TE/Prabhupada 0564 - నేను చెప్పుతున్నది ఏమిటంటే భగవంతుని ఆజ్ఞలను అంగీకరించండి, భగవంతుని ప్రేమించండి
Press Interview -- December 30, 1968, Los Angeles
విలేఖరి: నేను ఈ ప్రశ్నలను హాస్యము కొరకు అడగటం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ వ్యాఖ్యానం ఏమిటి, లేదా అది సూత్రప్రాయంగా ఎలా విభిన్నంగా ఉంటుంది యూదు-క్రైస్తవ ధర్మము యొక్క ప్రాథమిక పది కమాండ్మెంట్స్ నుండి? ఇది ఎలా విభిన్నంగా ఉంటుంది?
ప్రభుపాద: ఏ తేడా లేదు.
విలేఖరి: సరే. అలాంటప్పుడు మీరు ఏమి ఇవ్వగలరు... నేను "మీరు" అని చెప్పినప్పుడు (స్పష్టముగా లేదు).
ప్రభుపాద: అవును, అవును.
విలేఖరి: ప్రాధమికంగా, క్రైస్తవ సంస్కృతి లేదా యూదు మతాల కంటే భిన్నముగా మీరు ఏమి ఇస్తున్నారు?
ప్రభుపాద: నేను మీతో చెప్పినట్లు, వారిలో ఏ ఒక్కరూ భగవంతుని ఆజ్ఞాను కచ్చితంగా అనుసరించడము లేదు. నేను చెప్పుతున్నది ఏమిటంటే "భగవంతుని ఆజ్ఞాను పాటించండి". ఇది నా సందేశం.
విలేఖరి: మరో మాటలో చెప్పాలంటే, "మీరు ఈ సూత్రాలను పాటించండి."
ప్రభుపాద: అవును. నేను అది చెప్పడము లేదు మీరు క్రిస్టియన్, మీరు హిందువుగా మారండి లేదా మీరు నా దగ్గరకు రండి. నేను చెప్పేదేమిటంటే "మీరు ఈ ఆజ్ఞలను పాటించండి" అది నా ఆజ్ఞ. నేను మిమల్ని మంచి క్రైస్తవునిగా తయారు చేస్తాను. ఇది నా లక్ష్యం. నేను "భగవంతుడు అక్కడ లేడు, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు" అని అనటం లేదు, కానీ నేను "భగవంతుని అజ్ఞాను పాటించండి" అని కేవలము చెపుతున్నాను. ఇది నా లక్ష్యం. నేను మీరు ఈ స్థితికి రావాలని మరియు కృష్ణుని భగవంతునిగా అంగీకరించండి మరి ఏ ఇతర పద్ధతులను అంగీకరించ వద్దు అని చెప్పడము లేదు. లేదు నేను చెప్పడము లేదు. నేను చెప్పుతున్నది ఏమిటంటే భగవంతుని ఆజ్ఞలను అంగీకరించండి, భగవంతుని ప్రేమించండి. ఇది నా లక్ష్యం.
విలేఖరి: కానీ మరలా...
ప్రభుపాద: భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలనే మార్గమును నేను ఇస్తున్నాను. చాలా సులభంగా, ఏలా ప్రేమించాలి, మీరు అంగీకరిస్తే కనుక
విలేఖరి: సరే, మళ్ళీ ఈ విషయము దగ్గరకు వద్దాము...
ప్రభుపాద: కాబట్టి ఆచరణాత్మకంగా మీరు పాటించండి , నాకు ఎలాంటి వ్యత్యాసము లేదు.
విలేఖరి: అవును, నేను అర్థం చేసుకున్నాను. నేను అభినందిస్తున్నాను. ప్రభుపాద: అవును. మీరు భగవంతుణ్ణి నమ్ముతారు, నేను భగవంతుణ్ణి నమ్ముతాను. నేను కేవలము "మీరు దేవుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించండి" అని చెప్పుతున్నాను.
విలేఖరి: సరే, నేను... నేను ఇప్పటికీ ... నాకు అర్ధము కాలేదు అని కాదు మీరు ఏమి చెప్తున్నారో నేను అర్థం చేసుకున్నాను...
ప్రభుపాద: మీకు ఇంకా అర్ధము కాలేదా?
విలేఖరి: లేదు, లేదు, మీరు ఏమి చెప్తున్నారో నేను అర్థం చేసుకున్నాను. నాకు అర్ధము కానిది ఏమిటంటే లేదా దానిని చేస్తుంది... నేను చెప్పినప్పుడు, నాకు మన పాఠకులలో చాలా మంది.... ఎందుకు ఇది? నన్ను మళ్ళీ ప్రశ్న అడగనివ్వండి. నా మనసులో స్పష్టంగా ఉండటానికి నన్ను అడగ నివ్వండి మీ నోటితో చెప్పించాలి అని నేను కోరుకోవడం లేదు, కానీ నన్ను ఈ విధముగా చెప్పనివ్వండి . మీరు చెప్తున్నారా? యూదుల, క్రిస్టియన్, పశ్చిమ నైతిక విలువలు మరియు మీ లక్ష్యము అంతా ఒకటే అని మళ్ళీ నన్ను అదే ప్రశ్న అడగనివ్వండి. ఎందుకు అలాగా యువత లేదా సాధారణంగా ప్రజలు, నిరుత్సాహముతో ఉన్నారు, తూర్పునకు చెందిన మతముల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, వారి లక్ష్యం లేదా ఆలోచన పాశ్చాత్య విధముగానే ఉన్నా . సూత్రములు ఒకే విధముగా ఉన్నప్పటికీ వారు తూర్పునకు ఎందుకు వెళ్తున్నారు?
ప్రభుపాద: ఎందుకంటే ఈ క్రైస్తవ ప్రజలు, వారు ఆచరణాత్మకంగా ప్రచారము చేయడము లేదు కనుక. నేను ఆచరణాత్మకంగా బోధిస్తున్నాను.
విలేఖరి: మరొక మాటలో చెప్పాలంటే, మీరు ఆచరణాత్మకమైనది అని మీరు భావిస్తున్నది మీరు బోధిస్తున్నారు, ప్రతి రోజు, మనిషి ఆనందము పొందే రోజువారీ పద్ధతిని.
ప్రభుపాద: అవును. ఎలా... భగవంతుని ప్రేమ బైబిల్ లేదా పాత నిబంధన లేదా భగవద్గీత ద్వారా ప్రచారము చేయబడింది, అది సరే. కానీ భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో వారికి భోదించడం లేదు. భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో నేను వారికి బోధిస్తున్నాను. అది తేడా. అందువల్ల యువకులు ఆకర్షించబడుతున్నారు.
విలేఖరి: అది సరే.కాబట్టి అంతిమ ఫలితము ఒక్కటే. ఇది అక్కడకి చేరే పద్ధతి అది.
ప్రభుపాద: పద్ధతి కాదు. మీరు ఆచరించడము లేదు, పద్ధతి ఉన్నా కూడా. ఉదాహరణకు నేను చెప్పినట్టుగా, పద్ధతి ఉంది, "చంపవద్దు", మరియు మీరు చంపుతున్నారు.
విలేఖరి: నేను అర్ధము చేసుకోగలను, కానీ మీరు... అంతిమ ఫలితము ఒక్కటే. మీ అంతిమ ఫలితము...
ప్రభుపాద: అంతిమ ఫలితము ఒక్కటే
విలేకరి: పద్ధతి ఒక్కటే , ఆచరించే మార్గము...
ప్రభుపాద: పద్ధతి కూడా ఒక్కటే కానీ వారు పద్ధతిని అనుసరించమని ప్రజలకు ఉపదేశము చేయడము లేదు. ఆచరణాత్మకంగా వారికి ఎలా అనుసరించాలో మరియు ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నాను