TE/Prabhupada 0492 - బుద్ధ తత్వము అంటే ఈ శరీరాన్ని నీవు ముగిస్తే, నిర్వాణ



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974


ఇప్పుడు ఈ శరీరం ఏమిటి? ఈ శరీరం భౌతిక పదార్దముల కలయిక. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము --- 8 భౌతిక పదార్థాలు, 5 స్థూల 3 సూక్ష్మ. ఈ శరీరం వాటితో తయారు చేయబడింది. కాబట్టి బుద్ధ తత్వము అంటే ఈ శరీరాన్ని నీవు విడగొట్టితే, నిర్వాణ. ఈ ఇల్లు రాయి, ఇటుక, కలపతో ఇంకా చాలా వాటితో తయారు చేయబడినట్లుగా మీరు దాన్ని విచ్ఛిన్నం చేస్తే, ఇంకా రాయి మరియు ఇటుక ఉండవు. ఇది భూమికి పంచబడుతుంది. భూమి మీద పడవేయండి. అప్పుడు ఇల్లు లేదు. అదే విధముగా, మీరు సున్నాగా మారితే, శరీరము లేదు, మీరు బాధలు సంతోషాల నుండి స్వేచ్ఛ పొందుతారు. ఇది వారి తత్వము, శూన్య తత్వము, శూన్యవాది: ఇది సున్నా చేయండి." కానీ అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. నీ వల్ల కాదు. ఎందుకంటే నీవు ఆత్మ. అది వివరించబడుతుంది, నీవు శాశ్వతము. నీవు సున్నా కాలేవు అది వివరించబడుతుంది, na hanyate hanyamane sarire ( BG 2.20) మనము ఈ శరీరాన్ని విడిచి పెడుతున్నాము,కానీ వెను వెంటనే నేను మరొక శరీరాన్ని అంగీకరించాలి, వెంటనే. అప్పుడు విచ్ఛిన్నం చేయడం అనే ప్రశ్న ఏక్కడ ఉంది? ప్రకృతి విధానముల వలన మీరు మరొక శరీరం పొందుతారు. మీరు ఆనందించాలని అనుకుంటున్నారు, మీరు ఈ భౌతిక ప్రపంచమునకు ఇక్కడకు వచ్చారు. అడిగే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరికీ తెలుసు " నేను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాను. నేను పూర్తిగా ఆనందించాలి." నేను మరొక జీవితములోనికి వెళుతున్నాను, అన్న వాస్తవం గురించి తెలియని వారు ఇది భౌతిక పదార్ధము యొక్క కలయిక --- భూమి, నీరు, గాలి, అగ్ని అని అనుకుంటున్నాడు. ఇది విరిగి పోయిన తర్వాత, అంతా పూర్తి అవుతుంది. కాబట్టి ఎంత కాలము నేను ఈ అవకాశము కలిగి ఉంటానో , నన్ను పూర్తిగా ఆనందించనివ్వండి. ఇది భౌతిక మనస్తత్వం, నాస్తికుడు, నాస్తికుడు, మనము శాశ్వతమైన ఆత్మ, మనము కేవలము శరీరాన్ని మారుస్తున్నాము అని తెలియని వారు. నాస్తికులు భావిస్తారు పూర్తి అయిన తర్వాత....

ఇక్కడ పాశ్చాత్య దేశంలో, గొప్ప, గొప్ప ప్రొఫెసర్, వారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు, శరీరం పూర్తయితే, అంతా పూర్తవుతుంది. లేదు. అది కాదు. అందువల్ల అది ఆదేశానికి ఆరంభం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ( BG 2.13) మీరు వివిధ శరీరాలను మారుస్తున్నారు. శరీరం పూర్తి అవ్వటం ద్వారా, మీరు పూర్తి అయినట్లు కాదు.