TE/Prabhupada 0446 - నారాయణుడి నుండి లక్ష్మిని వేరు చేయటానికి ప్రయత్నించవద్దు



Lecture -- Seattle, October 2, 1968


కాబట్టి sakṣat śrī. ఆమె ఎల్లప్పుడూ సాంగత్యము కలిగి ఉంది. ఆమెను ఎవరైనా నారాయణుడి నుండి వేరుపర్చడానికి ప్రయత్నిస్తే, అప్పుడు అతడు పతనమవ్వుతాడు. ఉదాహరణ రావణుడు. రాముడి నుండి లక్ష్మిని వేరుచేయాలని రావణుడు కోరుకున్నాడు. ఈ ప్రయత్నం చాలా ప్రమాదకరమైనది, రావణుడు, సంతోషంగా మారడానికి బదులుగా ... ఆయన సంతోషముగా,భౌతికముగా సంపన్నంగా పిలువబడే విధముగా ఉన్నాడు. కాని ఆయన నారాయణుడి నుండి లక్ష్మిని వేరు చేసిన వెంటనే, ఆయన తన స్నేహితులతో కలసి పతనమయ్యాడు. కాబట్టి నారాయణుడి నుండి లక్ష్మిని వేరు చేయటానికి ప్రయత్నించవద్దు. ఆమెను వేరు చేయలేరు. కానీ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే, అతడు నాశనం అవ్వుతాడు. అతడు నాశనం అవ్వుతాడు. ఉదాహరణకు రావణుడు. కాబట్టి ప్రస్తుతానికి ప్రజలు శ్రీ", డబ్బు అంటే చాలా ఇష్టపడుతున్నారు. Śrī-aiśvaryā. Śrī-aiśvaryā. Śrī-aiśvaryā prajepsavaḥ. సాధారణ ప్రజలు, వారికి శ్రీ", డబ్బు, లేదా అందం, అందమైన మహిళను కోరుకుంటున్నారు. Śrī-aiśvaryā: డబ్బు, సంపదలు. Śrī aiśvaryā prajepsavaḥ. ప్రజా. ప్రజా అంటే కుటుంబం, సమాజం, డబ్బు. వారు కోరుతున్నారు. డబ్బు కోసముఎల్లప్పుడూ అశపడుతున్నారు, వెతుకుతున్నారు. కాని డబ్బును ఒంటరిగా ఉంచవద్దు. అప్పుడు మీరు నాశనం చేయబడతారు. ఇది ఉపదేశము. మీరు శ్రీ ని ఒంటరిగా ఉంచడానికి ప్రయత్నించవద్దు ఎల్లప్పుడూ నారాయణుడితో ఉంచoడి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. నారాయణుడిని ఉంచుకోండి. ఐశ్వర్యవంతులు, ధనవంతులు, ధనము కలిగిన వారు, వారు నారాయణుడిని కూడా పూజించాలి తమ డబ్బుతో . డబ్బులు ఖర్చుచేయoడి. డబ్బు నారాయణుడి సేవ కోసం ఉద్దేశించబడింది. మీరు డబ్బు సంపాదించినట్లయితే, రావణుడి లాగా నాశనము చేయవద్దు, కాని దానిని కృష్ణుడి సేవలో ఉపయోగించండి. మీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే, చాలా ఖరీదైన ఆలయం కోసం దానిని ఖర్చు పెట్టండి, లక్ష్మీ-నారాయణ, రాధా-కృష్ణ, సీతా-రామ వలె , వారిని ప్రతిష్టించండి. మీ డబ్బును ఇతర మార్గాల్లో పాడుచేయవద్దు. అప్పుడు మీరు ఎల్లప్పుడూ ధనవంతులుగా ఉంటారు. మీరు ఎన్నడూ పేదవారిగా ఉండరు. కాని మీరు నారాయణుడిని మోసగించడానికి ప్రయత్నించిన వెంటనే, "నేను మీ లక్ష్మిని తీసుకున్నాను", మీరు ఆకలితో ఉండoడి. ఆ విధానం చాలా చెడ్డది.

ఏమైనప్పటికి, ఎక్కడైతే శ్రీ ఉంటుoదో, అక్కడ నారాయణుడు ఉంటాడు, ఎక్కడైతే నారాయణుడు ఉoటాడో, అక్కడ శ్రీ ఉంటుoది. అందువలన నారాయణుడు మరియు శ్రీ. నరసింహ స్వామి నారాయణుడు, మరియు లక్ష్మి, వారు నిరంతరం ఉంటారు ... అందువలన దేవతలు, వారు చూసినపుడు నారాయణుడు, నరసింహ-స్వామి, చాలా కోపంగా ఉన్నారు. ఎవరూ ఆయనని శాంత పరచ లేక పోయారు అందువల్ల వారు అనుకున్నారు "లక్ష్మీజీ వ్యక్తిగత సహచారి, నిరంతరం నారాయణుడితో ఉంటుంది, కాబట్టి ఆమె వెళ్లి, శాంతి పరచాలి. "ఇక్కడ చెప్పబడింది. Sākṣāt śrīḥ preṣitā devair. దేవతలు, భగవంతుడు బ్రహ్మ, భగవంతుడు శివుడు మరియు ఇతరులు, వారు అభ్యర్థించినారు, అమ్మా , మీరు మీ భర్తను శాంతింపచేయడానికి ప్రయత్నిoచండి. ఇది మాకు సాధ్యం కావడము లేదు. కాని ఆమె కూడా భయపడింది. ఆమె కూడా భయపడింది. Sākṣāt śrīḥ preṣita devair dṛṣṭvā taṁ mahad adbhutam. ఆమెకు తెలుసు "నా భర్త నరసింహ-స్వామిగా అవతరించారు," కాని భగవంతుడు యొక్క అద్భుతమైన రూపము చాలా భయపెడుతుంది కనుక, ఆమె ఆయన ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. ఎందుకు? ఇప్పుడు,dṛṣṭaśruta-pūrvatvāt: ఆమె భర్త నరసింహస్వామి రూపాన్ని ధరిస్తారని ఆమెకు కూడా ఎప్పటికీ తెలియదు. ఈ నరసింహస్వామి రూపము ప్రత్యేకంగా హిరణ్యకశిపుని కోసము తీసుకోబడింది. ఇది చాలా శక్తివంతమైనది. హిరణ్యకశిపుడు భగవంతుడు బ్రహ్మ నుండి వరము పొందాడు, ఏ దేవుడు, రాక్షసులు, ఆయనని చంప కూడదు అని ఏ మనిషి అతన్ని చంపకూడదు; ఏ జంతువు కూడా ఆయనని చంపకూడదు; ఇంకా, ఇంకా ,ఇంకా పరోక్షముగా ఆయన ఎవరూ అతన్ని చంపకుండా ఉండటానికి ఒక ప్రణాళిక తయారు చేసాడు. ఎందుకంటే, మొట్ట మొదట ఆయన అమరుడు కావాలని కోరుకున్నాడు కాబట్టి భగవంతుడు బ్రహ్మ చెప్పారు "నేనే అమరుడిని కాదు. నేను నీకు ఎలా ఈ వరమును ఇవ్వగలను? అది సాధ్యం కాదు. " కాబట్టి ఈ రాక్షసులు, వారు చాలా తెలివైనవారు, duṣkṛtina, తెలివైనవారు - కాని పాపములును చేయుటకు. ఇది రాక్షసుల యొక్క లక్షణం. అందువలన ఆయన కొంత ప్రణాళిక చేసాడు, "పరోక్షముగా భగవంతుడు బ్రహ్మ నుండి వరమును తీసుకుంటాను ఆ విధముగా నేను అమరుడిగా ఉంటాను. "

కాబట్టి బ్రహ్మ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి, నారాయణుడు నరసింహ స్వామిగా: సగం సింహం సగం మనిషిగా అవతరించారు. అందువల్ల adṛṣṭāśruta-pūrva. లక్ష్మీ కూడా అటువంటి భగవంతుడి రూపమును, చూడలేదు సగం మనిషి, సగం సింహము ఇది నారాయణుడు, లేదా కృష్ణుడు, అంత శక్తివంతమైనవాడు. ఆయన ఏ రూపాన్ని అయినా పొందవచ్చు. అంటే ... Adṛṣṭā aśruta-purva. ఎప్పుడూ చూడలేదు. ఆమె నారాయణుడితో కలిసి ఉన్నప్పటికీ, కాని ఆమె ఎప్పుడూ నారాయణుడి యొక్కఅటువంటి అద్భుతమైన రూపాన్ని చూడలేదు. అందువల్ల adṛṣṭā aśruta-pūrvatvāt sā na upeyāya śaṅkitā. లక్ష్మీజి చాలా పవిత్రమైనది. కావున śaṅkitā: ఆమె భయపడిoది, బహుశా ఆయన వేరే వ్యక్తి అయి ఉండవచ్చు ఆమె పవిత్రమైనది, అత్యంత పవిత్రమైనది. ఆమె వేరే వ్యక్తితో ఎలా కలుస్తుంది? అందువలన śaṅkitā. ఈ పదం వాడబడింది, śaṅkitā. ఆమెకు ప్రతిదీ తెలిసి ఉండవలసినది, ఆప్పటికీ, ఆమె ఆలోచిస్తూంది, "నా భర్త అయి ఉండకపోవచ్చు." ఇది ఆదర్శవంతమైన పవిత్రత, లక్ష్మిజీ కూడా, విష్ణువు గురించి అనుమానముగా ఉన్నది, ఆమె మాట్లాడలేదు, దగ్గరకు వెళ్ళలేదు. Śaṅkitā. ఇది లక్ష్మీజీ యొక్క మరొక లక్షణం. ఆమె భయపడింది, "ఆయన నారాయణుడు కాకపోవచ్చు," ఆమె భర్త అటువoటి అద్భుతమైన రూపమును, సగం సింహం సగం మనిషి కలిగి ఉండుట ఆమెకు ఎప్పుడూ అనుభవము లేదు. కాబట్టి adṛṣṭāśruta-pūrvatvāt sa nopeyāya śaṅkitā