TE/Prabhupada 0378 - భులియా తుమారే కు భాష్యము



Purport to Bhuliya Tomare


భక్తివినోద ఠాకురా శరణాగతి పద్దతి గురించి పాడిన పాట ఇది. మనము శరణాగతి పొందుట గురించి చాలా విన్నాము. ఇక్కడ శరణాగతి ఎలా పొందాలి అనే దాని గురించి కొన్ని పాటలు ఉన్నాయి. భక్తివినోద ఠాకురా చెబుతున్నారు, bhuliyā tomāre, saṁsāre āsiyā, నా ప్రియమైన భగవంతుడా నేను నిన్ను మరచి భౌతిక ప్రపంచం లోకి వచ్చినాను. మరియు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎన్నో బాధలను మరియు దుఖాలను అనుభవించాను. ఎంతోకాలం నుండి, చాలాకాలం నుండి ఎన్నో రకాల జీవజాతులలో జీవించాను. అందువలన ఇప్పుడు నేను శరణాగతి పొందడానికి వచ్చాను మరియు నా కష్టాల కథను నీకు సమర్పించుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటంటే నేను నా తల్లి గర్భంలో జీవించి ఉన్నప్పుడు Jananī jaṭhare, chilāma jakhona. అక్కడ ఉన్నప్పుడు, చిన్నగా ఉన్న, ఒక గాలి కుడా చొరబడని గర్భంలో బంధించబడి ఉన్నప్పుడు చేతులు మరియు కాళ్ళు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ సమయంలో నేను మీ యొక్క దర్శనం ఒక్క క్షణము మాత్రము పొందితిని ఆ సమయం తర్వాత నేను నిన్ను చూడలేకపోయాను, ఆ సమయంలో నేను మీ దర్శనాన్ని ఒక్క క్షణము మాత్రము చూడగలిగాను. ఆ సమయంలో నేను భావించాను takhona bhāvinu, janama pāiyā, నేను ఇలా అనుకున్నాను. ఈసారి నేను జన్మించిన తర్వాత గర్భం లో నుండి బయటకు వచ్చినప్పుడు నేను పరిపూర్ణంగా భగవంతుని యొక్క సేవలో వందకు వందశాతం నెలకొంటానని నిన్ను పూజిస్తానని భావించాను. ఇక ఈ జనన మరణ చక్రంలోకి తిరిగి రానని చెప్పి ఇది చాలా సమస్యాత్మకమైనది. ఇప్పుడు నేను నీ పవిత్ర సేవలో నిమగ్నమవుతాను. ఈసారి నేను ఈ జన్మను వినియోగించుకొంటాను. ఈ మాయ నుండి బయటపడటానికి నిన్ను తప్పకుండా శ్రద్ధగా భజిస్తానని భావించాను. కాని దురదృష్టవశాత్తు నా జననం తర్వాత, " janama hoilo, paḍi' māyā-jāle, nā hoilo jñāna-lava, నేను గర్భం నుండి బయటికి వచ్చిన వెంటనే మాయాజాలంలో చిక్కుకున్నాను ఈ భౌతికమైన మాయ నన్ను పట్టుకుంది. మరియు నేను అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లో ఉన్నానని మర్చిపోయాను. నేను భగవంతుని కోసం ఏడుస్తూ ప్రార్థించినాను, ఈసారి నన్ను బయటికి వేస్తే భక్తియుక్త సేవలో నన్ను నిమగ్నం చేసుకుంటానని చెప్పియున్నాను. కానీ నేను జన్మను తీసుకున్న వెంటనే ఈ విషయాలన్నింటినీ మర్చిపోయాను. ఆ తర్వాత దశలో ādarera chele, sva-janera kole. అప్పుడు నేను చాలా ప్రియపుత్రుడుగా నయ్యాను ప్రతి ఒక్కరూ నన్ను తమ ఒడిలోకి తీసుకుంటున్నారు. అప్పుడు నేను భావించాను భౌతిక జీవితము చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమిస్తున్నారు. అప్పుడు నేను భావించాను భౌతిక ప్రపంచం చాలా బాగుంది, Ādarera chele, sva-janera kole, hāsiyā kāṭānu kāla. కారణం అక్కడ ఏ ఇబ్బంది లేదు. నేను కొద్దిగా ఇబ్బంది పడుతున్న వెంటనే ప్రతి ఒక్కరూ నాకు ఉపశమనం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. నా జీవితం ఇలాగే కొనసాగుతుందని నేను అనుకున్నాను. అందువలన నేను కేవలం నా సమయాన్ని నవ్వుతూ వృధా చేసుకున్నాను. మరియు ఆ నవ్వు నా బంధువులకు మరింత ఆకర్షణీయంగా మారింది వారు నన్ను ఎత్తుకున్నారు. ఆరోజు నేను అనుకున్నాను. "ఇది జీవితము." Janaki... janaka jananī-snehete bhuliyā, saṁsāra lāgilo. ఆ సమయంలో నా తల్లిదండ్రుల ప్రేమ అప్యాయతలు వలన నేననుకున్నాను. ఈ భౌతిక జీవితం చాలా బాగుంది. Krame dina dina, bālaka hoiyā, khelinu bālaka-saha. ఇప్పుడు క్రమంగా నేను పెరిగాను నా చిన్ననాటి స్నేహితులతో ఆడటం మొదలుపెట్టాను. అది చాలా మంచి జీవితం. కొన్ని రోజులు గడిచాక నేను కొంచెం తెలివైన వ్యక్తిగా ఉన్నప్పుడు నేను పాఠశాలకు పంపబడితిని. నేను చాలా తీవ్రంగా చదువుకోవడం మొదలు పెట్టాను. ఆ తర్వాత vidyāra gaurave, bhrami' deśe deśe, dhana uparjana kori. అప్పుడు నేను గర్వించాను. భక్తి వినోద ఠాకురా మేజిస్ట్రేట్. అతను ఒక ప్రదేశం నుండి మరొక స్థలానికి బదిలీ చేయబడ్డాడు. అతను తన జీవితాన్ని పేర్కొంటూ vidyāra gaurave, కారణం నేను కొంచెము చదువుకున్నాను. నేను ఉన్నత పదవులకు వెళ్లాను ఎంతగానో సంపాదించాను. నేను ఆలోచిస్తున్నాను" ఇది చాలా బాగుంది. Vidyāra gaurave, bhrami' deśe deśe, dhana uparjana kori. Sva-jana pālana, kori eka-mane, మరియు నా ఏకైక కర్తవ్యము ఎలా నిర్వహించాలి అని మాత్రమే Sva-jana pālana, kori eka-mane, ఎలా నా కుటుంబ సభ్యులను పోషించాలి ఎలా వారిని సంతోషంగా ఉంచాలి. ఇదే నా ఏకైక లక్ష్యం జీవితం యొక్క అంశంగా మారింది. Bārdhakye ekhona, bhakativinoda. ఇప్పుడు భక్తి వినోదా ఠాకురా, తన వృద్ధాప్యంలో kāṇdiyā kātara ati, ఇప్పుడు నేను ఈ ఏర్పాట్లను అన్నింటినీ విడిచి పెట్టాలని చూస్తున్నాను. నేను దూరంగ వెళ్ళి మరొక శరీరం తీసుకోవలసి ఉంటుంది. అందువలన నేను ఏ విధమైన శరీరాన్ని పొందబోతున్నానో నాకు తెలియదు. అందువలన నేను దుఃఖిస్తున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. Bārdhakye ekhona, bhakativinoda, kāṇdiyā kātara ati, నేను చాలా బాధపడుతున్నాను. Nā bhajiyā tore, dina bṛthā gelo, ekhona ki. నిన్ను పూజించకుండా నీకు సేవ చేయకుండా నేను ఈ విధంగా నా సమయాన్ని వృధా చేశాను. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. అందువలన నేను శరణాగతి పొందుతున్నాను