TE/Prabhupada 0483 - మీరు కృష్ణుడి పట్ల ప్రేమను పెంపొందించుకోకుండా ఎలా కృష్ణుని స్మరించగలరు



Lecture -- Seattle, October 18, 1968


మీరు కృష్ణుడి గురించి స్మరణచేస్తూవుంటే, ఆ పధ్ధతి, కృష్ణచైతన్యం. అప్పుడు mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ, మీరు కృష్ణచైతన్యము అనే ఈ యోగ పద్ధతిని పాటిస్తే, ఏ విధంగా? మద్-ఆశ్రయః. మద్-ఆశ్రయః అంటే "నాతో సన్నిహితంగా ఉన్నవారిని ఆశ్రయించడం." మద్-ఆశ్రయః. మద్-ఆశ్రయః అంటే ప్రత్యక్షంగా ఆయనతో సంబంధం కలిగివుండడం. మీరు ఆయన గురించి ఆలోచించినా,ఆయన రూపాన్ని ధ్యానించినా వెంటనే ఆయనతో సంబంధంలోకి వస్తారు, కాని మీరు ఆయన గురించి తెలుసిన ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం తీసుకోకపోతే, మీరు ఎక్కువ కాలం దృష్టి నిలుపలేరు. అది తాత్కలికంగా ఉండవచ్చు. అందుచేత మీరు కృష్ణుడి గురించి తెలిసిన వ్యక్తి నుండి శ్రవణం చేయవలసివుంది. అప్పుడు కృష్ణుడిపై మీ మనస్సు యొక్క ఏకాగ్రత కొనసాగుతుంది. మీరు ఆయన దిశానిర్దేశం లో ప్రతిదీ ఆచరించాలి. మీ జీవితం ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో ఆ విధంగా మలచబడాలి. అప్పుడు మీరు ఈ యోగ పద్ధతిని సంపూర్ణంగా కొనసగించవచ్చు. ఆ యోగ పద్ధతి ఏమిటి? ఆ యోగ పద్ధతి గురించి భగవద్గీత లో వివరించారు, ఆరవ అధ్యయంలో, చివరి శ్లోకములో. Yoginām api sarveṣāṁ mad-gatenāntarātmanā: ( BG 6.47) ఎల్లప్పుడూ నా గురించి స్మరిస్తున్న వ్యక్తి, mad-gata, "అతను ఉత్తమ తరగతి యోగి." అనేక ప్రదేశాల్లో అది పేర్కొనబడింది. Premāñjana-cchurita. మీరు కృష్ణుడి పట్ల ప్రేమను పెంపొందించుకోకపోతే మీరు ఎలా కృష్ణుడి గురించి ఆలోచించగలరు? ఎలాగంటే రాధారాణి వలె. రాధారాణి, ఆమె వచ్చారు. ఆమె వివాహిత, గృహస్త జీవితంలో వుంది, కానీ ఆమె ఆయనను ఆరాధించడానికి కృష్ణుడిని సమీపించేది. అదేవిధముగా, మన మనసులో ఎప్పుడూ కృష్ణుడిని ఉంచుకోవాలి, ఆయన గురించి ఆలోచించాలి. అప్పుడు ఈ పద్ధతి, mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ, నా రక్షణలో,నా ప్రతినిధి యొక్క రక్షణలో, మీరు సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడు, సంపూర్ణంగా గ్రహించినప్పుడు, అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. " అసంశయం: "ఎటువoటి సందేహం లేకుండా." మీ ఆధ్యాత్మిక గురువు "కృష్ణుడు దేవాదిదేవుడు" అని చెప్పాడని కాదు. అలాకాదు.మీకు ఏవైన సందేహం ఉంటే, వెంటనే ప్రశ్నించండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. వాస్తవానికి కృష్ణుడు నిస్సందేహంగా దేవాదిదేవుడే, కాని మీకు ఏమైనా సందేహం ఉంటే, దానిని నివృత్తి చేసుకోవచ్చు. Asaṁśayam. ఈ విధముగా, మీరు ఈ యోగ పద్ధతిను పాటిస్తే, కృష్ణచైతన్యము, సర్వోత్తమయోగ పద్ధతి, Asaśśayam samagraṁ māṁ yathā jñāsyasi ( BG 7.1) అప్పుడు మీరు కృష్ణుడిని, లేదా దేవాదిదేవున్ని అర్థం చేసుకుంటారు, పరిపూర్ణంగా, ఏ సందేహం లేకుండా, మీ జీవితం విజయవంతమవుతుంది. ధన్యవాదాలు. (భక్తులు ప్రణామములు ఆచరిస్తారు)