TE/Prabhupada 0543 - మీరు గురువుగా మారారు అని గొప్పగా చుపెట్టుకోవలసిన అవసరం లేదు



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973


చైతన్య మహాప్రభు అంటారు యారె దేఖ తారే కహా కృష్ణ - ఉపదేశ ( CC Madhya 7.128) కాబట్టి నేను నేను అభ్యర్థిస్తున్నాను - దయచేసి చైతన్య మహాప్రభు ఆదేశాన్ని పాటించండి, మీరు కూడా, మీ ఇంటి వద్ద ఒక గురువు అవుతారు. మీరు గురువుగా మారారు అని గొప్పగా చుపెట్టుకోవలసిన అవసరం లేదు. తండ్రి గురువుగా మారాలి, తల్లి గురువుగా మారాలి. వాస్తవానికి, శాస్త్రాలలో చెప్పబడింది, ఒకరు తండ్రి కాకూడదు, ఒకరు తల్లి కాకూడదు, వారు వారి పిల్లలకు గురువు కాకుంటే. న మోచయెద్ యః సముపెత - మృత్యుమ్. ఒక వ్యక్తి తన పిల్లవాడిని జననం మరణం బారి నుండి కాపాడలేకపోతే, అతడు ఒక తండ్రి కాకూడదు. ఇది వాస్తవమైన గర్భనిరోధక పద్ధతి. పిల్లులు కుక్కలవలె లైంగిక సంపర్కం చేయడం కాదు, పిల్లలు ఉంటే చంపడం మరియు గర్భస్రావం చేయడం. కాదు. అది గొప్ప పాపాత్మకమైన పని. నిజమైన గర్భనిరోధక పద్ధతి ఏమిటంటే, మీరు జననం మరణం బారినుండి మీ కుమారుని ముక్తుడను చేయకపోతే, తండ్రి కాకూడదు. అది కావలసినది. పితా న స స్యాజ్ జననీ న స స్యాత్ గురు న స స్యాత్ న మొచయెద్ యహ్ సముపెత-మృత్యుం. మీరు మీ పిల్లలను జన్మించడము బారి నుండి కాపాడలేకపోతే....

ఇది మొత్తం వేదముల సాహిత్యం. పునర్ జన్మ జయయః. తరువాతి పుట్టుక, తర్వాతి భౌతిక పుట్టుక ఎలా జయించడం, వారికి తెలియదు.  మూర్ఖులు వైదిక సంస్కృతిని మరిచిపోయారు, వైదిక సంస్కృతి అంటే ఏమిటి. వైదిక సంస్కృతి అంటే తరువాత పుట్టుకను జయించటం, అంతే. కానీ వారు తర్వాత జన్మమును నమ్మరు. 99 శాతం మంది ప్రజలు, వైదిక సంస్కృతి నుండి క్రిందకి పడిపోయారు. భగవద్గీత లో కూడ అదే తత్వము ఉంది. త్యక్త్వా దేహం పునర్ జన్మ నైతి మాం ఏతి కౌంతేయ ( BG 4.9) ఇది వైదిక సంస్కృతి. వైదిక సంస్కృతి అంటే, పరిణామ పద్ధతి ద్వారా మనము ఈ మానవ రూపంలోకి వచ్చాము. ఆత్మ ఒక దేహము నుండి మరొక దానికి పరకాయ ప్రవేశం ఆపే అవకాశమును ఇక్కడ ఉంది. తథా దేహాంతర ప్రాప్తిర్, ఏ విధమైన శరీరాన్ని నేను తదుపరి పొందబోతున్నానో మీకు తెలియదు. ప్రకృతి చట్టాల ద్వారా, ఈ శరీరం ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఏదో, తదుపరి శరీరం కుక్క కావచ్చు

ప్రకృతేః క్రియమానాని
గుణైః కర్మాణి సర్వశః
అహంకార -విమూఢాత్మా
కర్తాహం (ఇతి మన్యతే)
( BG 3.27)


వారికి తెలియదు. వారు సంస్కృతిని మర్చిపోయారు. జంతువుల వలె తినటం,నిద్రపోవటం, సంపర్కించటం మరియు రక్షించుకోవటం మానవ జీవితాన్ని దుర్వినియోగ పరచడం. ఇది నాగరికత కాదు. నాగరికత పునర్ జన్మ జయయః, తదుపరి భౌతిక జన్మను ఎలా జయించాలి. అది కృష్ణచైతన్య ఉద్యమము. కాబట్టి మేము చాలా సాహిత్యాలను అందుబాటులోకి తెస్తున్నాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా, జ్ఞానవంతులైన వారిచే అంగీకరించబడింది. ఈ ఉద్యమ ప్రయోజనాన్ని తీసుకోండి. మేము తెరవడానికి ప్రయత్నించాము, ఇక్కడ కేంద్రం స్థాపించడానికి మా వినమ్ర  ప్రయత్నం. మా మీద అసూయపడకండి. దయ చేసి మాపై దయ చూపించండి. మేము..., మా వినయ పూర్వకమైన ప్రయత్నం. దాని ప్రయోజనమును పొందండి. ఇది మా అభ్యర్థన.

చాలా ధన్యవాదములు.