TE/Prabhupada 0579 - మనం వస్త్రాలు మార్చినట్లే ఆత్మ శరీరాన్ని మారుస్తుంది



Lecture on BG 2.21-22 -- London, August 26, 1973


ప్రద్యుమ్న: అనువాదం - "ఓ పార్థా, ఎలా ఒక మనిషి ఎవరైతే ఆత్మ నాశరహితమైనది అని తెలిసి ఉంటాడో , జన్మలేనిది, శాశ్వతమైనది మరియు మార్పులేనిది, ఎవరినైనా చంపగలడు లేదా ఎవరినైన చంపడానికి కారణం అవచ్చు?

"ఒక వ్యక్తి నూతన వస్త్రాలను ధరించినప్పుడు, పాత వాటిని విడిచిపెట్టడం వలె, అదేవిధముగా, ఆత్మ క్రొత్త భౌతిక శరీరాలను అంగీకరిస్తుంది, పనికిరాని పాత వాటిని వదిలివేస్తుంది."

ప్రభుపాద: అందువల్ల ఇది ఒప్పిస్తున్న మరొక మార్గం. అది... చాలా సులభమైన విషయం. ఎవరైనా అర్థం చేసుకోగలరు. Vāsāṁsi jīrṇāni yathā vihāya (BG 2.22). మన వస్త్రాలు, కోట్లు షర్టులు, అవి పాతవైనప్పుడు, పాడైపోయినప్పుడు, ఉపయోగించటానికి పనికి రావు, కాబట్టి మనము అది పడేసి ఒక కొత్త వస్త్రం చొక్కా, కోటును తీసుకుంటాము. అదేవిధముగా, ఆత్మ శిశువుగా ఉన్నప్పటి నుండి, చిన్నప్పటి నుండి వస్త్రాన్ని మారుస్తుంది. ఉదాహరణకు ఒక శిశువుకు ఒక షూ లభించింది, కాని ఆయన పిల్లల శరీరం పొందినప్పుడు, షూ సరిపోలేదు. మీరు మరొక షూ తీసుకోవాలి. అదేవిధముగా, అదే పిల్లవాడు పెరిగినప్పుడు లేదా శరీరం మారినప్పుడు, ఆయనకు మరొక షూ అవసరం. అదేవిధముగా, మనం వస్త్రాలు మార్చినట్లే ఆత్మ శరీరాన్ని మారుస్తుంది. Vāsāṁsi jīrṇāni. జీర్ణాని అంటే అర్థం అది పాతదైనప్పుడు, ఉపయోగించటానికి సరిపోనప్పుడు, Yathā vihāya, మనము దానిని విడిచిపెట్టినట్లుగా... విహాయ అంటే అది విడిచివేయాలని అర్థం. నవాని, కొత్త వస్త్రం. Naraḥ aparāṇi gṛhṇāti. ఇప్పుడు శరీరాన్ని ఇక్కడ వస్త్రం వలె పోల్చారు. ఉదాహరణకు కోటు చొక్కా వలె. శరీరానికి అనుగుణంగా టైలర్ కోటును కట్ చేస్తాడు. అదేవిధముగా, ఈ భౌతిక శరీరం, అది చొక్కా కోటు ఐతే, అప్పుడు ఆధ్యాత్మిక శరీరం ప్రకారం ఇది కట్ అవుతుంది. ఆధ్యాత్మికం శరీరం రూపం లేకుండా నిరాకారంగా ఉండదు. అది రూపం లేకుండా ఉంటే, ఎలా వస్త్రం, కోటు చొక్కా, చేతులు కాళ్ళు కలిగి ఉంది? ఇది సాధారణ అవగాహన. కోట్ చేతులు కలిగి ఉందా లేదా ప్యాంట్ కాళ్ళు కలిగి ఉందా, ఎందుకంటే కోట్ ను వాడుతున్న వ్యక్తి ఆయన చేతులు కాళ్లు కలిగి ఉన్నాడు.

అందువల్ల ఆధ్యాత్మిక శరీరం ఆకారం లేనిది కాదు అని ఇది రుజువు చేస్తుంది. ఇది సున్నా కాదు, ఇది, అది రూపం గలది. కానీ రూపం చాలా చిన్నది, అణురో అణియాన్, మహతో మహియాన్: ఒక రూపం అణువు కంటే తక్కువగా ఉంటుంది. అణురో అణియాన్, మహతో మహియాన్. రెండు రూపాలు ఉన్నాయి, ఆధ్యాత్మికం. దేవాదిదేవుడు యొక్క రూపం, విరాట్-రూప, మహతో మహియాన్, మనరూపం, అణురో అణియాన్, అణువు కంటే తక్కువ. ఇది కఠోపనిషత్తు లో చెప్పబడింది. Aṇor aṇīyān mahato mahīyān ātmāsya jantor nihito guhāyām. Nihito guhāyām, గుహ్యం అంటే హృదయంలో అని అర్థం. వారిద్దరూ ఉన్నారు. ఇప్పుడు ఆధునిక శాస్త్రము ద్వారా తెలుసుకోండి. ఆత్మ పరమాత్మ ఇద్దరూ, వారు హృదయము లోపల ఉన్నారు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe BG 18.61. హృద్... ఏదీ లేదు... ఇది "శరీరంలో ఎక్కడైనా అది కూర్చుని ఉంది" అని చెప్పబడలేదు. లేదు. Hṛd-deśe, హృదయములో. నిజానికి, వైద్య శాస్త్రం ద్వారా, హృదయము శరీరము యొక్క అన్ని కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. మరియు మనస్సు నిర్వాహకుడు. అక్కడ దర్శకుడు కృష్ణుడు. ఆయన ఇంకొక చోట, sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ (BG 15.15) అన్నాడు. అంతా స్పష్టంగా ఉంది