TE/Prabhupada 0535 - మనము జీవాత్మలము, మనము ఎన్నటికీ మరణించము, ఎన్నడూ జన్మించము



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973


గౌరవనీయులు, హై కమిషనర్ గారు; లేడీస్ అండ్ జెంటిల్ మెన్, మీరు ఇక్కడికి వచ్చినందుకు ఈ వేడుకలో పాల్గొన్నందుకు చాలా కృతజ్ఞతలు, జన్మాష్టమి, కృష్ణుడి ఆగమనం. నేను మాట్లాడటానికి ఆదేశింపబడిన విషయము కృష్ణుడి యొక్క ఆగమనం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పెను,


janma karma me divyaṁ
yo jānāti tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti mām eti kaunteya
(BG 4.9)

ఇది వాస్తవము, మనము జీవితం యొక్క అటువంటి దశను సాధించగలము, అప్పుడు మనము మన జన్మ మరియు మరణమును ఆపివేయవచ్చు ... Sa 'mṛtatvāya kalpate. ఈ ఉదయం, నేను ఈ శ్లోకము వివరించడం జరిగినది:

yaṁ hi na vyathayanty ete
puruṣaṁ puruṣarsabha
sama-duḥkha-sukhaṁ dhīraṁ
so 'mṛtatvāya kalpate
(BG 2.15)

అమృతత్వ అంటే అమరత్వం. కాబట్టి ఆధునిక నాగరికత, వారికి తెలియదు, గొప్ప తత్వవేత్త, గొప్ప రాజకీయనాయకుడు లేదా గొప్ప శాస్త్రవేత్త అయినా, ఆ అమరత్వం యొక్క దశను సాధించడం సాధ్యమేనని. అమృతత్వ మనమందరము అమృత. అమృతత్వ. భగవద్గీతలో ఇది చెప్పబడింది, na jāyate na mrīyate vā kadācin. మనము జీవాత్మలము, మనము ఎన్నటికీ మరణించము, ఎన్నడూ జన్మించము. Nityaḥ śāśvato yaṁ, na hanyate hanyamāne śarīre ( BG 2.20) మనలో ప్రతి ఒక్కరు, మనము శాశ్వతమైనవారము, nityaḥ śāśvato; purāṇa, పురాతనమైనది. మరియు ఈ శరీరం యొక్క వినాశనం తర్వాత కూడా, మనము మరణించము. న హన్యతే. శరీరం పూర్తయింది, కానీ నేను మరొక శరీరం అంగీకరించాలి. Tathā dehāntara prāptir dhīras tatra na muhyati. Dehino 'smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā ( BG 2.13)

ఇది సాధారణ విషయం, ప్రస్తుత సమయంలో, వారికి ఈ జ్ఞానం కొరవడింది, అది మనం, అందరము జీవాత్మలము, కృష్ణుని యొక్క భాగం మరియు అంశలము, మనము శాశ్వతమైనవారము, మనము ఆనందకరమైనవారము, మనము సంపూర్ణ జ్ఞానవంతులము.

కృష్ణుడు వేదశాస్త్రములలో వర్ణించబడెను:

īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
sac-cid-ānanda-vigrahaḥ
anādir ādir govindaḥ
sarva-kāraṇa-kāraṇam
(Bs. 5.1)

Sac-cid-ānanda-vigrahaḥ. భగవంతుడు, కృష్ణుడు, నేను కృష్ణుడని మాట్లాడినప్పుడు, దాని అర్థం భగవంతుడు అని. అక్కడ ఏదైనా ముఖ్యమైన నామము ఉంటే... భగవంతుడు, కొన్నిసార్లు భగవంతుడుకి నామము లేదు అని చెప్పబడింది. అది సత్యము. కానీ భగవంతుని నామము ఆయన కార్యక్రమాల ద్వారా ఇవ్వబడుతుంది. ఉదాహరణకు కృష్ణుడు నంద మహారాజ యొక్క కుమారుడిని అని అంగీకరించినట్లే, లేదా యశోదామాయి, లేదా దేవకీ లేదా వసుదేవ. వసుదేవుడు మరియు దేవకి కృష్ణుడి వాస్తవమైన తండ్రి తల్లి. ఎవరూ కృష్ణుడి యొక్క వాస్తవమైన తండ్రి తల్లి కాదు, ఎందుకనగా కృష్ణుడు ప్రతిఒక్కరికి వాస్తవమైన తండ్రి. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఇక్కడకు వచ్చెనో, ఆగమనం, ఆయన కొందరు భక్తులను తన తండ్రిగా తన తల్లిగా అంగీకరించారు. కృష్ణుడు మూలము, ādi-puruṣa. Ādyaṁ purāṇa-puruṣam nava-yauvanaṁ ca (Bs. 5.33). ఆయన మొదటి వ్యక్తి. అప్పుడు చాలా వృద్ధుడై ఉండాలి? లేదు Adyam purāṇa puruṣam nava-yauvanam ca. ఎల్లప్పుడూ నవ యవ్వనం. అది కృష్ణుడు