TE/Prabhupada 0533 - రాధారాణి, ఆమె హరి-ప్రియ, కృష్ణుడికి చాలా ప్రియమైనది
Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971
రాధారాణి, ఆమె హరి-ప్రియ, కృష్ణుడికి చాలా ప్రియమైనది. మనం రాధారాణి ద్వారా కృష్ణుడిని చేరుకున్నట్లయితే, రాధారాణి యొక్క దయ ద్వారా, అది చాలా సులభం అవుతుంది. భక్తుడు చాలా బాగున్నాడు, అని రాధారాణి సిఫార్సు చేస్తే అప్పుడు కృష్ణుడు వెంటనే అంగీకరిస్తారు, నేను ఎంతటి దుష్టుడిని అయినా. ఎందుకంటే ఇది రాధారాణి, చేత సిఫార్సు చేయబడినది, కృష్ణుడు అంగీకరిస్తారు. అందుచేత వృందావనములో మీరు భక్తులు అందరు, వారు కృష్ణుడి కంటే రాధారాణి పేరును ఎక్కువ స్తుతిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు భక్తులు "జయ రాధే." అని పిలవటము చూస్తారు మీరు ఇప్పటికీ వృందావనములో చూస్తారు. వారు రాధారాణి మహిమలను కీర్తించటము చూస్తారు. వారు మరింత ఆసక్తిని కలిగి ఉన్నారు, రాధారాణిని పూజిoచుటకు. అయితే నేను ఎంతటి పతితుడైన కూడా, ఏదో ఒక విధముగా నేను రాధారాణిని సంతృప్తి పరిస్తే, అప్పుడు కృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా సులభం. లేకపోతే,
- manuṣyāṇāṁ sahasreṣu
- kaścid yatati siddhaye
- yatatām api siddhānāṁ
- kaścid vetti māṁ tattvataḥ
- (BG 7.3)
మీరు కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి కల్పనల పద్ధతి ద్వారా వెళ్ళితే, అది చాలా జీవితాలు పట్టవచ్చు. కాని మీరు భక్తియుక్త సేవలను తీసుకుంటే, కేవలము రాధారాణిని సంతృప్తి పరచటానికి ప్రయత్నిస్తే, కృష్ణుడిని చాలా సులభంగా పొందవచ్చు. ఎందుకంటే రాధారాణి కృష్ణుడిని మీకు ఇవ్వగలదు ఆమె గొప్ప భక్తురాలు, మహా భాగవత యొక్క చిహ్నం. కృష్ణుడు కూడా రాధారాణి యొక్క లక్షణమును అర్థం చేసుకోలేడు. కృష్ణుడు కూడా, అతడు vedāhaṁ samatītāni ( BG 7.26) అని చెప్పినప్పటికి, "నాకు ప్రతిదీ తెలుసు," అయినప్పటికీ, ఆయన రాధారాణిని అర్థం చేసుకోలేకపోయాడు. రాధారాణి చాలా గొప్పది. ఆయన ఇలా చెప్పాడు ... వాస్తవమునకు, కృష్ణుడికి ప్రతిదీ తెలుసు. రాధారాణిని అర్థం చేసుకోవటానికి, కృష్ణుడు రాధారాణి యొక్క స్థితిని అంగీకరించారు. కృష్ణుడు రాధారాణి యొక్క శక్తిని అర్థం చేసుకోవాలని కోరుకున్నాడు. కృష్ణుడు అనుకున్నాడు "నేను పూర్తిగా ఉన్నాను. నేను అన్ని విషయాల్లో పరిపూర్ణముగా ఉన్నాను, కాని ఇప్పటికీ, నేను రాధారాణిని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? " ఈ ప్రవృత్తి కృష్ణుడిని రాధారాణి యొక్క ప్రవృత్తిని అంగీకరించేటట్లు చేసింది, కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి.
ఇవి చాలా ఆధ్యాత్మికమైన, గొప్ప విజ్ఞాన శాస్త్రం. కృష్ణ చైతన్యములో ఉన్నత స్థానములో ఉన్న వ్యక్తి శాస్త్రమును బాగా అర్థం చేసుకున్న వ్యక్తి, వారు అర్థం చేసుకోగలరు. కాని ఇప్పటికీ, మనము శాస్త్రము నుండి చర్చించగలము. కృష్ణుడు తనను తాను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, ఆయన శ్రీమతి రాధారాణి యొక్క ధోరణిని తీసుకున్నాడు. అది చైతన్య మహాప్రభు. Rādhā-bhāva-dyuti-suvalitam. చైతన్య మహాప్రభు కృష్ణుడే, కాని ఆయన రాధారాణి యొక్క ప్రవృత్తిని అంగీకరించారు. కృష్ణుడి నుండి విరహ భావనను రాధారాణి ఎల్లప్పుడూ అనుభవిస్తుంది, అదేవిధముగా, రాధారాణి యొక్క స్థితిలో, చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క విరహ భావనను అనుభవిస్తున్నారు. ఇది చైతన్య మహా ప్రభు యొక్క ఉపదేశములు, విరహ భావనలు, కలసి ఉండటము కాదు. చైతన్య మహాప్రభు భోధించిన భక్తియుక్త సేవ యొక్క పద్ధతి, ఆయన గురు శిష్య పరంపర కృష్ణుడి నుండి విరహ భావనను ఎలా అనుభవించాలి. అది రాధారాణి యొక్క స్థితి,
ఎల్లప్పుడూ విరహ భావనలో వుండేవారు గోస్వాములు, వారు వృందావనములో ఉన్నప్పుడు, వారు "నేను కృష్ణుడిని చూశాను" అని ఎప్పుడూ చెప్పలేదు. వారు అత్యంత పరిపూర్ణము అయినప్పటికీ, "నేను కృష్ణుడిని చూశాను" అని ఎప్పుడూ చెప్పలేదు. వారి ప్రార్థనలు ఈ విధముగా ఉన్నాయి: he rādhe vraja-devike ca lalite he nanda-suno kutaḥ. He rādhe, Rādhārāṇī, he rādhe vraja-devike ca... రాధారాణి ఒంటరిగా ఉండేది కాదు. ఆమె ఎల్లప్పుడూ తన స్నేహితులతో ఉండేది, వ్రజ-దేవి, లలిత లేదా విశాఖ మరియు ఇతర వృందావన యువతులతో. కావున గోస్వాములు ప్రార్థన చేస్తున్నారు, వారి పరిపక్వ దశలో, వారు వృందావనములో నివసిస్తున్నప్పుడు, వారు ఈ విధముగా ప్రార్థిస్తున్నారు, he rādhe vraja-devike ca lalite he nanda-suno kutaḥ. ఎక్కడ, రాధారాణి, మీరు ఎక్కడ ఉన్నారు? మీ సహచరులు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు Nanda-suno, నంద మహారాజు యొక్క కుమారుడు, కృష్ణా? మీరు అoదరూ ఎక్కడ ఉన్నారు?" వారు వెతుకుతున్నారు. వారు ఎప్పుడూ చెప్ప లేదు, "గోపీకలతో కృష్ణుడు నృత్యం చేయటము నేను చుసాను, నిన్న రాత్రి నేను చూశాను. " (నవ్వు). ఇది సహజియా. ఇది పరిపక్వ భక్తుడు కాదు. దీనిని పిలుస్తారు ... వారిని సహజీయా అని పిలుస్తారు. వారు ప్రతిదీ చాలా చౌకగా తీసుకుంటారు - కృష్ణుడు చాలా తుచ్ఛమైనవాడు, రాధారాణి చాలా తుచ్ఛమైనది - వారు ప్రతి రాత్రి చూడగలిగినట్లుగా. కాదు గోస్వాములు మనకు అలా భోధించలేదు. వారు శోధిస్తున్నారు. He rādhe vraja-devike ca lalite he nanda-suno kutaḥ, śrī-govardhana-pādapa-tale kālindī-vanye kutaḥ: మీరు గోవర్ధన పర్వతము కింద ఉన్నారా, లేదా యమునా నది ఒడ్డున ఉన్నారా? Kālindī-vanye kutaḥ. Ghoṣantāv iti sarvato vraja-pure khedair mahā-vihvalau. వారి పని ఇలా భాధపడటము, "మీరు ఎక్కడ ఉన్నారు? నీవు ఎక్కడ ఉన్నావు, రాధారాణి? మీరు ఎక్కడ ఉన్నారు, లలిత, విశాఖ, రాధారాణి యొక్క సహచరుల్లారా? మీరు ఎక్కడ ఉన్నారు, కృష్ణా? మీరు గోవర్ధన పర్వతము వద్ద లేదా యమునా నది ఒడ్డున ఉన్నారా? " Ghoṣantāv iti sarvato vraja-pure. అందువల్ల వారు వృందావనము మొత్తం వారు ఏడుస్తూ మరియు వారి గురించి వెతుకుతూ, khedair mahā-vihvalau, పిచ్చివాడిలా Khedair mahā-vihvalau. Vande rūpa-sanātanau raghu-yugau śrī-jīva-gopālakau