TE/Prabhupada 0437 - శంఖము అత్యంత పవిత్రమైనదిగా,దివ్య మైనదిగా భావించబడుతోంది
Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968
ఒక వ్యక్తి వేదముల నుండి తన వాదనను ప్రతిపాదించినట్లయితే, అతని వాదన చాలా దృఢంగా ఉంటుంది. శబ్ద ప్రమాణం. ప్రమాణం అంటే ఋజువు. ఋజువు... మీరు మీ వాజ్యములో గెలవాలనుకుంటే ... మీరు న్యాయస్థానములో చాలా చక్కని ఋజువును చూపించాలి, అదేవిధంగా, వైధిక సంస్కృతి ప్రకారం,ఋజువే ప్రమాణం. ప్రమాణం అంటే ఋజువు. శబ్ద ప్రమాణం. వేద సంస్కృతిలో జ్ఞానవంతులైన విద్వాంసులు అంగీకరించిన మూడు రకాల ఋజువులు ఉన్నాయి. ఒక ఋజువు ప్రత్యక్ష. ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష అవగాహన. ఏవిధంగా అంటే.నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. నేను ప్రస్తుతం ఉన్నాను, మీరు ఉన్నారు. ఇది ప్రత్యక్ష అవగహన. ఇంకొక ఋజువును అనుమానం అని పిలుస్తారు. ఈ గదినే తీసుకుంటే, నేను ఇప్పుడే ఇక్కడకు వస్తున్నాను, ఈ గదిలో ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ శబ్ధం వచ్చింది, కాబట్టి నేను ఊహించగలను, "ఇక్కడ ఎవరో ఉన్నారు"అని. దీనిని అనుమానం అంటారు. తర్కంలో దీనిని పరికల్పన అంటారు. అది కూడా ఒక ఋజువు. ఒకవేళ నేను ప్రామాణిక సూచనల ద్వారా రుజువు చూపించగలిగితే, అది కూడా అంగీకరించబడుతుంది. ప్రత్యక్ష ఋజువు ,అని పిలవబడే, పరికల్పన లేదా సూచన ఆధారాలు. కానీ బలమైన ఋజువు శబ్ద ప్రమాణము. శభ్ధ, శభ్ధ బ్రహ్మము. అంటే వేదాలు. ఒకవేళ ఎవరైనా వేదాల ఉల్లేఖన నుండి ఒక సాక్ష్యం ఇవ్వగలిగినట్లయితే, దానిని అంగీకరించాలి. వేద సాక్ష్యాలను ఎవరూ తిరస్కరించలేరు. అది పద్ధతి. ఎందుకు అలాగ? చైతన్య మహాప్రభు మంచి ఉదాహరణను ఇచ్చారు. అది వేదాలలో ఉంది. ఏ విధముగా ఐతే మనము పూజగదిలో శంఖాన్ని ఉంచుతామో, శంఖమును చాలా పవిత్రమైనగా, దివ్యమైనదిగా భావిస్తాము, లేకపోతే మనము భగవంతుని ముందు ఎలా దానిని ఉంచుతాము, మరియు మీరు శంఖాన్ని ఎందుకు పూరిస్తారు? మీరు శంఖము తో భగవంతునికి నీటిని అర్పిస్తారు. మీరు ఎలా అర్పించగలరు? కానీ ఈ శంఖము ఏమిటి? శంఖము ఒక జంతువు యొక్క ఎముక. అది కేవలం జంతువు యొక్క ఎముక మాత్రమే. కానీ వేదముల ఉత్తర్వు ఏమిటంటే మీరు జంతువు యొక్క ఎముకను తాకినట్లయితే, మీరు వెంటనే స్నానం ఆచరించాలి. మీరు అపవిత్రం అవుతారు. అయితే ఎవరైనా చెప్పవచ్చు, " ఇది విరుద్ధం. ఒక దగ్గర మీరు ఒక జంతువు యొక్క ఎముకను తాకినట్లయితే, అప్పుడు మీరు వెంటనే స్నానం ఆచరించడం ద్వారా మిమ్మల్ని మీరు పవిత్రము చేసుకోవాలి, మరియు,ఇక్కడ, ఒక జంతువు యొక్క ఎముక దేవతల గదిలో ఉంటుంది. కాబట్టి ఇది విరుద్ధం, అంతేకదా? ఒక జంతువు యొక్క ఎముక అపవిత్రమైనదైతే , దేవతల గదిలో మీరు దానిని ఎలా ఉంచగలరు? జంతువు యొక్క ఎముక పవిత్రమైనది అయితే, అపవిత్రంగా మారడం స్నానం ఆచరించడం లో అర్థం ఏమిటి? " మీరు వేదముల ఉత్తర్వులలో ఇలాంటి వైరుధ్యాలను కనుగొంటారు. కానీ జంతువుల ఎముక మలినమనే విషయం వేదములలో చెప్పినందున, మీరు అంగీకరించాలి. కానీ జంతువు యొక్క ఈ ఎముక,శంఖము, పవిత్రమైనది. కొన్నిసార్లు ఉల్లిపాయను తీసుకోకూడదని మేము చెప్పినప్పుడు మన విద్యార్థులు కలవరపడతారు. కానీ ఉల్లిపాయ శాకాహారము. కాబట్టి శబ్ద ప్రమాణం అంటే, వేదముల ఋజువును ఏలాంటి వాదన లేకుండా స్వీకరించాలి. అర్ధం ఉంది; ఏ వైరుధ్యం లేదు. అర్ధం ఉంది. ఏ విధంగా అంటే నేను మీకు చాలా సార్లు చెప్పినట్టు ఆవుపేడ. ఆవు పేడ, వేదముల ఉత్తర్వు ప్రకారం, పవిత్రమైనది. భారతదేశంలో వాస్తవానికి అది క్రిమినాశకరంగా ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా గ్రామాలలో, గొప్ప మొత్తంలో ఆవు పేడ ఉంటుంది,మరియు వారు, ఇంటిని క్రిమినాశకరం చేయడానికి ఇల్లంతా ఆవుపేడతో అలుకుతారు. వాస్తవానికి మీ గదిని ఆవు పేడతో అలికిన తర్వాత, అది ఎండినపోయిన తర్వాత, మీరు ఉత్తేజాన్ని పొందుతారు, ప్రతిదీ క్రిమినాశకాన్ని చూడండి. ఇది ఆచరణాత్మక అనుభవం. ఒక డాక్టర్ ఘోష్, ఒక గొప్ప రసాయన శాస్త్రవేత్త, అతను ఆవు పేడను పరీక్షించాడు, వేద సాహిత్యంలో ఆవు పేడ ఎందుకు చాలా ప్రశస్తమైనది?అని పరిశోధన చేసాడు. ఆవు పేడ అన్ని క్రిమినాశక లక్షణలూ కలిగి ఉందని అతను తెలుసుకున్నారు.