TE/Prabhupada 0422 - మహా మంత్రం జపించేటప్పుడు నివారించవలసిన పది అపరాధములు(ఆరు నుండి పది వరకు)



Lecture & Initiation -- Seattle, October 20, 1968


ప్రభుపాద: తరువాత?

మధుద్విస: "ఆరవ అపరాధము: జపము, కీర్తన బలము మీద పాపము చేయడము."

ప్రభుపాద: అవును. ఇప్పుడు ఈ దీక్ష, ఈ రోజు నుండి మీ ఖాతా, గత జీవితము యొక్క, అన్ని పాపములు, ఇప్పుడు, సర్దుబాటు చేయబడినవి. ముగించబడినవి. అవి సమాప్తము అయినవి. ఇప్పుడు, హరే కృష్ణని కీర్తన చేయడము ద్వారా మీరు మీ పాపములను ముగించవచ్చు అంటే మీరు తిరిగి చేస్తారని అర్థం కాదు: "ఓ, నేను పాపములును చేస్తాను మరియు నేను కీర్తన చేస్తాను. ఇది సర్దుబాటు చేయబడుతుంది. ఆ బ్యాలెన్స్ సున్నా అవుతుంది లేదు. " అలా కాదు. ఆ పని చేయవద్దు ఏదైతే చేయబడినదో అది చేయబడినది. ఇంక వద్దు. ఇప్పుడు పవిత్రమైన జీవితము ఉండాలి. అక్రమ లైంగిక జీవితం, ఏ మత్తు, ఏ జూదం, మాంసం తినడం ఉండకూడదు. ఇప్పుడు ముగిసింది. అంతే కానీ", హరే కృష్ణ కీర్తన నేను చేస్తున్నాను నేను హోటల్ కు వెళ్లి కొంత మాంసం తీసుకుంటాను. ". లేదు అది ఒక గొప్ప పాపం. అలా చేయవద్దు. అప్పుడు హరే కృష్ణ జపము ఫలితము ఇవ్వదు మీరు అపరాధము చేసినట్లయితే, తరువాత?

మధుద్విస: "ఏడవ అపరాధము విశ్వాసము లేని వారికి భగవంతుని యొక్క నామమును ఉపదేశము చేయడము."

ప్రభుపాద: అవును. విశ్వాసము లేని వారికి, భగవంతుడు మరియు ఆయన నామము స్వతంత్రమైనవి అని చెప్పకూడదు. ఉదాహరణకు ఈ భౌతిక ప్రపంచంలో, నామము మరియు వ్యక్తి భిన్నంగా ఉంటారు. ఉదాహరణకు మీ నామము మిస్టర్ జాన్ అని అనుకుందాం. కాబట్టి నేను "జాన్, జాన్, జాన్," అయితే జాన్ వంద మైళ్ల దూరంలో ఉండవచ్చు. ప్రతిస్పందన ఉండదు. కానీ భగవంతుని పేరు, భగవంతుని పవిత్ర పేరు, భగవంతుడు ప్రతిచోటా ఉన్నారు. ఉదాహరణకు టెలివిజన్ వలె. టెలివిజన్ ఉంది, నేను చెప్పేది ఏమిటంటే, ఎక్కడ నుండో ప్రసారము చేయబడుతుంది. మీరు ఆ యంత్రాన్ని కలిగి ఉంటే, వెంటనే మీ గదిలో చిత్రం ఉంటుంది. అయితే, అది భౌతికముగా సాధ్యమైతే ఆధ్యాత్మికం, కృష్ణుడి నామములో ఎంత అవకాశము ఉంటుంది? మీరు కృష్ణుడి పేరును కీర్తన చేసిన తక్షణమే, అంటే మీ నాలుక మీద కృష్ణుడు వెంటనే ఉంటాడు. కాబట్టి అది ఏమిటి?

మధుద్విస: ఏడు? పవిత్ర నామాన్ని విశ్వాసము లేని వారికి నేర్పించడము.

ప్రభుపాద: కాబట్టి,విశ్వాసము లేనివారు ఎవరైనా, భగవంతుని యొక్క పేరు మరియు భగవంతుడు స్వయంగా ఒకరే, తేడా లేదు వారికి భగవంతుని యొక్క మహిమల గురించి సూచనలు ఇవ్వకూడదు. ఆయనకు అర్థం చేసుకోవడానికి ఉపదేశము చేయాలి, కానీ ఆయన అర్థం చేసుకోలేకపోతే, అప్పుడు ఆయనకు దీక్ష ఇవ్వకూడదు, లేదా ఆయన అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం. కానీ మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ: ( CC Madhya 17.133) కృష్ణుడు మరియు కృష్ణుడి నామము వేరు కాదు. హరే కృష్ణ కీర్తన మీరు చేసిన వెంటనే, అంటే మీ నాలుకపై కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు. మీరు ఆ విధముగా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు కృష్ణుడు... మీరు మీ ఆధ్యాత్మిక గురువుకు ఎంత మర్యాద ఇస్తారో ఆయన మీ సమక్షములో ఉన్నప్పుడు, కాబట్టి కృష్ణుడు మీ నాలుక మీద ఉంటే, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కావున కృష్ణుడు అక్కడ ఉన్నాడని మీరు ఎల్లప్పుడూ తెలుసుకోవాలి. కృష్ణుడు ఎల్లప్పుడూ ప్రతిచోటా ఉంటాడు. భగవంతుడు అన్నిచోట్లా ఉంటాడు, కానీ మనకు అవగాహన లేదు. కానీ ఈ నిర్దిష్టమైన కీర్తన,పవిత్ర నామమును కీర్తన చేసిన వెంటనే, అంటే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కృష్ణుడితో సాంగత్యము చేయడము ద్వారా మీరు పవిత్రము అవుతారు. Śṛṇvatāṁ sva-kathāḥ. ఉదాహరణకు అగ్నితో సాంగత్యము వలన మీరు వెచ్చగా మారుతారు, అదేవిధముగా, కృష్ణుడితో సాంగత్యము వలన మీరు పవిత్రము చేయబడతారు. క్రమంగా మీరు ఆధ్యాత్మికము అవుతారు. ఇంక ఏ మాత్రము భౌతిక విషయము లేదు. పూర్తయ్యింది. ఇది పద్ధతి. తరువాత?

మధుద్విస: "ఎనిమిదవ అపరాధము: పవిత్ర నామమును భౌతిక భక్తితో పోల్చడం."

ప్రభుపాద: అవును. ఇప్పుడు ఈ వేడుక జరుగుతోంది. మనం ఏదో, మతపరమైన ఆచారము చేస్తున్నట్లు తీసుకోకూడదు. కాదు మతపరమైన ఆచారం విభిన్నమైన విషయం. ఇది... ఇది ఆచారములు లాగా కనిపిస్తుంటుంది, అయితే ఇది ఆధ్యాత్మికము. ఇది అన్ని రకాల ధర్మము పైన ఉంది. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు. ఈ పద్ధతి భగవంతుని ప్రేమను ఎలా పెంపొందించుకోవడము. ఇది అన్నింటికంటే ఉన్నతము... ధర్మము అంటే, సాధారణంగా, ఒక రకమైన విశ్వాసము. కానీ అది విశ్వాసము యొక్క ప్రశ్న కాదు. ఇది వాస్తవమునకు పెంపొందించుకోవడము, మీరు కృష్ణుడు లేదా భగవంతుని ఎంతగా ప్రేమిస్తున్నారో. కాబట్టి అది అన్ని ధర్మముల కంటే ఉన్నతమైనది. ఇది సాధారణ ధర్మము కాదు. ధర్మము అంటే అర్థం... ఉదాహరణకు మీరు క్రిస్టియన్ అని అనుకుందాం, నేను హిందూ. ఈ శరీరం పూర్తి అయిన వెంటనే, నా క్రైస్తవ ధర్మము లేదా ధర్మము, ప్రతిదీ పూర్తయింది. కానీ ఈ భగవంతుని మీద ప్రేమ పూర్తి కాదు. ఇది మీతో పాటు వస్తుంది. మీరు వెళ్ళే ఏ జన్మలో అయినా అది అభివృద్ధి చెందుతుంది. మీరు పూర్తి చేయగలిగితే, అప్పుడు మీరు నేరుగా కృష్ణుడి దగ్గరకు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్లుతారు, మరియు మీ అన్ని భౌతిక సంబంధములను పూర్తి చేసుకుంటారు. మీరు చేయలేకపోయినా, అది మీతో పాటు వస్తుంది. ఆస్తి. ఇది... బ్యాంకు బ్యాలన్స్ తగ్గించబడదు. ఇది పెరుగుతుంది. తరువాత?

మధుద్విస: "తొమ్మిదివ అపరాధము: పవిత్ర నామాన్ని ధ్వనించేటప్పుడు అశ్రద్ధగా వినడము."

ప్రభుపాద: అవును. మీరు జపము చేస్తున్నప్పుడు మీరు వినాలి కూడా. ఇది ధ్యానం. హరే కృష్ణ, ఈ రెండు పదాలు, హరే కృష్ణ, మీరు కూడా వింటారు. మీరు వింటే, అప్పుడు మీ మనస్సు మీ నాలుక రెండు ఆకర్షించడతాయి. ఇది ఖచ్చితమైన ధ్యానం, మొదటి తరగతి యోగా, శ్రవణము మరియు కీర్తన, జపము చేయడము. తరువాత?

మధుద్విస: తరువాత చివరగా పదవ అపరాధము: "జపము సాధన చేయుటలో ఉన్నప్పుడు భౌతిక విషయముల పట్ల ఆసక్తి కలిగి ఉండటము."

ప్రభుపాద: అవును. మొత్తము పద్ధతి మనము మన ప్రేమను పదార్థము మీద నుండి భగవంతునికి బదిలీ చేయబోతున్నాం. కాబట్టి మనం కనిష్టీకరించడానికి ప్రయత్నించాలి. ఇది సహజముగా అవుతుంది. Bhaktiḥ pareśānubhavo viraktir anyatra syāt ( SB 11.2.42) మీరు వాస్తవమునకు భగవంతుని మీద ప్రేమను అభివృద్ధి చేసుకుంటే, అప్పుడు సహజంగా మీరు ఈ భౌతిక అంశాలన్నింటినీ ప్రేమించడం మర్చిపోతారు. అది వరుస క్రమము. కానీ మీరు కూడా ప్రయత్నించాలి. మీరు తప్పక... ఇది జరుగుతుంది. ఉదాహరణకు మనము తింటే, అప్పుడు మీరు తినడం గురించి ఆలోచించడము తగ్గిస్తారు. మీరు పూర్తిగా ఆహారము తీసుకుంటే, "నాకు ఇంక ఏమి అవసరము లేదు, అవును, నేను..." అదేవిధముగా,కృష్ణ చైతన్యము చాలా బాగుంటుంది, కృష్ణ చైతన్యము యొక్క పురోగతితో మీరు భౌతిక ఆనందము అని పిలవబడే అర్థంలేని దానిని మర్చిపోతారు. మీరు పరిపూర్ణమైన దశలో ఉన్నప్పుడు, ఓ, మీరు ఈ భౌతిక చెత్తను పట్టించుకోరు. ఇది పరీక్ష. మీరు చెప్పలేరు, నేను ధ్యానంలో పురోభివృద్ధి చెందుతున్నాను, కానీ నా భౌతిక ఆసక్తి అన్ని ఇంద్రియ తృప్తి విషయాలలో అదే. ఇది పురోగతి కాదు. పురోగతి అంటే అర్థం మీరు ఇంద్రియ తృప్తిని మీ భౌతిక ఆసక్తిని తగ్గించు కుంటారు. ఇది పురోగతి. ఇప్పుడు మీరు కీర్తన చేయవచ్చు... ఆహ్, మీరు కలిగి ఉన్నారు...హరే కృష్ణ జపము కీర్తన చేయండి