TE/Prabhupada 0568 - మేము కేవలము విరాళాల పై ఆధారపడి ఉన్నాము, మీకు నచ్చినట్లయితే, మీరు చెల్లించవచ్చుPress Interview -- December 30, 1968, Los Angeles


ప్రభుపాద: కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నేను ఇక్కడకు వచ్చాను. నేను విజయము సాధించాను అని అనుకుంటున్నాను. అవును

విలేఖరి: ఆ సమయములో చాలా మంది మారారు అని అనుకోవడము లేదు. ఎంత మంది అనుచరులు ఉన్నారు? (తుమ్ము) నన్ను దయచేసి క్షమించండి.

ప్రభుపాద: అది సరే.

విలేఖరి: అక్కడ ఎంతమంది అనుచరులు ఉన్నారు, ఎంత లోపల? కేవలం వంద?

ప్రభుపాద: వంద కంటే కొంచెం ఎక్కువ. హయగ్రీవ వీరు దీక్ష తీసుకున్న వారు, వీరు తీవ్రముగా పాటిస్తున్నారు. వాస్తవానికి, చాలా మంది ప్రజలు ఆలయాలకు వస్తారు. చాలా మంది వ్యక్తులు మనతో చేరారు.

విలేఖరి: ఎన్ని దేవాలయాలు ఉన్నాయి?

ప్రభుపాద: మాకు పదమూడు ఆలయాలు ఉన్నాయి. పదమూడు.

విలేఖరి: పదమూడు?

ప్రభుపాద: ఒకటి లాస్ ఏంజిల్స్ లో ఒకటి, ఒకటి శాన్ ఫ్రాన్సిస్కో, న్యూ యార్క్ లో ఒకటి, ఒక శాంటా ఫే, ఒక బఫెలో, ఒక బోస్టన్, ఒక మాంట్రియల్లో, ఒక వాంకోవర్, సీయాటెల్, కొలంబస్, ఆపై లండన్, హాంబర్గ్, ఈ విధముగా... హవాయి.

విలేఖరి: సరే, పదమూడు ఆలయాలలో వంద మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు.

ప్రభుపాద: అవును. అవును, వంద కంటే ఎక్కువ, అవును. దాదాపు...

హయగ్రీవ: నాకు తెలీదు.

ప్రభుపాద: అవును, నేను జాబితాను కలిగి ఉన్నాను. వంద కంటే ఎక్కువ ఉన్నారు.

హయగ్రీవ: కనీసం ఎందుకంటే సుమారుగా పది మంది ప్రతి దేవాలయమునకు

ప్రభుపాద: అవును. ఈ ఆలయంలో ఇరవై మంది ఉన్నారు.

విలేఖరి: ఇరవై మంది ఇక్కడ ఉన్నరు. గాడ్ హెడ్ ప్రచురించడానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?

ప్రభుపాద: భగవంతుడు, భగవంతుడు పంపుతాడు. (నవ్వు)

విలేఖరి: సరే, అవును, నేను పరిపూర్ణంగా దానిని అంగీకరిస్తాను, కానీ భగవంతుడు చెక్కులను మరియు అలాంటి విషయాలను వ్రాయడు. నేను కేవలము ఆసక్తి కలిగి ఉన్నాను. నేను చెప్పాలి...

ప్రభుపాద: భగవంతుడు మీకు చెప్తాడు మీరు చెల్లిస్తారు. అంతే.

విలేఖరి: నేను ఆ ప్రశ్నకు సమాధానాన్ని చాలా అనిశ్చితమైన సమాధానం అని చెప్పాలి.

ప్రభుపాద: (నవ్వుతు) అవును. నేను ఇక్కడకు వచ్చాను... మీరు ఆశ్చర్యపోతారు. నేను ఇక్కడకు ఏడు డాలర్లతో మాత్రమే వచ్చాను, మొత్తం సంస్థ వ్యయం ఐదవ వేల డాలర్లు తక్కువ కాదు ప్రతి నెల అని నేను భావిస్తున్నాను. కనీసం.

విలేఖరి: అది అరవై వేలు సంవత్సరానికి. అంటే, అది విరాళంగా వస్తుందా?

ప్రభుపాద: అయిదువేలు చాలా తక్కువ. నేను దాని కంటే ఎక్కువ అని అనుకుంటున్నాను.

హయగ్రీవ: నాకు తెలియదు.

ప్రభుపాద: అవును. మేము చెల్లిస్తున్నాము, ఈ ఆలయం, మేము నాలుగు వందలు చెల్లిస్తున్నాము, కేవలం అద్దె ఇస్తున్నాము. అదేవిధముగా ప్రతి ప్రదేశములో మేము మూడు వందలు, నాలుగు వందల అద్దెను చెల్లిస్తున్నాం.

విలేఖరి: బాగా, ప్రజలు శిష్యులు మరియు భక్తులు కాని వారు సేవలకు వస్తారా?

ప్రభుపాద: అవును. లేదు, ప్రతిఒక్కరిని మనము అనుమతిస్తాము, "రండి కీర్తన చేయండి." మనము ఈ ప్రసాదమును ఇస్తాము. కీర్తన చేయండి, నృత్యం చేయండి, భగవద్గీత వినండి, ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళండి.

విలేఖరి: వేరొక మాటలో చెప్పాలంటే, వారు ఏదైనా ఒకదానిని విరాళంగా ఇవ్వాలనుకుంటే, వారు విరాళము ఇస్తారు.

ప్రభుపాద: అవును. మేము విరాళం అడుగుతాము, "మేము కేవలము విరాళాల పై ఆధారపడి ఉన్నాము, మీకు నచ్చినట్లయితే, మీరు చెల్లించవచ్చు." ప్రజలు చెల్లిస్తారు. అవును.

విలేఖరి: అవును. ఈ పత్రిక ఆవిధముగా ప్రచురించబడుతుందా?

ప్రభుపాద: మాగజైన్ కూడా మార్కెట్కు తీసుకెళ్ళి దానిని విక్రయిస్తాము. ప్రజలు కొనుగోలు చేస్తారు వాస్తవానికి మనకు స్థిరమైన రాబడి లేదు.

విలేఖరి: ఓ, మీకు లేదా.

ప్రభుపాద: లేదు.మేము కేవలం కృష్ణునిపై ఆధారపడుతున్నాము. కానీ కృష్ణుని దయ ద్వారా మన ఉద్యమం పెరుగుతోంది.ఇది తగ్గడము లేదు.

విలేఖరి: అది మంచిది. ఇది ఒక అందమైన పత్రిక కనుక నేను దీని గురించి ఆసక్తిగా ఉన్నాను.

ప్రభుపాద: కాబట్టి మాకు సహాయం చేసేందుకు ప్రయత్నించండి. విలేఖరి: క్షమించండి? ప్రభుపాద: ఈ ఉద్యమానికి సహాయపడటానికి ప్రయత్నించండి. మీ అమెరికా, చాలా మంది ధనవంతులైన వ్యక్తులు ఉన్నారు. ఎవరైనా వచ్చి ఈ ఉద్యమానికి సహాయపడుతుంటే, ఒకరు లేదా ఇద్దరు, మనము చాలా స్థిరమైన పురోగతిని సాధించగలము. మా దగ్గర డబ్బు లేదు. మేము చాలా కష్టపడుతున్నాము. మీరు చూడండి? ఇతడు ఒహయో విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్. కాబట్టి ఆయన సంపాదించినది ఏమైనా, ఆయన దీని కోసం ఖర్చుచేస్తున్నాడు. అదేవిధముగా, ఈ అబ్బాయిలు అందరు, వారు సంపాదించినది ఏదైనా, వారు ఖర్చు చేస్తున్నారు, కానీ అది సరిపోదు, మీరు చూడండి? మేము ప్రచారం చేయడము అవసరం. మేము ఈ పత్రికను తగినంతగా ప్రచురించలేము. మేము నెలకు కనీసం యాభై వేలు ప్రచురించాలనుకుంటున్నాము, కానీ డబ్బు లేదు. మనము దాదాపు అయిదు వేలు ప్రచురిస్తున్నాము

విలేఖరి: ఎవరు అక్కడ శంఖమును ఊదుతున్నారు?