్ణుడిని ఎంత అర్థం చేసుకున్నారో మీరు గ్రహించవచ్చు. ఒక సరళమైన పద్ధతి. ఎవరూ తనిఖీ చేయడము లేదు లేదా నిరోధించడము లేదు మీరు హిందువు కాదు. కావున మీరు హరే కృష్ణ కీర్తన చేయకూడదు. కాదు Yei kṛṣṇa-tattva-vettā sei guru haya ( CC Madhya 8.128) అయిన ఒక హిందువా లేదా ముస్లిమా లేదా క్రైస్తవుడా లేదా ఇదా లేదా ఆదా ? ప్రతి ఒక్కరు కృష్ణుడి, భగవద్గీత యధా తధమును నేర్చుకోవాలి. అప్పుడు అయిన ఒక ఆధ్యాత్మిక గురువు అవుతాడు.
ఈ బాలురు, ఈ అబ్బాయి అమ్మాయి ఇప్పుడే పెళ్లి చేసుకున్నరు, నేను ఆస్ట్రేలియాకు పంపుతున్నాను. అబ్బాయి ఆస్ట్రేలియా నుండి వచ్చినాడు, అమ్మాయి స్వీడన్ నుండి వచ్చింది. ఇప్పుడు వారు పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడు వారు సిడ్నీలోమన సంస్థను నిర్వహించబోతున్నారు. ఇప్పుడే నేను రెండు లేదా మూడు రోజుల్లో వారిని పంపుతున్నాను. వారు ఆలయం యొక్క నిర్వహణ భాద్యత వహిస్తారు వారు ప్రచారము కూడా చేస్తారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమము వారి సహాయంతో విస్తరిస్తుంది. నేను ఒంటరిగా ఉన్నాను, కానీ వారు నాకు సహాయం చేస్తున్నారు. వారు నా గురువులు. నేను వారి గురువు కాదు. (చప్పట్లు) ఎందుకంటే వారు నా గురు మహారాజు యొక్క ఆదేశాన్ని అమలు చేయడంలో నాకు సహాయం చేస్తున్నారు. ఇది చాలా మంచి కలయిక. కొందరు ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు, కొందరు ఫిజీ ద్వీపానికి వెళ్ళుతున్నారు. కొందరు హాంగ్ కాంగ్కు వెళతారు, కొందరు చెకోస్లోవకియా వెళతారు. మనము రష్యాకు కూడా వెళ్ళడానికి చర్చలు చేస్తున్నాము. చైనాకు వెళ్లడానికి కూడా అవకాశం ఉంది. మనము ప్రయత్నిస్తున్నాము. పాకిస్తాన్కు ఇద్దరు అబ్బాయిలను పంపాము - ఒకరు డాక్కాలో, కరాచీలో ఒకరు. (చప్పట్లు)
ఈ బాలురు, ఈ అమెరికన్ అబ్బాయిలు, నాకు సహాయం చేస్తున్నారు. భారతీయులు ఏ మాత్రం ముందుకు రాకపోవడము నాకు భాధగా ఉన్నాది. అయితే, కొoదరు ఉన్నారు, కానీ చాలా తక్కువ. యువకులు భారతదేశం నుండి ముందుకు రావాలి, వారు ఈ ఉద్యమంలో చేరాలి, ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యమున్ని వ్యాపింప చేయాలి. అది భారతీయల కర్తవ్యము. చైతన్య మహాప్రభు చెప్పినారు,
- bhārata-bhūmite haila manuṣya-janma yāra
- janma sārthaka kari' kara para-upakāra
- (CC Adi 9.41)
ఈ పరా-ఉపకరా పని, సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచం అంతటా కృష్ణ చైతన్యమును వ్యాపింపజేయుట, ప్రస్తుత క్షణములో అతి ముఖ్యమైన కర్తవ్యము. ప్రతి ఒక్కరిని రాజకీయపరంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరంగా ప్రతి ఒక్క దానిలో ఏకం చేస్తుంది. కృష్ణడు . కృష్ణుడు కేంద్రం. అది వాస్తవము. ఇది పురోగతిని సాధిస్తోంది. మనo ఇంకా ఇంకా కృషి చేస్తే అది ఇంకా ఇంకా మరింత పురోగతిని సాధిస్తుoది.