TE/Prabhupada 0424 - మీరు ఈ వేదముల సంస్కృతి యొక్క పూర్తి ప్రయోజనం పొందండి



Lecture on SB 1.1.1 -- New York, July 6, 1972


సంస్కృత భాష చాలా ముఖ్యమైనది. ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది ముఖ్యంగా జర్మనీలో వారికి సంస్కృతం అంటే ఎంతో ఇష్టం చాలా మంది జర్మన్ పండితులు గంటలకొద్దీ సంస్కృత భాషలో మాట్లాడగలరు వారు సంస్కృతంలో చాలా శ్రద్ధ కలిగిన విద్యార్థులు. నా గురు సోదరుడు ఒకరు ఆయన ఇప్పుడు స్వీడన్ లో ఉన్నారు ఆయన మాట్లాడటానికి సంస్కృతాన్ని ఉపయోగిస్తారు ఒక భారతీయ విద్యార్థి లండన్ నుండి మన దేశానికి వచ్చినప్పుడు బ్రిటిష్ వారి రోజుల్లో భారతీయులు లండన్ కు వెళ్లే వారు అక్కడ అతను డిగ్రీ పూర్తి చేసే వాడు అతడు ఒక గొప్ప మనిషి అయ్యేవాడు .అది అప్పటి పద్ధతి. ఇంటికీ తిరిగి వచ్చేటప్పుడు, వారు సహజంగానే ఇతర యూరోపియన్ దేశాలను సందర్శించి వచ్చేవారు. జర్మనీలో వారు భారతీయ విద్యార్థికి తమ సొంత సంస్కృతి ఎంత వరకు తెలుసునని పరీక్షించేవారు నా గురు సోదరుని పేరు Ernst. Schulze ఇప్పుడు ఆయన పేరు సదానంద స్వామి. అందువల్ల అతడు చెప్పాడు భారతీయ విద్యార్థికి తమ సంస్కృతి గురించి ఏమీ తెలియదంటే వెంటనే అతనిని తిరస్కరించేవాడు. అది నిష్ప్రయోజనం.

ముఖ్యంగా భారతీయులు ఈ సమావేశంలో ఉంటే మీరు మీ దేశాన్ని ప్రశంసించాలని కోరుకుంటే మీరు ఈ వేద సాహిత్యాన్ని ప్రచారము చేయండి . ఇక సాంకేతిక పరిజ్ఞానం అని పిలువ బడే దాని ద్వారా పాశ్చాత్య దేశాలను మీరు అధిగమించలేరు. వారు చాలా అధునాతనంగా ఉన్నారు. అందుచే అది సాధ్యం కాదు . వంద సంవత్సరములు ముందుకు వెళ్ళినాయి మీరు ఏ యంత్రమైనా కనుగొనవచ్చును. ఆ యంత్రమును పశ్చిమ దేశాలలో వంద సంవత్సరముల క్రితమే కనుగొనబడింది. కావున మీరు చేయలేరు. ఏదైనా మీరు భారతీయులు మీ దేశాన్ని కీర్తించాలని కోరుకుంటే నేను ప్రయత్నిస్తున్నట్టుగా ఈ వేదముల సంస్కృతి హృదయపూర్వకముగా ఆత్మసాక్షిగా ప్రచారము చేయండి ప్రజలు దాన్ని ఎలా అంగీకరిస్తున్నారు? దానిలో విషయం ఉంది . నాకు పూర్వం చాలా స్వాములు ఈ దేశం వచ్చారు వారు వాస్తవమైన విషయమును చెప్పలేకపోయారు వారు కొంత డబ్బు కోరుకున్నారు. వెళ్లిపోయారు. అంతే. మా కృష్ణచైతన్య ఉద్యమం అది కాదు. నా ఉద్దేశ్యం పాశ్చాత్య దేశాలకు ఇవ్వాలని అనుకుంటున్నాము. మనం అర్థించడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చాము. ఇది నా లక్ష్యం . వారు అర్థించడానికి వస్తున్నారు నాకు బియ్యం ఇవ్వండి, నాకు పప్పులు ఇవ్వండి, నాకు గోధుమలు ఇవ్వండి ,నాకు డబ్బు ఇవ్వండి . కానీ నేను భారతీయ సంస్కృతి ఇవ్వడానికి ఇక్కడకు వచ్చాను అది తేడా.

కావున మీరు ఐరోపా ,అమెరికా విద్యార్థులారా మీరు ఈ వేదముల సంస్కృతి యొక్క పూర్తి ప్రయోజనం పొందండి . అందుకే నేను ఈ శరీరాన్ని విడిచి పెట్టే ముందు చాలా కష్టపడుతున్నాను. నా మరణం తరువాత మీరు ఆనందించగలిగే కొన్ని పుస్తకాలను ఇవ్వాలని అనుకుంటున్నాను. కావున ఉపయోగించండి, అది ఉపయోగించండి ప్రతి శ్లోకం చక్కగా చదవండి. తాత్పర్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి . మీలో మీరు చర్చించుకోండి. నిత్యం భాగవత సేవయా. ఇది మన లక్ష్యం. Nasta prayesv abhadresu nityam bhagavatha sevaya ( SB 1.2.18) అభద్రత, మన హృదయములో చాలా మురికి విషయములు ఉన్నాయి ఈ మురికి విషయములు కేవలం కృష్ణచైతన్యము ద్వారా పవిత్రం చేయబడును. ఏ ఇతర పద్ధతి లేదు.

śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇa
puṇya-śravaṇa-kīrtanaḥ
hṛdy antaḥ stho hy abhadrāṇi
vidhunoti suhṛt satām
(SB 1.2.17)
naṣṭa-prāyeṣv abhadreṣu
nityaṁ bhāgavata-sevayā
bhagavaty uttama-śloke
bhaktir bhavati naiṣṭhikī
(SB 1.2.18)

ఇది పద్ధతి. Srnvatam sva-kathah krishna, కృష్ణుడు మీ హృదయంలో ఉన్నారు కృష్ణుడు మీ లోపల నుండి మరియు బయట నుండి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బయటనుండి, ఆలయంలో తన రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు అతన్ని సేవించే అదృష్టాన్ని పొందవచ్చు. కృష్ణుడు తన గురించి మనతో మాట్లాడటానికి తన ప్రతినిధి అంటే గురువును పంపిస్తున్నారు . అతడు లోపల నుండి పరమాత్మ రూపంలో మీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు . కృష్ణుడు చాలా దయతో ఉంటాడు. అతనికి కావాలి మీరు ఈ భౌతిక జీవితంలో బాధపడుతున్నారని కృష్ణుడు తానే వస్తాడు . అతడు ప్రచారము చేస్తాడు,Sarva- dharman parityajya mam ekam saranam vraja ( BG 18.66) అందువల్ల భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా హృదయమును పవిత్రము చేయుటకు, Ceto- darpana-marjanam( CC Antya 20.12). ఇది పద్ధతి . మనం కృష్ణుడి లోని భాగము మరియు అంశ. అందువలన మనం శుద్ధంగా ఉన్నాము. కానీ భౌతిక సంపర్కము వలన ఆశుద్ధముగా అయ్యాము. పద్ధతి కృష్ణుని గురించి వినాలి అంతే