TE/Prabhupada 0587 - మనలో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక ఆకలితో ఉన్నారు



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


కాబట్టి నేను ఈ కోటును అని నేను అనుకుంటే, ఇది నా అజ్ఞానం. అదే జరుగుతుంది. మానవత్వమునకు సేవ అని పిలువబడేది కేవలం కోటును కడగటమే. మీరు ఆకలితో ఉంటే నేను సబ్బుతో చాలా చక్కగా మీ కోటు కడగడం లాగా, మీరు సంతృప్తి చెందుతారా? లేదు. అది సాధ్యం కాదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక ఆకలితో ఉన్నారు. ఈ ప్రజలు కోటు చొక్కాను కడగటం ద్వారా ఏమి చేస్తారు? ఏ శాంతి ఉండదు. మానవతా సేవ అని పిలవబడేది అంటే ఈ వాసాంసి జీర్ణానిని కడగటం. అంతే. మరణం అంటే, ఇది చాలా చక్కగా వివరించారు, దుస్తులు, మీ దుస్తులు, నా దుస్తులు చాలా పాతవి అయినప్పుడు, మనము దాన్ని మారుస్తాము. అదేవిధంగా, జన్మించటం మరియు మరణించటం అంటే దుస్తులు మార్చటం అని అర్థం. ఇది స్పష్టంగా వివరించబడినది. vasamsi jirnani yatha vihaya ( BG 2.22) జీర్ణాని, పాత దుస్తులు, పాత వస్త్రం, మనం అది పారవేస్తాము, ఇంకొక కొత్త దుస్తులు తీసుకుంటాము, కొత్త వస్త్రం. అదేవిధముగా, vasamsi jirnani yatha vihaya navani grhnati. ఒక కొత్త, తాజా దుస్తులు. అదేవిధముగా, నేను వృద్ధుడను.

కాబట్టి నేను ముక్తి పొందనట్లయితే, ఈ భౌతిక ప్రపంచంలో అమలుచేయటానికి చాలా పథకాలు వేస్తే, నేను మరొక శరీరాన్ని అంగీకరించాలి. కానీ మీకు ఇంకొక ప్రణాళిక లేనట్లయితే, ఇంకొక పథకం లేనట్లయితే, నిష్కించన... దీనిని నిష్కించన అని పిలుస్తారు. Niskincanasya bhagavad-bhajanonmukhasya. చైతన్య మహాప్రభు చెప్తారు, నిష్కించన. ఒకరు పూర్తిగా స్వేచ్ఛ ఉండాలి. ఈ భౌతిక ప్రపంచం నుండి పూర్తి స్వేచ్ఛ. ఒకరు బాగా విసుగు చెందాలి. అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి బదిలీ చేయబడే అవకాశం ఉంది