TE/Prabhupada 0526 - మనము కృష్ణుని దృఢంగా పట్టుకుంటే, మాయ ఏమీ చేయలేదు



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


తమాల కృష్ణ: మాయ ఒకదానిని పట్టుకున్నట్లయితే, కృష్ణుడి వద్దకు తిరిగి వెళ్లడానికి త్వరిత మార్గం ఏమిటి?

ప్రభుపాద: ఓ... అది కృష్ణుడు, అది కృష్ణుడు కేవలం.... ఎప్పుడైతే మాయ యొక్క ఆకర్షణ ఉందో, కేవలం కృష్ణుని ప్రార్థించండి, దయచేసి నన్ను రక్షించండి. దయచేసి నన్ను రక్షించండి. ఇది ఒక్కటే మార్గము. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మనం మాయ యొక్క రాజ్యంలో ఉన్నాము‌, కాబట్టి మాయ ఇక్కడ చాలా బలంగా ఉంది., కానీ మనము కృష్ణుని దృఢంగా పట్టుకుంటే, మాయ ఏమీ చేయలేదు. మనము కృష్ణుని పట్టుకోవడంలో స్థిరంగా ఉండాలి. అప్పుడు పడిపోవడం అనేది ఉండదు. అవును.

మధుద్విస : ప్రభుపాద మేము సంకీర్తనలో ఉన్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు, మాతో పాటుగా కీర్తనలో ప్రేక్షకులు పాల్గొనేటట్లు చేయడానికి ఉత్తమ మార్గం ఏమి ఉంటుంది? ఉత్తమ మార్గం ఏమి ఉంటుంది.....

ప్రభుపాద: మీరు కీర్తన చేస్తూ ఉండండి అదే ఉత్తమ మార్గం. మీ కర్తవ్యం కాదు, నేను చెప్పేది ఏమిటంటే, ప్రేక్షకులను సంతృప్తి పరచుట. మీ కర్తవ్యము కృష్ణుణ్ణి సంతృప్తి పరచుట, అప్పుడు సమూహం సహజముగానే సంతృప్తి చెందుతుంది. మనము సమూహాన్ని సంతృప్తి పరచము. మనము వారికి కొంత ఇవ్వబోతున్నాము‌, కృష్ణుడిని. కావున మీరు చాలా జాగ్రత్త వహించాలి మీరు సరైన రీతిలో కృష్ణున్ని ఇవ్వగలుగుతున్నారా అని అప్పుడు వారు సంతృప్తులవుతారు. మీ ఏకైక కర్తవ్యము కృష్ణుని సంతృప్తి పరచటం. అప్పుడు ప్రతిదీ సంతృప్తి చెందుతుంది. Tasmin tuste jagat tusta. కృష్ణుడు సంతృప్తి చెందితే మొత్తం ప్రపంచం సంతృప్తి చెందుతుంది. మీరు వేరు మీద నీరు పోస్తే, అది చెట్టు యొక్క ప్రతి భాగానికి సహజముగా పంపిణి అవుతుంది. కాబట్టి కృష్ణుడు గొప్ప వృక్షము, గొప్ప వృక్షము యొక్క వేరు, మీరు కృష్ణుడికి నీరు పోస్తున్నారు. హరేకృష్ణ కీర్తన జపము ఇంకా నియమ నిబంధనలను పాటించండి, ప్రతీదీ సరిగ్గా ఉంటుంది