TE/Prabhupada 0574 - మీరు అనుమతి లేకుండా శరీరమును చంపలేరు. అది పాపం



Lecture on BG 2.19 -- London, August 25, 1973


ఆత్మకు జన్మ లేదా మరణం ఎప్పుడూ లేదు ఒకసారి అయినా, లేదా ఆయన ఎప్పుడూ ఉనికిలో లేకుండా లేడు. ఆయన జన్మించలేదు, శాశ్వతము, ఎప్పటికీ ఉంటాడు, ప్రాచీనమైన వాడు. శరీరం చంపబడినప్పుడు కూడా అతడు చంపబడడు."

కావున, వివిధ మార్గాల్లో, కృష్ణుడు ఆత్మ శాశ్వతము అని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వివిధ మార్గాలు. Ya ena vetti hantaram ( BG 2.19) పోరాటం ఉన్నప్పుడు, ఒకవేళ ఒకరు చంపబడినా లేదా... కాబట్టి కృష్ణుడు ఇలా అన్నాడు, "ఈ మనిషి నన్ను హతమార్చాడు, కాబట్టి, లేదా "ఈ మనిషి ఈ మనిషిని చంపవచ్చు," ఈ రకమైన జ్ఞానం ఖచ్చితమైనది కాదు. ఎవరూ ఎవరిని చంపలేరు. అప్పుడు కసాయివాడు చెప్ప వచ్చు, "అప్పుడు మేము చంపినట్లు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావు?" అని వారు అనవచ్చు. వారు శరీరాన్ని చంపుతున్నారు, కానీ ఉత్తర్వు ఉన్నప్పుడు "మీరు చంపకూడదు" అంటే చంప కూడదు. అంటే మీరు అనుమతి లేకుండా శరీరాన్ని కూడా చంపలేరు. మీరు చంపలేరు. ఆత్మ చంపబడనప్పటికీ, శరీరం చనిపోతుంది, అయినప్పటికీ మీరు అనుమతి లేకుండా శరీరమును చంపలేరు. అది పాపం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏదో అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక మార్గము ద్వారా మీరు అతన్ని బయటకు నెడితే, చట్టవిరుద్ధంగా, మీరు అతన్ని బయటకు నెడితే. కాబట్టి మనిషి బయటకు వెళ్లి ఎక్కడో ఆశ్రయం పొందుతాడు. అది సత్యము. కానీ నీవు ఆయనని తన ప్రామాణికమైన స్థానము నుండి బయటకు నెడితే నీవు నేరస్థుడవు. మీరు చెప్పలేరు, "నేను బయటకు నెట్టడము వలన ఆయన వేరే ప్రదేశమును పొందుతాడు." కాదు. అది సరియైనదే, కానీ ఆయనని బయటకు నెట్టడానికి మీకు అధికారము లేదు. ఆయన ఆ అపార్ట్మెంట్లో నివసించడానికి తన చట్టపరముగా అధికారము కలిగి ఉన్నాడు, మీరు అతన్ని బలవంతంగా బయటకు నెట్టడము వలన మీరు నేరస్థులు, మీరు శిక్షించబడాలి.

కాబట్టి కసాయివాడు లేదా జంతువును చంపిన వాడు లేదా ఏ విధముగా చంపిన వాడు ఏ రకమైన వాదనను చేయలేరు. అది "ఇక్కడ, భగవద్గీత ఆత్మను చంపలేరు, అని చెప్తుంది Na hanyate hanyamāne śarīre ( BG 2.20) శరీరం నాశనం అయిన తర్వాత కూడా. ఎందుకు మనము చంపాము అని ఫిర్యాదు చేస్తున్నారు? " కాబట్టి ఇది వాదన, మీరు శరీరాన్ని కూడా చంపలేరు. అది అనుమతించబడదు. అది పాపం. Ubhau tau na vijānīto nāyaṁ hanti na hanyate. కాబట్టి ఎవరూ ఎవరినీ చంపలేరు, లేదా ఎవరూ ఇతరులచే చంపబడరు. ఇది ఒక విషయము. మరలా, వేరొక విధముగా, కృష్ణుడు ఇలా అన్నాడు, న జాయతే: జీవి ఎన్నడూ జన్మించదు. శరీరం యొక్క జన్మ లేదా శరీరం యొక్క మరణం. జీవి, ఆధ్యాత్మిక కణము, అతడు కృష్ణునిలో భాగము, ఎందుకంటే కృష్ణుడు జన్మించడు, చనిపోడు కనుక... Ajo 'pi sann avyayātmā. మీరు నాల్గవ అధ్యాయంలో చూస్తారు. అజో అపి. కృష్ణుడు అజ. అజ అంటే ఎవరైతే జన్మించరో. అదేవిధముగా, మనము కృష్ణుడిలో భాగము మరియు అంశ, మనము కూడా ఎప్పటికీ జన్మించము. జన్మ మరియు మరణం ఈ శరీరముది, మనము శరీర భావనలో నిమగ్నమై ఉన్నాము అప్పుడు శరీరము యొక్క జన్మ లేదా మరణం ఉన్నప్పుడు మనము దుఖము మరియు ఆనందమును అనుభవిస్తాము. ఆనందం అనే ప్రశ్నే లేదు. జన్మ మరియు మరణం, ఇది చాలా బాధాకరమైనది. ఎందుకంటే... ఇది ఇప్పటికే వివరించబడింది. ఆత్మ యొక్క చైతన్యం శరీరమంతా వ్యాపించింది. కాబట్టి, సుఖ దుఖాలు ఈ శరీరము వలన అనుభూతి చెందుతున్నాము. కావున కృష్ణుడు ఇప్పటికే సూచన ఇచ్చారు ఇటువంటి సుఖ దుఖాలు mātrā-sparśās tu kaunteya ( BG 2.14) చర్మమును మాత్రమే తాకుతున్నాయి, ఎవరు చాలా బాధపడకూడదు. Tāṁs titikṣasva bhārata. ఈ విధముగా మన పరిస్థితి గురించి ఆలోచించి నప్పుడు, ఆత్మ-సాక్షాత్కారము, మనం ఎలా శరీరము నుండి భిన్నంగా ఉన్నాం? వాస్తవానికి, ఇది ధ్యానం. మనం శరీరం గురించి చాలా తీవ్రముగా ఆలోచించినట్లయితే, అది ఆత్మ-సాక్షాత్కారము. ఆత్మ-సాక్షాత్కారము అంటే నేను ఈ శరీరం కాదు, నేను అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మ. ఇది ఆత్మ-సాక్షాత్కారము