TE/Prabhupada 0480 - దేవుడు నిరాకారము కాదు, మనము అందరము వ్యక్తులు కనుక



Lecture -- Seattle, October 7, 1968


జంతువుల జీవితములో వాటికి ఇంద్రియ తృప్తి కాకుండా మరేమీ తెలియదు. వాటికి శక్తి లేదు. వాటి చైతన్యము అభివృద్ధి కాలేదు. గ్రీన్ లేక్ పార్కులో వలె, చాలా బాతులు ఉన్నాయి. ఎవరైనా కొంచము ఆహారముతో అక్కడకు వెళ్ళిన వెంటనే, అవి ఒకే చోటుకు వస్తాయి: "క్వాక్! క్వాక్! క్వాక్! క్వాక్!" అంతే. తిన్న తరువాత, అవి మైథునజీవితం ఆనందిస్తాయి. అంతే. అదేవిధముగా, పిల్లులు కుక్కలు ఈ జంతువులు కూడా, మానవ జీవితము కూడా అదే విధముగా ఉంటుంది "నేను ఏమి చేస్తున్నాను?" అనే ప్రశ్న లేనట్లయితే వారు కేవలం ఇంద్రియ కోరికల వలన పని చేస్తూ ఉంటే, వారు ఈ బాతులు కుక్కల కన్నా ఉన్నతము కాదు

కాబట్టి, మొదటి ఆరు అధ్యాయాలలో ఇది నిర్ణయించబడింది, ఒక జీవి ఒక ఆధ్యాత్మిక కణము అని. కణము ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడం చాలా కష్టము, ఎందుకంటే అది చాలా చిన్నది, అతిసూక్ష్మమైనది . కనుగొనేందుకు భౌతిక సూక్ష్మదర్శిని లేదా యంత్రం కాని లేదు. కాని అది ఉంది. అది ఉంది. నా శరీరంలో అది ఉన్నందున అది మీ శరీరంలో ఉన్నందున, లక్షణములు ఉన్నాయి కాబట్టి మీరు కదులుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు ప్రణాళిక చేస్తున్నారు, మీరు ఎన్నో అనేక విషయాలు చేస్తున్నారు- ఆ ఆధ్యాత్మిక కణము కోసం మాత్రమే. కాబట్టి మనం మహోన్నతమైన ఆత్మ యొక్క అతిసూక్ష్మమైన కణము. సూర్యరశ్మిలో చిన్న కణములు, మెరుస్తున్న రేణువులు ఉన్నాయి. మెరుస్తూ, ఈ మెరుస్తున్న కణాలు, అవి కలిసి ఉన్నప్పుడు, అది సూర్యరశ్మి. కాని అవి అణువులు. అవి వేరువేరు, పరమాణువు అణువులు. అదేవిధముగా, దేవుడితో మనకున్న సంబంధము, మనము కూడా దేవుడి యొక్క అతి చిన్న కణము, మెరుస్తున్న. మెరుస్తూ ఉండటము అంటే మనం అదే ప్రవృత్తిని కలిగి ఉన్నాము, ఆలోచించడం, భావనలు , సంకల్పము కలిగి ఉండటము, సృష్టించడం, ప్రతిదీ. నీవు నీలో ఏమైతో చూస్తావో అది దేవుడిలో ఉంటుంది. కాబట్టి దేవుడు నిరాకారము కాదు, మనము అందరము వ్యక్తులు కనుక. నేను చాలా ప్రవృత్తులను కలిగి వున్నాను - ఇది చాలా అతి సూక్ష్మమైన పరిమాణం. అదే ప్రవృత్తులు కృష్ణుడిలో లేదా దేవుడిలో ఉన్నాయి, కాని అది చాలా పెద్దవిగా, అపరిమితమైనవిగా. ఇది కృష్ణ చైతన్యము యొక్క అధ్యయనం. కేవలం గొప్పతనాన్ని, నా పరిస్థితి చాలా చిన్నది. మనము చాలా చిన్నవారము, అతి సుక్ష్మమైనవారము; ఇప్పటికీ, మనలో చాలా ప్రవృత్తులు ఉన్నాయి, చాలా కోరికలు, చాలా కార్యక్రమాలు, చాలా మనస్సు పని. ఎంత గొప్ప మనస్సు పని, కోరిక, ప్రవృత్తులు దేవుడులో ఉన్నాయో ఊహించుకోండి, ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు . ఆయన గొప్పతనము ఏమిటంటే ఇవన్నీ, మీరు ఏమి కలిగి ఉన్నారో, అవి ఆయనలో ఉన్నాయి, పెద్దవిగా. అంతే. గుణాత్మకంగా, మనము ఒకటి, కాని పరిమాణాత్మకంగా, మనము భిన్నమైనవారము. ఆయన గొప్పవాడు; మనము చిన్నవారము. ఆయన అనంతం; మనము అతి సుక్ష్మమైనవారము . కాబట్టి సారంశము, ఉదాహరణకు అనంతమైన అగ్ని కణాలు వలె, కణములు, అవి అగ్నిలో ఉన్నప్పుడు, అవి అగ్ని మరియు కణములుగా చూడటానికి చాలా బాగుంటాయి. కాని కణములు అగ్ని నుండి బయటకు వచ్చినప్పుడు, ప్రధాన అగ్ని, అవి ఆరిపోతాయి. ఇంక ఎటువంటి అగ్ని లేదు. అదేవిధముగా, మనము కృష్ణుడు లేదా దేవుడి యొక్క కణములు. మనము దేవుడితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మన , ఆ ప్రకాశించే శక్తి, అగ్ని, పునర్నిర్మాణం అవుతాయి. లేకపోతే, మనము ఆరిపోతాము. మీరు కణములు అయినప్పటికీ, మన ప్రస్తుత జీవితం, ఈ భౌతిక జీవితం, కప్పబడి ఉన్నది. కణము కప్పబడి ఉన్నది, లేదా దాదాపుగా ఆరిపోతుంది. ఇది ఉదాహరణ. దానిని ఆర్పలేము. అది ఆరిపోయినట్లయితే, మన జీవన పరిస్థితిని మనం ఎలా వ్యక్త పరుస్తున్నాము? ఇది ఆరిపోలేదు, కాని అది కప్పబడింది. అగ్నిని కప్పినప్పుడు, మీరు ఆ కప్పు మీద వేడిని చుస్తారు, కాని మీరు నేరుగా అగ్నిని చూడలేరు. అదేవిధముగా, ఈ ఆధ్యాత్మిక కణము తన భౌతిక దుస్తులుతో కప్పబడి ఉన్నది; కాబట్టి మనం చూడలేము. డాక్టర్ చెప్తాడు, ", శరీర పనితీరు విఫలమైంది; కాబట్టి హృదయము విఫలమైంది. ఆయన చనిపోయాడు." కాని ఎందుకు హృదయము విఫలమైంది ఆయనకు తెలియదు. ఏ వైద్య శాస్త్రం లెక్కించలేదు. వారు చాలా కారణాల గురించి చెబుతారు, అది ఎర్ర రక్త కణములు, ఎర్ర రక్త కణములు పనిచెయ్యటాన్ని నిలిపివేశాయి కాబట్టి, ఇది తెల్లగా మారింది; అందువలన ఇది..." కాదు. ఇది సరైన సమాధానం కాదు. రక్తమును ఎర్రగా తయారు చేయవచ్చు ... లేదా ఎర్రగా ఉండటము జీవితం కాదు. ప్రకృతి ద్వారా ఎర్రగా ఉన్న చాలా సహజమైన ఉత్పత్తులు ఉన్నాయి. అంటే ప్రాణము ఉన్నది అని కాదు.