TE/Prabhupada 0416 - కేవలం జపము చేయడం నృత్యం చేయడం మరియుతియ్యని గులాబ్ జామును, కచోరి తినడం



Lecture & Initiation -- Seattle, October 20, 1968


ఈ ఉద్యమం యొక్క అవసరం చాలా పెద్దగా ఉంది. మనము ఈ కృష్ణచైతన్య ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తున్నాము. ఇది చాలా ఆచరణాత్మకమైనది, చాలా సులభము, కేవలం ఈ యుగానికి అనుకూలమైనది. మీరు ఎంత అర్హత గల వారు అనేది అది పరిగణించదు. ఇది పరిగణించదు. మీ గత జీవితం ఏమైనప్పటికీ, మీరు కేవలం ఇక్కడికి రండి, మీ నాలుకతో హరేకృష్ణ జపించండి. భగవంతుడు నీకు నాలుక ఇచ్చాడు - కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించండి, ప్రేమపూర్వక విందు మరియు మీ జీవితాన్ని విజయ వంతం చేసుకోండి. చాలా సులభమైన పద్దతి. ఇది మన కార్యక్రమం. ఈ ఉద్యమంలో పాల్గొనటానికి ప్రతి ఒక్కరినీ ఆహ్వానించండి మరియు మీరు ప్రయోజనాన్ని పొందండి. మీరు ఆచరణాత్మకంగా చూస్తారు ప్రత్యక్షావగమ ధర్మ్యం. భగవద్గీతలో ఈ ఆత్మ సాక్షాత్కార పద్ధతి ప్రత్యక్షంగా గ్రహించబడునని చెప్పబడింది. ప్రత్యక్షంగా గ్రహించబడునని చెప్పబడింది. ప్రత్యక్షావగమ ధర్మ్యం ఇది ఎలా అంటే మీరు ఎప్పుడైతే భోజనం చేస్తారో, అప్పుడు మీరు మీ కడుపు నిండింది అని అర్థం చేసుకుంటారు. మీ ఆకలి తృప్తి చెందిందని మీరు అర్థం చేసుకుంటారు. మీరు బలము పొందుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. మీరేమీ ధ్రువీకరణ పత్రం తీసుకోవలసిన ఆవసరము లేదు. ఇది చాలా మంచి విషయం అని మీరంతట మీరే అర్థం చేసుకుంటారు. ప్రత్యక్షావగమము. ప్రత్యక్ష అంటే నేరుగా , మీరు దానిని నేరుగా అర్థం చేసుకుంటారు. మీరు ధ్యానం చేస్తే, అలాంటి ధ్యానం వల్ల మీరు ఎంత వరకు అభివృద్ధి చెందుతున్నారో మీకు తెలియదు. ఇలా చూడండి, మీరు విస్మృతిలో ఉన్నారు. మీకు తెలియడం లేదు. కానీ ఇక్కడ మీరు హరేకృష్ణ జపించినట్లయితే మీరు నేరుగా అనుభూతి చెందుతారు. నేరుగా అనుభూతి చెందుతారు. నేను చాలా మంది విద్యార్థులను (శిష్యులను) కలిగి ఉన్నాను, చాలా ఉత్తరాలను రాస్తున్నారు. వారు నేరుగా ఎలా అనుభూతి చెందుతున్నాము అనేది. ఇది చాలా బాగుంది. Pratyakṣāvagamaṁ dharmyaṁ su-sukhaṁ kartum avyayam ( BG 9.2) ఆచరించడానికి చాల బాగుంటుంది కీర్తన నృత్యము మరియు ప్రసాదం ఇంతకంటే మరింత ఏం కోరుకుంటున్నారు? (నవ్వు) కేవలం జపము చేయడం నృత్యం చేయడం మరియు తియ్యని గులాబ్ జామును, కచోరి తినడం. ఇది సు సుఖం మరియు కర్తుమవ్యయమ్ ఈ పద్ధతిని పాటించేటప్పుడు ఇది చాలా ఆహ్లాదకరమైనది మరియు అవ్యయము. అవ్యయము అంటే మీరేం చేస్తున్నారో, మీరు ఈ ఉద్యమంలో ఒక శాతం అమలు చేసినను అది మీ యొక్క శాశ్వత సంపద. శాశ్వత సంపద. మీరు ఎంత చేయగలిగితే అంత రెండు శాతం, మూడు శాతం, నాలుగు శాతం.... కానీ తర్వాత జీవితం కోసం వేచి ఉండవద్దు. వందకు వంద శాతం పూర్తి చేయాలి. ఇది అమలు చేయడం చాలా సులభం కాదు. అందువలన పూర్తిచేయండి వేచి వుండకండి, “ ఈ జీవితంలోనే ఒక నిర్దిష్ట శాతాన్ని ఆత్మ సాక్షాత్కారం కోసం పూర్తి చేద్దాం.” తదుపరి జీవితంలో నేను చేస్తాను సాక్షాత్కారమునకు ఏమిటి పరీక్ష , పూర్తి శాతంలో పరిపూర్ణత్వాన్ని పొందడమా ? ఈ పరీక్ష ఏంటంటే నువ్వు ఎంతగా భగవంతుడైన కృష్ణుడుని ప్రేమించటం నేర్చుకున్నావు, అంతే. మీరు మీ ప్రేమను పొందారు, మీరు ఎవరినైనా ప్రేమిస్తారు, కాని నీ ప్రేమను విభజిస్తే, నేను నా దేశాన్ని , నా సమాజాన్ని, నా ప్రియురాలిని, దానిని, దీనిని లేదా ప్రియుడిని ప్రేమిస్తున్నాను. మరియు నేను కృష్ణుని కూడా ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను,” లేదు. అది కూడా బాగుంది. కానీ మీరు మీ ప్రాధాన్యతను ఇస్తే, కేవలం కృష్ణుని ప్రేమించడానికి, అన్ని ప్రాధాన్యతలు ఇస్తే , మీరు ఇతర విషయాలను సహజంగానే ప్రేమిస్తారు మరియు మీ జీవితము పరిపూర్ణంగా ఉంటుంది. ఇతర ప్రేమ వ్యవహారాలు తీసివేయడం కాదు. కృష్ణ చైతన్యం కల వ్యక్తి వలె, అతను తన కుటుంబం సమాజాన్ని మాత్రమే ప్రేమించడం లేదు. అతను జంతువులను ప్రేమిస్తాడు, అతను ఒక చీమను కూడా ప్రేమిస్తున్నాడు, అతని ప్రేమ చాలా విస్తరించింది. ఇది చాలా మంచి విషయము ఎంతమందిని మీరు ప్రేమించగలరు. ఏదైనా కొంత అపార్థం చోటుచేసుకుంటే, ఆ ప్రేమ విరిగిపోతుంది. కానీ కృష్ణుడి ప్రేమ ఎప్పటికీ దూరమవదు మరియు మీ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడుతుంది. ఇది చాలా మంచి విషయం మీరు ప్రేమను పొందుతారు. మీరు చాలా విషయాలపై మీ ప్రేమను తప్పుగా ఉంచారు. మీరు దాన్ని తిరిగి కృష్ణుని వైపు మరల్చుకోవాలి , అప్పుడు మీరు కృష్ణుని పూర్తిగా ప్రేమిస్తారు. మీరు మీ దేశాన్ని సమాజాన్ని మీ స్నేహితులని మీరు ఇంతకుముందు ఇష్టపడే దానికంటే ఎక్కువ ఇష్టపడుతున్నారని తెలుసుకుంటారు. ఇది చాలా మంచి విషయము