TE/Prabhupada 0582 - కృష్ణుడు కూడా హృదయము లోపల కూర్చుని ఉన్నారు
Lecture on BG 2.21-22 -- London, August 26, 1973
కాబట్టి పరీక్ష మన చేతిలో ఉంది. మంగళహారతి సమయంలో మనము సోమరితనాన్ని అనుభవిస్తే, నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానము రాలేదని అర్థం. ఒకవేళ ఉత్సాహము కలిగి ఉంటే, "ఇప్పుడు మంగళహారతికి సమయం అయ్యింది, నేను నిద్ర లేవాలి, నేను దీనిని చేయాలి" అది ఆధ్యాత్మికం. ఎవరైనా పరీక్షించవచ్చు. Bhaktiḥ pareśānubhavo viraktir anyatra syāt ( SB 11.2.42) భక్తి అంటే ఆధ్యాత్మికం. కాబట్టి మీరు దేవదిదేవునిచే తాకబడిన వెంటనే, viraktir anyatra syāt, ఈ భౌతిక ప్రపంచంలో ఇంక ఆనందించలేరు. కాబట్టి, కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కృష్ణుడు కూడా హృదయము లోపల కూర్చుని ఉన్నారు, మరియు నేను కూడా అదే హృదయంలో కూర్చొని ఉన్నాను. ఉదాహరణకు ఇద్దరు మిత్రులు ఒకే స్థాయిలో ఇది ఉపనిషత్తులో కూడా వివరించబడింది. Samāne vṛkṣe puruṣo nimagnaḥ. వారు ఒకే స్థాయిలో, కూర్చొని ఉన్నారు. Nimagnaḥ. నిమగ్నః. పక్షి చెట్టు యొక్క పండు తింటుంది, లేదా జీవాత్మ, జీవి, ఆయన తన ఫలాపేక్ష కర్మను చేస్తున్నాడు. క్షేత్రజ్ఞ. ఇవన్నీ వర్ణించబడినవి. Kṣetra-jñaṁ cāpi māṁ viddhi sarva-kṣetreṣu bhārata ( BG 13.3) యజమాని మరియు నివసించేవాడు. నేను ఈ శరీరములో నివసించేవాడిని , మరియు యజమాని కృష్ణుడు. అందువల్ల, కృష్ణుడికి మరో నామము హృషీకేశ. Hṛṣīkeśa. అందువలన ఆయన నిజానికి నా చేయి కాలు కళ్ళు, ప్రతిదీ, నా ఇంద్రియాలన్నిటికీ యజమాని. నేను కేవలం నివసిస్తున్నాను. నేను యజమాని కాదు. కాని మనము మర్చిపోయాము. ఉదాహరణకు మీరు ఒక అద్దె అపార్ట్మెంట్లో ఉన్నట్లయితే, మీరు నివసిస్తున్నారు. గదిలో నివసించడానికి మీకు అనుమతి ఇవ్వబడింది. మీరు యజమాని కాదు. కానీ మీరు యజమాని అని అనుకుంటే, అది, stena eva sa ucyate ( BG 3.12) వెంటనే ఆయన తప్పుగా అర్థం చేసుకున్నట్లు అవుతుంది.
కాబట్టి, ఈ శరీరం లేదా దేశం లేదా ప్రపంచాన్ని తీసుకోండి లేదా విశ్వం, ఏదీ మీకు చెందినది కాదు. యజమాని కృష్ణుడు. యజమాని sarva-loka-maheśvaram ( BG 5.29) నేను యజమానిని అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి తప్పు ఏంటంటే మనకు యజమాని ఎవరో తెలియదు, మరియు మనము, మనము ఆక్రమించినప్పటికీ, మన ఆక్రమణని దుర్వినియోగం చేస్తున్నాము ఇది భౌతిక పరిస్థితి. సరైనది కాదు. లేకపోతే, మార్గము ఉంది, మార్గదర్శకుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తున్నాడు. కానీ వ్యాధి ఏంటంటే మనం యజమాని అని చెప్పుకుంటున్నాము మరియు నా వెర్రితలంపు ప్రకారం వ్యవహరించుదాము అని అనుకుంటున్నాను, అది భౌతిక పరిస్థితి. నా కర్తవ్యము యజమాని కోసం పని చేయడం, నా కోసం కాదు. అందువల్ల అది నా స్థితి, స్వరూపముగా... కృష్ణుడు నన్ను సృష్టించాడు, సృష్టించడము కాదు, కాని కృష్ణుడితో పాటు మన మందరమూ ఉన్నాము. కానీ మనము శాశ్వతమైన సేవకులము. ఈ శరీరంతో పాటుగా, వేలు కూడా జన్మించింది. వేలు భిన్నంగా జన్మించలేదు. నేను జన్మించినప్పుడు, నా వేళ్లు పుట్టాయి. అదేవిధముగా, కృష్ణుడు ఉన్నప్పుడు, కృష్ణుడు ఎన్నడూ జన్మించడు. అప్పుడు మనం కూడా ఎన్నడూ జన్మించము. Na hanyate hanyamāne śarīre ( BG 2.20) చాలా సాధారణ తత్వము. ఎందుకంటే మనము కృష్ణుడిలో భాగము మరియు అంశలము. కృష్ణుడు జన్మించినట్లయితే, అప్పుడు నేను జన్మిస్తాను. కృష్ణుడు జన్మించకపోతే, అప్పుడు నేను, నేను జన్మించలేను. కృష్ణుడు అజ, కాబట్టి మనము కూడా అజ. అజమ్ అవ్యయం కృష్ణుడు నాశనం లేనివాడు, మార్పులేనివాడు. మనము కూడా మార్పులేనివారము, ఎందుకనగా మనము భగవంతుని యొక్క భాగము మరియు అంశలము. కాబట్టి ఎందుకు అంశలు ఉన్నాయి? ఎందుకు నా చేయి ఉంది? ఎందుకంటే నాకు అవసరం. నాకు చేయి యొక్క సహాయం నాకు అవసరం, నా వేలు యొక్క సహాయం నాకు అవసరం. ఇది అవసరం. మూర్ఖులు, "భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడు?" మూర్ఖుడు, ఇది అవసరం. ఎందుకంటే ఆయన భగవంతుడు, ఆయనకు మీ సేవ కావాలి. ఉదాహరణకు ఒక గొప్ప వ్యక్తి లాగానే, ఆయనకు చాలా మంది సేవకులు ఉంటారు. కొందరు మూర్ఖులు ప్రశ్నిస్తే, "మీరు చాలా మంది సేవకులను ఎందుకు ఉంచుకున్నారు?" నేను గొప్ప వ్యక్తిని కాబట్టి, నాకు కావాలి! సాధారణ తత్వము. అదేవిధముగా, భగవంతుడు సర్వోన్నత అధికారి అయితే, అప్పుడు ఆయనకు చాలా సేవకులు ఉండాలి. లేకపోతే, ఆయన ఎలా నిర్వహించగలుగుతాడు?