TE/Prabhupada 0549 - యోగా యొక్క వాస్తవమైన ప్రయోజనము ఇంద్రియాలను నియంత్రించడం



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


తామాల కృష్ణ:"... ఇంద్రియాల పట్ల, ఒక వ్యక్తి ఆసక్తి పెంచుకుంటాడు, అలాంటి ఆసక్తి నుండి కామము అభివృద్ధి చెందుతుంది, కామము నుండి కోపం వస్తుంది ( BG 2.62) " భాష్యము. "కృష్ణ చైతన్యము లేని వ్యక్తి భౌతిక కోరికలకు ఆకర్షితుడు అవ్వుతాడు ఇంద్రియాలు వస్తువుల మీద ధ్యానం చేయడము వలన. ఇంద్రియాలకు వాస్తవమైన నిమగ్నత అవసరము, మరియు అవి భగవంతుడు యొక్క ఆధ్యాత్మిక సేవలో ప్రేమతో వినియోగించ బడకపోతే, అవి ఖచ్చితముగా భౌతిక సేవలో నిమగ్నతను కోరుకుంటాయి. "

ప్రభుపాద: అవును. ఇక్కడ యోగ పద్ధతి యొక్క రహస్యం ఉన్నది Yoga indriya-saṁyama. యోగా యొక్క వాస్తవమైన ప్రయోజనము ఇంద్రియాలను నియంత్రించడం. మన భౌతిక కార్యక్రమాలు అంటే ఏదైనా ప్రత్యేక లక్ష్యమునకు లేదా ఆనందమునకు ఇంద్రియాలను నిమగ్నం చేయటము. ఇది మన భౌతిక నిమగ్నత. మరియు యోగ పద్ధతి అంటే మీరు ఇంద్రియాలను నియంత్రించవలసి వుంటుంది భౌతిక ఆనందం, లేదా భౌతిక సుఖ దుఃఖాల నుండి ఇంద్రియాలను అనాశక్తులను చేయడము, మరియు మళ్ళిoచటము, పరమాత్మ విష్ణువును నీ లోపల చూడటముపై దృష్టి సారించడం. అది యోగా యొక్క వాస్తవమైన ప్రయోజనము. యోగ అంటే అర్థం కాదు... వాస్తవానికి, ప్రారంభంలో వివిధ నియమాలు నిబంధనలు ఉన్నాయి, భంగిమలో కూర్చుని, మనస్సును నియంత్రణలోకి తీసుకురావటము. కాని అవి మాత్రమే అంతం కాదు. అంతిమ అంశము భౌతిక నిమగ్నతను నిలిపివేయడం ఆధ్యాత్మిక నిమగ్నతను ప్రారంభించడం. ఇక్కడ అది వివరించబడింది. చదువుతూ వెళ్ళండి.

తమలా కృష్ణ: "భగవంతుడు శివుడు మరియు భగవంతుడు బ్రహ్మలతో సహా భౌతిక ప్రపంచము లో ప్రతి ఒక్కరు- స్వర్గ లోకములో ఉన్న ఇతర దేవతల గురించి ఏమి చెప్పాలి - వారు కూడా ఇంద్రియ వస్తువుల ప్రభావమునకు గురి ఆయినారు."

ప్రభుపాద: ఇంద్రియ వస్తువులు, అవును.

తమలా కృష్ణ: "ఇంద్రియ వస్తువులు. భౌతిక జీవితము యొక్క ఈ చిక్కు నుండి బయటపడటానికి పద్ధతి కృష్ణ చైతన్యము మాత్రమే. "

ప్రభుపాద: ఇది వేదముల సాహిత్యం నుండి నేర్చుకోబడినది... అయితే, వారు మనకు, భగవంతుడు శివుడిని, భగవంతుడు బ్రహ్మను మనకు చూపిస్తున్నారు. వారు కూడా కొన్నిసార్లు ఇంద్రియార్థాలకు ఆకర్షించబడుతున్నారు. ఉదాహరణకు భగవంతుడు బ్రహ్మ, తన కుమార్తె సరస్వతి ... సరస్వతి అత్యంత పరిపూర్ణ అందముగా, మహిళలలో సౌందర్యముగా పరిగణించబడుతుంది. కాబట్టి భగవంతుడు బ్రహ్మ తన కుమార్తె యొక్క అందమునకు ముగ్ధుడు అయినాడు కేవలం మనకు ఉదాహరణ చూపించడానికి భగవంతుడు బ్రహ్మ కూడా ఒక్కొకసారి ముగ్ధుడు అవుతాడు ఈ మాయ చాలా బలంగా ఉంది. ఆయన "ఆమె నా కుమార్తె" అని మర్చిపోయాడు. అప్పుడు పశ్చాత్తాపంతో, బ్రహ్మ తన శరీరమును వదిలినారు. ఈ కథలు శ్రీమద్-భాగవతములో ఉన్నాయి. అదేవిధముగా, భగవంతుడు శివుడు కూడా, కృష్ణుడు మోహిని-మూర్తీలో ఆయన ముందు కనిపించినప్పుడు ... మొహిని-మూర్తి ... మోహిని అంటే అత్యంత మంత్రముగ్దులను చేసేది, అందమైన మహిళా రూపం. భగవంతుడు శివుడు కూడా ఆమె కొరకు పిచ్చి వాడు అయ్యాడు. కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళితే, శివుడు ఆమెను వెంటబడుతున్నాడు. మొహిని-మూర్తీని వెంటాడుతున్నప్పుడు, భగవంతుడు శివుడికి విసర్జనములు అయినవి. కాబట్టి ఈ ఉదాహరణలు ఉన్నాయి. భగవద్గీతలో చెప్పబడిన విధముగా, daivī hy eṣā guṇamayī mama māyā duratyayā ( BG 7.14) భౌతిక శక్తీ అంతా ఈ అందముచే, మహిళా అందముచే ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది. వాస్తవమునకు, అందం లేదు. ఇది భ్రమ. శంకరాచార్య చెప్పారు "మీరు ఈ అందం వెంబడి పడుతున్నారు, కాని మీరు ఈ అందమును విశ్లేషించారా? అందము అంటే ఏమిటి? " Etad rakta-māṁsa-vikāram. ఇది మన విద్యార్ధులైన గోవిందా దాసి మరియు నర-నారాయణల వలె, ప్లాస్టార్ అప్ పారిస్తో అచ్చులు తయారు చేస్తున్నారు . ఈ సమయంలో, ఆకర్షణ లేదు. కాని ప్లాస్టర్ అప్ పారిస్కు చక్కగా రంగులు వేసినప్పుడు, అది చాలా ఆకర్షణీయముగా ఉంటుంది. అదేవిధముగా, ఈ శరీరం రక్తం మరియు కండరాలు మరియు రక్త నాళముల కలయిక. మీ శరీరం యొక్క పై భాగాన్ని మీరు కత్తిరించి లోపలికి చూసిన వెంటనే, అది అంతా అసహ్యకరమైన భయంకరమైన విషయాలతో ఉంది. కాని మాయ యొక్క భ్రాంతి రంగు ద్వారా బాహ్యంగా చక్కగా చిత్రీకరించబడింది, అందువలన ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అది మన ఇంద్రియాలను ఆకర్షిస్తోంది. ఇది మన బంధనము యొక్క కారణం.