TE/Prabhupada 0485 - కృష్ణుడు ఏ లీల చేసినా భక్తులు దానిని ఉత్సవ రూపంలో జరుపుకుంటారు
Lecture -- Seattle, October 18, 1968
అతిథి: మీరు జరుపుకునే ఈ ఉత్సవం యొక్క మూలం మరియు ప్రాముఖ్యతను వివరించగలరని కోరుకుంటున్నాను. ఆ ఉత్సవము జగన్నాథ రథోత్సవము అని పిలువబడే ఉత్సవము.
ప్రభుపాద: జగన్నాథ రథోత్సవ పండుగ ప్రాముఖ్యత ఏమంటే, కృష్ణుడు వృందవనమును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు. కృష్ణుడు తన పెంపుడు తండ్రి అయిన నంద మహారాజు చేత పెంచబడ్డాడు. కానీ ఆయన ఎదిగి 16 సంవత్సరలు వచ్చిన తర్వాత, ఆయన అసలు తండ్రి, వసుదేవుని వద్దకు చేరాడు, ఆ ఇరువురు సోదరులైన కృష్ణబలరాములు బృందావనాన్ని విడిచివెళ్ళారు.మరియు ... వారి నివాసం ... వారి రాజ్యం ద్వారకలో ఉంది. కాబట్టి కురుక్షేత్రంలో - కురుక్షేత్రం ఎల్లప్పుడూ ధర్మ-క్షేత్రం, తీర్థస్థలం - చంద్ర, సూర్య గ్రహణాలు అనబడే ప్రత్యేక దినాలు వున్నాయి , భారతదేశం యొక్క అనేక ప్రాంతాల నుండి అనేక మంది వ్యక్తులు, వారు స్నానం ఆచరిండానికి వచ్చారు. అదేవిధముగా, కృష్ణుడు , బలరాముడు మరియు వారి సోదరి సుభద్ర, వారు కూడ రాచమర్యాదలతో వచ్చారు, చాలా మంది సైనికులతో, చాలామంది ... రాజరికంగా వచ్చారు. అప్పుడు వృందావనవాసులు, వారు కృష్ణుడిని కలుసుకున్నారు, ముఖ్యంగా గోపీకలు, వారు కృష్ణుడిని చూశారు, మరియు వారు ఇలా విలపించారు "కృష్ణా, నీవు ఇక్కడ ఉన్నావు, మేము కూడా ఇక్కడే ఉన్నాము, కానీ ఇది వేరే ప్రదేశం. మనము వృందావనంలో లేము. " అలా వారు ఏ విధముగా విలపించారు మరియు ఎలా కృష్ణుడు వారిని ఓదార్చాడు అనేది పెద్ద కథ ఉంది. ఇది కృష్ణుడు దూరం అవడం వలన,ఆయన కోసం వృందావనవాసులు పొందిన విరహ భావన. ఈ విధముగా ... కృష్ణుడు రథం మీద వచ్చిన సందర్భం, దానిని రథ-యత్ర అని పిలుస్తారు. ఇది రథ-యాత్ర యొక్క పూర్వగాథ. అలా కృష్ణుడు ఏ లీల చేసినా భక్తులు దానిని ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. రథ-యాత్ర అంటే అది.