TE/Prabhupada 0591 - నా కర్తవ్యము ఈ భౌతిక బంధాల నుండి బయటపడటం
Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972
భారతీయుడు:..... ఓంకార-స్వరూప. కానీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను శివుడు, విష్ణువు మరియు బ్రహ్మ ఎవరు? ఈ ముగ్గురు దేవుళ్ళా?
ప్రభుపాద: అవును వారు భగవంతుని యొక్క విస్తరణ. భూమిలాగే. ఆ పై, భూమి నుండి, మీరు చెట్లు కనుగొంటారు, చెక్క. ఆ పై, చెట్టులో, మీరు అగ్ని వెలిగించవచ్చు. అది పొగగా మారుతుంది. అప్పుడు అగ్ని వస్తుంది. మీకు అగ్ని వచ్చినప్పుడు, అగ్ని నుండి మీ పనిని తీసుకోవచ్చు. కాబట్టి, ప్రతిదీ ఒక్కటే, కానీ... కేవలము అదే ఉదాహరణ: భూమి నుండి, చెక్క; చెక్క నుండి, పొగ, పొగ నుండి, అగ్ని. కానీ మీరు వ్యాపారం తీసుకోవలసి వచ్చినట్లైతే, దానికి అగ్ని అవసరం, అయినప్పటికీ, అవి అన్నీ, ఒకటే. అదే విధముగా, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, దేవతలు, ఉన్నారు. అందువలన మీరు పనులను తీసుకోవలసి వస్తే, మీరు అగ్ని దగ్గరకు వెళ్ళాలి, విష్ణువు, సత్తమ, సత్వగుణ. ఇది పద్ధతి. వారు ఒకటి అయినప్పటికీ, మీ పనులు విష్ణువుతో పూర్తి చేయవచ్చు, ఇతరులతో కాదు. నా కర్తవ్యము ఏమిటి? నా కర్తవ్యము ఈ భౌతిక బంధాల నుండి బయటపడటం. అందువల్ల ఎవరైనా ఈ భౌతిక బంధాల నుండి విముక్తి పొందుటకు ఆసక్తిగా వున్నారంటే, అప్పుడు అతడు విష్ణువు ఆశ్రయం తీసుకోవాలి, ఇతరులది కాదు.
భారతీయుడు: దయచేసి నాకు తెలియజేయండి, కోరిక ఏమిటో? మనకు కోరిక ఉన్నంతకాలం, మనం భగవంతుని తెలుసుకోలేము. భగవంతున్ని తెలుసుకోవాలనుకోవడం కూడా ఒక కోరిక.
ప్రభుపాద: కోరిక అంటే భౌతిక కోరికలు. నీవు భారతీయుడవు అని నీవు అనుకుంటే మరియు నీ కోరిక దేశాన్ని ఎలా మెరుగు పరచాలో అని నీవు అనుకుంటే... లేదా చాలా కోరికలు. లేదా అని ఒక కుటుంబపరమైన మనిషివి. కాబట్టి ఇవన్నీ భౌతిక కోరికలు. ఎంతకాలం మీరు భౌతిక కోరికల చే కప్పివేయబడి ఉంటారో, అప్పుడు మీరు భౌతిక ప్రకృతి క్రింద ఉంటారు. మీరు ఇది అని మీరు అనుకున్న వెంటనే, మీ, మీ భారతీయుడు లేదా అమెరికన్ కాదు, నీవు బ్రాహ్మణుడు లేక వైష్ణవుడు కాదు, బ్రాహ్మణుడు లేక క్షత్రియుడు, నీవు కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడివి, దాన్ని శుద్ధమైన కోరిక అని పిలుస్తారు. కోరిక ఉంది, కానీ ఆ కోరికను మీరు పవిత్రం చేయాలి. దాన్ని నేను ఇప్పుడే వివరించాను. సర్వోపాధి-వినిర్ముక్తం ( CC Madhya 19.170) ఇవి ఉపాధులు. మీరు నల్లటి కోటులో ఉన్నారని అనుకుందాం. దాని అర్థం మీరు నల్లటి కోటు అనా? మీరు చెప్పినట్లయితే.... నేను మిమ్మల్ని అడిగితే, " నీవు ఎవరు?" నీవు, " నేను నల్లకోటు", అని చెప్పినట్లయితే, అది సరైన సమాధానమా? కాదు అదే విధముగా, మనకు ఒక దుస్తుల్లో వున్నాము, అమెరికన్ దుస్తులు లేక భారతీయ దుస్తులు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే " నీవు ఎవరు?" " నేను భారతీయుడిని." అది తప్పు గుర్తింపు. " నేను అహం బ్రహ్మస్మి", అని చెప్పినట్లయితే, అది మీ నిజమైన గుర్తింపు. ఆ అవగాహన అవసరము.
భారతీయుడు: నేను ఎలా పొందగలను....
ప్రభుపాద: దానికి అవసరం, ఉ., మీరు వెళ్ళాలి... తపసా బ్రహ్మచర్యేన ( SB 6.1.13) మీరు సిద్ధాంతము అనుసరించాలి. ఆదౌ శ్రద్ధా తతః సాధు-సంగో 'థా భజన-క్రియ (CC Madhya 23.14-15) మీరు పద్ధతిని అంగీకరించాలి. అప్పుడు మీరు గ్రహించగలరు.
భారతీయుడు: కానీ నిన్న( స్పష్టముగా లేదు) ఒక భక్తుడు ఉండేవాడు, అతడు ఈ మొత్తం ప్రపంచాన్ని త్యజించాడు, అడవికి వెళ్ళాడు, అతడు కృష్ణ భగవానుని నామము జపించేవాడు, ఇది మరియు అది. కానీ అతడు, రకమైన, ఒక రకమైన యోగి. అలాగే ఆయన ఒక జింక పై ప్రేమను కలిగి ఉన్నాడు. కాబట్టి మరణ సమయంలో, ఆయనకు జింక గురించి ఆలోచన వచ్చింది, తదుపరి జన్మలో, ఆయన జింకగా మారాడు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఏ కోరికా లేదు, కానీ ఏమైనప్పటికీ ఆయన దానికి వచ్చాడు....
ప్రభుపాద: లేదు, కోరిక ఉంది. అతడు జింక గురించి ఆలోచిస్తున్నాడు. కోరిక ఉంది.
భారతీయుడు: మనము చాలా విషయాల గురించి ఆలోచిస్తాము..