TE/Prabhupada 0545 - వాస్తవమైన సంక్షేమ కార్యక్రమం అంటే ఆత్మ యొక్క స్వలాభంకు చూడాలి



His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Appearance Day, Lecture -- Mayapur, February 21, 1976


ప్రభుపాద: అందుచే చైతన్య మహాప్రభు కొంత పరోపకారము చేయాలని కోరుకున్నప్పుడు...

bhārata bhūmite manuṣya-janma haila yāra
(manuṣya) janma sārthaka kari' kara para-upakāra
(CC Adi 9.41)

ఈ సంక్షేమ కార్యక్రమాలు అంటే ఈ శరీరానికి సంక్షేమం కాదు. ఇది ఆత్మ కోసం ఉద్దేశించబడింది, అదే విషయం కృష్ణుడు అర్జునుడి మనస్సుకు అర్థమయేటట్లు చేయాలని కోరుకున్నాడు, అది నీవు ఈ శరీరం కాదు, నీవు ఆత్మ. Antavanta ime dehaḥ nityasyoktāḥ śarīriṇaḥ, na hanyate hanyamāne śarīre ( BG 2.20) కాబట్టి వాస్తవమైన సంక్షేమ కార్యక్రమం అంటే ఆత్మ యొక్క స్వలాభంకు చూడాలి అని అర్థం. కాబట్టి ఆత్మ స్వలాభం ఏమిటి? ఆత్మ యొక్క స్వలాభం, ఆత్మ అనేది భగవానుడు కృష్ణుడు యొక్క భాగం మరియు అంశము. ఉదాహరణకు చిన్న అగ్నికణాలు పెద్ద అగ్ని యొక్క భాగము మరియు అంశ, అదేవిధముగా, మనము జీవులము, మనము చాలా సూక్ష్మమైన వారము. మహోన్నతమైన బ్రహ్మణ్ , పర బ్రహ్మణ్ లేదా కృష్ణుడి యొక్క చిన్న కణము. కాబట్టి అగ్ని లోపల ఉన్న కణము చాలా అందంగా కనపడుతుంది, అగ్ని కూడా అందంగా కనపడుతుంది, కణము కూడా అందంగా కనపడుతుంది, కానీ అగ్ని నుండి అగ్నికణాలు పడిపోవటంతో, అది ఆరిపోతుంది.

కాబట్టి మనపరిస్థితి, అది... మన ప్రస్తుత స్థితి, మనము కృష్ణుడనే సంపూర్ణ అగ్ని నుండి పడిపోయాము. ఇది ఒక సాధారణ బెంగాలీ భాషలో వివరించబడింది:

kṛṣṇa bhūliyā jīva bhoga vāñchā kare
pasate māyā tāre jāpaṭiyā dhare

మాయ అంటే చీకటి, అజ్ఞానం. కాబట్టి ఈ ఉదాహరణ చాలా బాగుంది. అగ్నికణములు అగ్నితో చాలా చక్కగా నృత్యము చేస్తున్నాయి. ఇది ప్రకాశవంతంగా కూడా ఉంటుంది. కానీ నేలమీద పడిపోతే వెంటనే, బూడిద అవుతుంది అది బూడిద అవుతుంది, నల్లని బూడిద, మండుతున్న లక్షణము ఇక ఉండదు. అదేవిధముగా, మనము నృత్యం కోసం ఉద్దేశించినబడిన వారము, మరియు ఆడుకోవడం, నడవడం మరియు జీవించడం కృష్ణుడితో. అది మన వాస్తవమైన పరిస్థితి. అది వృందావనము. ప్రతి ఒక్కరూ... అందరూ కృష్ణునితో అనుసంధానించబడ్డారు. అక్కడ చెట్లు, పువ్వులు, నీరు, ఆవులు, దూడలు, గోప బాలురు, లేదా వృద్ధ గోప వ్యక్తులు, నంద మహారాజా, ఆయన వయస్సులోని ఇతర వ్యక్తులు, తర్వాత యశోదామయి, తల్లి, తర్వాత గోపికలు - ఈ విధముగా, వృందావన జీవితం, వృందావన వర్ణణ. కృష్ణుడు పూర్తి వృందావన వర్ణణతో వస్తాడు, ఆయన వృందావన జీవితాన్ని ప్రదర్శిస్తాడు, cintāmaṇi-prakara-sadmasu, కేవలం మనల్ని ఆకర్షించడానికి, మీరు ఈ భౌతిక ప్రపంచంలో ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇక్కడ మీరు ఆనందించలేరు ఎందుకంటే మీరు శాశ్వతమైనవారు. మీరు ఇక్కడ శాశ్వత జీవితాన్ని పొందలేరు. కాబట్టి మీరు నా దగ్గరకు రండి. మీరు నా దగ్గరకు రండి. Tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. (ప్రక్కన: ) దయచేసి ప్రసాదం కొరకు వేచి ఉండమని వారిని అడగండి . Tyaktvā dehaṁ punar janma naiti mām eti. ఇది ఆహ్వానము. మామేతి. "ఆయన తిరిగి ఇంటికి వస్తాడు, భగవంతుని ధామమునకు" ఇది భగవద్గీత యొక్క పూర్తి ఉపదేశము అంతిమంగా ఆయన చెప్పారు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఎందుకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు, భౌతిక జీవితాన్ని సర్దుబాటు చేయడానికి చాలా ప్రణాళికలను తయారు చేస్తున్నారు? అది సాధ్యం కాదు. ఇక్కడ అది సాధ్యం కాదు. ఇక్కడ ఎంత కాలము మీరు భౌతిక సాంగత్యములో ఉంటే, అప్పుడు మీరు శరీరాన్ని మార్చాలి. Prakṛteḥ kriyamāṇāni... ( BG 3.27) Prakṛti-stho. ఆ శ్లోకము ఏమిటి? Puruṣaḥ prakṛti-stho 'pi...

హృదయానంద : Bhuñjate prakṛti-jān guṇān.

ప్రభుపాద: హా. Bhuñjate prakṛti-jān guṇān.