TE/Prabhupada 0616 - బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు -ఇది సహజ విభజన



Lecture at World Health Organization -- Geneva, June 6, 1974


మానవ సమాజం, వారు గొప్ప ఆచార్యుల అడుగుజాడలను అనుసరించకపోతే, గొప్ప సాధువులను, అప్పుడు ఇబ్బంది ఉంటుంది. వాస్తవానికి ఇది జరుగుతోంది. భగవద్గీతలో, కృష్ణుడు ఉన్నప్పుడు..., కృష్ణుడు మరియు అర్జునుడు మాట్లాడు కుంటున్నారు, అర్జునుడు యుద్ధం యొక్క ప్రభావాలను గురించి చెప్పుతున్నాడు , మహిళలు వితంతువులు అవుతారు, వారు వారి శీలమును కాపాడుకోలేరు తరువాత అధర్మ, అధర్మ సూత్రాలు, మొదలవుతాయి. అందువలన ఆయన చెప్పాడు... ఆయన ఇలా వాదిస్తున్నాడు

adharmābhibhavāt kṛṣṇa
praduṣyanti kula-striyaḥ
strīṣu duṣṭāsu vārṣṇeya
jāyate varṇa-saṅkaraḥ
(BG 1.40)

వేదముల నాగరికత varṇāśrama-dharma. వర్ణాశ్రమ-ధర్మమును సరిగ్గా రక్షించకపోతే, అప్పుడు జనాభలో వర్ణ శంకర అని పిలువ బడే జనాభా ఉంటుంది , మిశ్రమ జనాభా. బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు -ఇది సహజ విభజన. సమాజం విభజించబడాలి... Cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) (ప్రక్కన :) అవసరం లేదు. సహజ విభజన... ఉదాహరణకు మీ శరీరంలో సహజ విభజన ఉంటుంది తల, చేతులు, బొడ్డు కాళ్ళు, అదే విధముగా , సామాజిక విభాగాలు ఉన్నాయి. వారిలో కొందరు చాలా తెలివైన వ్యక్తులు, కొన్ని తరగతుల వ్యక్తులు, వారిలో కొందరు క్షత్రియులు, వారిలో కొందరు వ్యాపారము మరియు పరిశ్రమల పై ఆసక్తి కలిగి ఉన్నారు వారిలో కొందరు కడుపును నింపుకోవడానికీ మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఇది సహజ విభజన. అందువల్ల కృష్ణుడు చెప్పుతున్నాడు, cātur-varṇyaṁ mayā sṛṣṭam చెప్తాడు. అయితే ఈ cātur-varṇyaṁ mayā sṛṣṭam, ఈ విభజన... వ్యక్తులలో అత్యంత తెలివైన తరగతి వారిని బ్రహ్మణులుగా శిక్షణ ఇవ్వాలి Śamo damo titikṣa ārjava jñānaṁ vijñānam āstikyaṁ brahma-karma svabhāva-jam ( BG 18.42) సామాజిక విభజన అక్కడ ఉండాలి. అత్యంత మేధస్సు కలిగిన వ్యక్తుల తరగతి, వారిని వేదాలను అధ్యయనం చేయడములో నిమగ్నము చేయాలి, జ్ఞానమును సంపాదించి మరియు మానవ సమాజానికి నేర్పించాలి, తద్వారా వారికి మార్గనిర్దేశం చేయవచ్చు సమాజము యొక్క శాంతియుత పరిస్థితికి అవసరమైన వాటిని చేయడము . అది మార్గదర్శకత్వం. క్షత్రియులు, వారు సమాజమును రక్షించడానికి ఉద్దేశించబడిన వారు , సైనిక శక్తి, లేదా యుద్ధ ఉత్సాహముతో. ప్రమాదం ఉన్నప్పుడు, దాడి జరిగినప్పుడు, వారు మనకు రక్షణ ఇస్తారు. అదేవిధముగా, ఆహార ధాన్యం ఉత్పత్తి కోసం ఒక వ్యక్తుల తరగతి ఉండాలి, ఆవులకు రక్షణ ఇస్తుండాలి. Kṛṣi-go-rakṣya vāṇijyaṁ vaiśya-karma svabhāva-jam ( BG 18.44) మిగిలినవారు, వీరు మేధావులుగా లేదా క్షత్రియులుగా పనిచేయలేరు లేదా ఆహార పదార్థాల ఉత్పత్తిని చేయలేరు, వారు ఈ మూడు తరగతుల వ్యక్తులందరికి సహాయం చేయాలి. వారిని శూద్రులు అని పిలుస్తారు. ఇది సామాజిక విభజన. అందువల్ల దీనిని వర్ణాశ్రమ ధర్మ అని పిలుస్తారు. ధర్మ అనే పదము ఉపయోగించ బడినది ధర్మ అంటే వృత్తిపరమైన ధర్మము. ధర్మ అంటే కొన్ని మతాల ముఢవిశ్వాసము కాదు. కాదు సహజ విభజన మరియు వృత్తిపరమైన ధర్మము.