TE/Prabhupada 0555 - భౌతిక వ్యక్తులు, వారు ఆధ్యాత్మిక అవగాహన విషయములో నిద్రిస్తున్నారు
Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968
ప్రభుపాద:మన విధానము tat-paratvena nirmalam ( CC Madhya 19.170) మీరు కృష్ణ చైతన్యములో నిమగ్నము అవ్వడము ద్వారా ఇంద్రియాలను పవిత్రము చేసుకోవచ్చు. అప్పుడు ఇంద్రియాలు మీకు కలత కలిగించవు. మీరు ఇంద్రియాలను నియంత్రించాలనుకుంటే, మొదట నాలుకను నియంత్రించాలి. అప్పుడు మీరు చాలా సులభంగా ఇతర ఇంద్రియాలను నియంత్రించగలరు. కాబట్టి మీరు హరే కృష్ణను కీర్తించే నిమగ్నతను, కృష్ణ ప్రసాదమును రుచి చూసే నిమగ్నతను ఇవ్వాలి - మీ ఇతర ఇంద్రియాలు ఇప్పటికే నియంత్రించబడుతున్నాయి అని మీరు కనుగొంటారు. ఇది మన ఇంద్రియాలను, నాలుకను నియంత్రించే ఉపాయము. నాలుకకు మీరు ప్రత్యేకముగా నాలుకకు అన్నిటిలో నిమగ్నమయ్యే అవకాశము ఇస్తే, మీరు ఇతర ఇంద్రియాలను నియంత్రించుకోలేరు ఇది ఇంద్రియాలను నియంత్రించే రహస్యంగా చెప్పవచ్చు. కొనసాగించు.
తమాలకృష్ణ: 69: "అందరికీ రాత్రి అంటే ఆత్మ నియంత్రణ పొందిన వ్యక్తికి మేల్కొనే సమయం, అన్ని జీవులకు మేల్కొలుపు సమయం, ఆత్మ పరిశీలన ఉన్న వ్యక్తికి రాత్రి. " భాష్యము: "తెలివైన వ్యక్తులు రెండు తరగతుల వారు ఉన్నారు. ఒకరు ఇంద్రియ తృప్తి కోసం భౌతికము కార్యక్రమాలలో మేధస్సును కలిగి ఉన్నారు, మరొకరు ఆత్మ-పరిశీలన కలిగి ఉన్నారు వారు ఆత్మ సాక్షాత్కారమును మేలుకొల్పుట గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆత్మ పరిశీలన గల యోగి లేదా ఆలోచన కలిగిన వ్యక్తి యొక్క కార్యక్రమాలు సామాన్యంగా భౌతిక వ్యక్తులకు రాత్రి వంటివి. భౌతిక వ్యక్తులు, ఆత్మ సాక్షాత్కారము గురించి అజ్ఞానము కారణంగా నిద్రలోనే ఉంటారు అటువంటి రాత్రి సమయంలో . అయితే, ఆతని ఆత్మ పరీశీలన కలిగిన వ్యక్తి, ఆ భౌతిక వ్యక్తి యొక్క రాత్రి సమయములో కూడా అప్రమత్తంగా ఉంటాడు. "
ప్రభుపాద: రాత్రి అంటే ప్రజలు నిద్రిస్తున్నప్పుడు, పగలు అంటే వారు మేల్కొని ఉన్నప్పుడు అని అర్థము. ఇది పగలు మరియు రాత్రి యొక్క అవగాహన. కావున, భౌతిక వ్యక్తులు, వారు ఆధ్యాత్మిక అవగాహన విషయములో నిద్రిస్తున్నారు. కాబట్టి భౌతిక వ్యక్తిని పగటిపూట మనకు కనిపించే కార్యక్రమాలు, వాస్తవానికి అది రాత్రి. ఆధ్యాత్మిక వ్యక్తికి, వారు ఈ ప్రజలు, వారికి ఆత్మ సాక్షాత్కారము యొక్క అవకాశము ఉంది, ఈ మానవ రూపం యొక్క సౌకర్యం ఉంది. వారు ఎలా నిద్ర పోతున్నారు. భౌతిక వ్యక్తులు, వారు చూస్తున్నారు, ఓ, ఈ కృష్ణ చైతన్య యువకులు, వారు ప్రతిదీ వదలి వేసినారు వారు హరే కృష్ణను కీర్తన చేస్తున్నారు. ఎంత అర్థంలేనిది. వారు నిద్రిస్తున్నారు. "కాబట్టి మీరు చూడండి కాబట్టి భౌతిక వ్యక్తి యొక్క దృష్టిలో, ఈ కార్యక్రమాలు రాత్రి వంటివి, నిద్రపోవడము. ఆత్మ-సాక్షాత్కారము పొందిన వ్యక్తికి , ఈ కార్యక్రమాలు నిద్రపోవడము. మీరు చూడండి? కేవలం వ్యతిరేకం. వారు కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి సమయం వృధా చేస్తూన్నట్లుగా చూస్తారు కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి వారు సమయం వృధా చేయడాన్ని చూస్తున్నాడు. ఇది పరిస్థితి. కొనసాగించు.
తమాల కృష్ణ: "అటువంటి ఋషులు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవిస్తుంటారు ఆధ్యాత్మిక సంస్కృతి క్రమంగా అభివృద్ది అవ్వడము ద్వారా, భౌతిక కార్యక్రమాలలో ఉన్న వ్యక్తి, ఆత్మ-సాక్షాత్కారములో నిద్రిస్తుండడము వలన, రక రకాలైన ఇంద్రియ ఆనందము గురించి కలలు కంటున్నాడు "
ప్రభుపాద: అవును. వారు కలలు కంటున్నారు, "ఇప్పుడు మనము దీన్ని చేద్దాము. తరువాత నేను దీనిని కలిగి ఉంటాను తదుపరి సారి, నేను దీనిని కలిగి ఉంటాను. తదుపరి నేను ఆ శత్రువుని చంపుతాను. తదుపరి , నేను దీన్ని చేస్తాను. " వారు అ విధముగా ప్రణాళిక చేస్తున్నారు. కొనసాగించు.
తమాల కృష్ణ: "... నిద్రలో కొన్నిసార్లు సంతోషంగా కొన్నిసార్లు బాధను అనుభూతి చెందుతూ ఉంటారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తి భౌతిక సంతోషముతో, దుఃఖానికి ఎల్లప్పుడూ అతీతముగా ఉంటాడు "
ప్రభుపాద: ఆత్మపరిశీలన కలిగిన వ్యక్తి ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము కొరకు ప్రయత్నిస్తున్నాడో, ఆయనకు బాగా తెలుసు, నేను భవిష్యత్తులో అలాంటి గొప్ప వ్యాపారములు చేస్తే లేదా అలాంటివి... నేను అటువంటి పెద్ద ఆకాశహార్మ్యం ఇంటిని నిర్మించగలను. " కానీ ఆయన ఆత్మ పరిశీలన కలిగి ఉన్నాడు కనుక, ఆయనకు తెలుసు "నేను ఈ విషయాలు అన్నిటితో ఏమి చేస్తాను? ఈ స్థితి నుండి నేను నిష్క్రమించిన వెంటనే, ప్రతిదీ ఇక్కడే ఉంటుంది, నేను మరొక శరీరాన్ని తీసుకుంటాను, మరొక జీవితాన్ని ప్రారంభిస్తాను. "ఇది ఆత్మ పరిశీలన