TE/Prabhupada 0409 - భగవద్గీతకు సొంత వ్యాఖ్యానము ఆనే ప్రశ్నే లేదు
Cornerstone Laying -- Bombay, January 23, 1975
మన ఉద్యమం చాలా చాలా ప్రామాణికము మరియు అది చాలా గొప్ప ప్రామాణిక పరిధిని కలిగి ఉంటుంది. అధికారము గల కార్యక్రమాలు నిర్వహించబడినవి. అందువలన నా అభ్యర్థన ఏంటి అంటే , బొంబాయి నివాసులకు, ముఖ్యంగా మన సభ్యులకు , వారు ప్రీతిగా, చురుకుగా పాల్గొనేవారు. బాంబేలో ఈ సంస్థను ఎలా విజయవంతం చేయలా అని. చాలా మంది స్త్రీలు, పురుషులు ఇక్కడ ఉన్నారు. మేము, మేము చేస్తున్న కార్యక్రమాలు విచిత్రమైన లేదా మానసిక కల్పన కాదు . ఇది ప్రామాణికము, మరియు కేవలం భగవద్గీత ప్రమాణాలు మాత్రమే మన ప్రస్తుత ఉద్యమం భగవద్గీత - భగవద్గీత యథాతథము మీద ఆధారపడి ఉంది. మేము సొంత వ్యాఖ్యానము చేయము . మేము మూర్ఖంగా సొంత వ్యాఖ్యానము చేయము , ఎందుకంటే.... నేను ఖచ్చితంగా ఈ పదం "మూర్ఖంగ," అని చెప్పాలి. మనం కృష్ణుడి చెప్పిన పదాన్ని ఎందుకు మార్చాలి? నేను కృష్ణుడి కంటే ఎక్కువా? లేదా నన్ను వివరించమని కృష్ణుడు వివరణలో కొంత భాగాన్ని వదిలిపెట్టడా? అప్పుడు కృష్ణుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? నేను నా సొంత వ్యాఖ్యానాన్ని ఇచ్చినట్లయితే, కృష్ణుడి కంటే నేను ఎక్కువగ ఆలోచిస్తే, ఇది దైవదూషణ. నేను కృష్ణుడి కంటే ఎక్కువ కాగలనా? వాస్తవానికి మనము ఈ భగవద్గీత ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, అప్పుడు మనము భగవద్గీతని తీసుకోవాలి. అర్జునుడు తీసుకున్నట్లుగానే. అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత, సర్వమ్ ఏతామృత మన్యే: "నేను అన్ని ఉపదేశాలు అంగీకరించాను, నా ప్రియమైన కేశవా, మీరు ఏది చెప్పారో అది. ఏ మార్పు లేకుండా వాటిని నేను అంగీకరించాను. "ఇది భగవద్గీత", నా మూర్ఖ మార్గంలో నేను అర్థం చేసుకున్నానో నేను భగవద్గీత ప్రయోజనాన్ని పొందలేను, అందువలన ప్రజలు నా తత్వాన్ని అంగీకరించాలా. ఇది భగవద్గీత కాదు. భగవద్గీతకు సొంత వ్యాఖ్యానము ఆనే ప్రశ్నే లేదు మీరు అర్థం చేసుకోలేకపోయినప్పుడు వ్యాఖ్యానం అనుమతించబడుతుంది. విషయలు స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు ... నేను చెప్పేది ఉందే, "ఇది మైక్రోఫోన్" అని, ప్రతి ఒక్కరూ ఇది మైక్రోఫోన్ అని అర్థం చేసుకున్నారు. దానిని వివరించే అవసరం ఏమిటి? అవసరం లేదు. ఇది మూర్ఖత్వం, మోసగించడం. భగవద్గీత మీద సొంత వ్యాఖ్యానము ఉండకుడదు ఉంది ... ప్రతిదీ అంత స్పష్టంగా ఉంది. భగవాన్ కృష్ణ చెప్పినట్లుగా ... కృష్ణుడు అనలేదు "మీరు అందరూ సన్యాసులు కావాలి మీ వృత్తిపరమైన కర్తవ్యముని వదిలివేయమని." కృష్ణుడు చెప్తాడు, sva-karmaṇā tam abhyarcya saṁsiddhiḥ labhate naraḥ ( BG 18.46) మీరు మీ కర్తవ్యమును నిర్వహించండి. మీరు మీ వృత్తిలో ఉండండి. మార్పు అవసరం లేదు. అయినా, మీరు కృష్ణ చైతన్యముతో ఉంటే మీ జీవితం విజయవంతమవుతుంది. ఇది భగవద్గీత యొక్క సందేశం. భగవద్గీత సాంఘిక జీవితమును లేదా ఆధ్యాత్మిక జీవితమును పాడు చేయటానికి కాదు... లేదు ఇది ప్రామణికులచే ప్రమాణీకరించబడాలి. ఉత్తమ ప్రామణికం కృష్ణుడు.
బొంబాయి యొక్క స్త్రీలు పురుషులు ఈ కేంద్రాన్ని విజయవంతం చేస్తారు. మనకు చాల మంచి ప్రదేశం ఉంది. మనం నిర్మిస్తున్నాము, కావున మీరు ఇక్కడకు రండి, కనీసం వారంతంలో అయినా ఉండగలరు. మీరు నివసించినట్లయితే, పదవీవిరమణ చేసిన వారు లేదా వృద్ధులైన వ్యక్తులు, స్త్రీలు, వారు ఇక్కడకు వచ్చి ఉండగలరు. మనకు సరిపోయేంత ప్రదేశము ఉన్నది. కానీ ప్రపంచం నలుమూలల భగవద్గీత యొక్క ఈ సూత్రాలను నిర్వహించడానికి ప్రయత్నించండి. ఇది భారతదేశం యొక్క బహుమతి. భారతదేశంలో జన్మించిన ఎవరైనా, మానవునివలె, పిల్లులు కుక్కలుగా కాదు ... పిల్లులు కుక్కలు ఇతరులకు మంచి చేయుటలో భాగము కావలేవు.
ఆయన చెప్పారు,
- bhārata-bhūmite manuṣya-janma haila yāra
- janma sārthaka kari' kara para-upakāra
- (CC Adi 9.41)
భారతదేశంలో మానవుడిగా జన్మించిన వారెవరైనా, భరత-భూమి, మొదట మీ జీవితం విజయవంతం చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రమాణాన్ని కలిగి ఉన్నారు, జీవితం విజయవంతం చేయడం ఎలా, ఇక్కడ భగవద్గీత ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ జీవితాన్ని విజయవంతం చేసుకుని, ఆపై ప్రపంచవ్యాప్తంగా ఈ సందేశాన్ని ప్రచారం చేయండి. అది పరోపకారా. వాస్తవనికి, భారతదేశం, భారతదేశం యొక్క ప్రజలు, వారు పరోపకారం కోసం ఉద్దేశించబడ్డారు. ఇతరులను దోపిడీ చేయడానికి మనము ఉద్దేశించబడలేదు. ఇది మన లక్ష్యం కాదు. వాస్తవానికి అది జరుగుతోంది. ప్రతి ఒక్కరూ భారతదేశం నుండి బయటకు వెళ్తారు. వారు దోపిడీ చేయడానికి అక్కడకు వెళ్తారు. కానీ భారతదేశం బయటివారికి మొదటిసారిగా ఏదైనా ఇస్తుంది అంటే , అది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. మీరు రుజువు చూడగలరు . మనము ఇస్తున్నాము, మనము తీసుకోవడం లేదు. మనము యాచించుటకు వెళ్ళట్లేదు, నాకు గోధుమలు ఇవ్వండి, నాకు డబ్బు ఇవ్వండి, ఇదివ్వు, అదివ్వు." లేదు. మనము ఏదైనా వాస్తవమైనది ఇవ్వడం వలన, వారు నమస్కరిస్తున్నారు . లేకపోతే, ఎందుకు ఈ యువకులు అమ్మాయిలు, వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వెంట ఉన్నారు? వారు ఏదో అతీంద్రియమైనది పొందుతున్నారు, వారు ఏదో అనుభూతి చెందగలిగినది పొందుతున్నారు. ఇది శక్తిని కలిగి ఉంది, చాలా మంచి శక్తి. వారు అమెరికన్లు లేదా కెనడియన్లు లేదా ఆస్ట్రేలియన్ల వలె భావిస్తున్నారా లేదు. మనము భారతీయులుగా కూడా భావిస్తున్నామా లేదు. ఆధ్యాత్మిక స్థితిపై మనమంతా ఒకటే.
- vidyā-vinaya-sampanne
- brāhmaṇe gavi hastini
- śuni caiva śva-pāke ca
- paṇḍitāḥ sama-darśinaḥ
- (BG 5.18)
ఇది వాస్తవమైన అభ్యాసం. ఆత్మవత్ సర్వ-భూతేషు. గొప్ప రాజకీయ నాయకుడు అయిన , చాణక్య పండితుడు,
- mātṛvat para-dāreṣu
- para-dravyeṣu loṣṭravat
- ātmavat sarva-bhūteṣu
- yaḥ paśyati sa paṇḍitaḥ
అందువల్ల ఇది గొప్ప సంస్కృతి, భగవద్గీత యథాతథం. అందువల్ల భాధ్యతాయుతమైన స్త్రీలు పురుషులు ఇక్కడ ఉన్నారు, ఈ కేంద్రాన్ని చాలా విజయవంతం చేస్తారు, ఇక్కడకు రండి , భగవద్గీత యథాతథం అధ్యయనం చేయండి. ఇది ఏ మూర్ఖపు వివరణ లేకుండా ఉంటుంది. నేను మళ్ళీ మళ్ళీ మూర్ఖ అనే చెపుతాను ఎందుకంటే భగవద్గీతకు వ్యాఖ్యానం అవసరం లేదు. ప్రతిదీ ప్రారంభం నుండి, స్పష్టంగా ఉంది.
- dharma-kṣetre kuru-kṣetre
- samavetā yuyutsavaḥ
- māmakāḥ pāṇḍavāś caiva
- kim akurvata sañjaya
- (BG 1.1)
చాలా స్పష్టంగా ఉంది.